Reading Time: 2 mins

Rajamouli Birthday Special
డైరెక్టర్ రాజమౌళి బర్త్ డే స్పెషల్

తెలుగు సినిమా శిఖరాన్ని హిమాలయాల్లో కెల్లా మేటైన ఎవరెస్టు స్థాయికి చేర్చిన దర్శకధీరుడు కోడూరి శ్రీశైల శ్రీ రాజమౌళి ఆయనే మన డైరెక్టర్ రాజమౌళి. తెలుగు గౌరవాన్ని ఖండంతరాలు దాటించి హాలీవుడ్ ప్రేక్షకులనే ఆశ్చర్యపడేలా చేసిన ఘనుడు రాజమౌళి.
తెలుగు పరిశ్రమలో ఆయన పేరు ఎప్పుడూ సువర్ణ అక్షరాలతో లిఖించబడి ఉంటుంద. 1973 అక్టోబర్ 10న జన్మించిన రాజమౌళికి చిన్నప్పటి నుంచి సినిమానే ప్రపంచం. కుటుంబం అంతా సినిమా నేపథ్యమే అయినప్పటికీ తానుగా ఎదిగాడు. ఎన్నో ఒడిదుడుకులను ఎదర్కొని, చెమట చుక్కలను చిందిస్తూ తెలుగు సినిమాను తన పర్మనెంట్ అడ్రస్ చేసుకున్నారు.

రాజమౌళి సినిమా ప్రస్తానం ఓ సక్సెస్ సినిమా జర్నీ అంత కిక్కు ఉంటుంది. తండ్రి కోడూరి విజయేంద్ర ప్రసాద్. తెలుగు రచయిత అయిన విజయేంద్ర ప్రసాద్ ఎన్నో సూపర్ హిట్ చిత్రాలకు రచయితగా పనిచేశారు. రాజమౌళి మొదటి శాంతినివాసం సీరియల్‌కు దర్శకత్వం వహించారు. అక్కడే రాజమౌళి ప్రతిభ చూసిన రాఘవేంద్రరావు స్టూడెంట్ నెం.1 సినిమా చేసే అవకాశం ఇచ్చారు. అలా వెండితెరపై తన మార్క్ చూపించారు. అపజయం ఎరగని దర్శకుడిగా వరుసగా చిత్రాలను చేస్తూనే ఉన్నారు. ఎన్టీఆర్ తో నాలుగు చిత్రాలు చేశారు. ప్రభాస్ తో ఛత్రపతి, బహుపలి పార్ట్ 1,2 లు తీశారు. రామ్ చరణ్ తో రెండు సినిమాలు చేశారు. ‘సై’ , విక్రమార్కుడు,’మర్యాద రామన్న, ‘ఈగ’ వంటి చిత్రాలతో అందరిని ఆశ్చర్యపరిచారు.

రాజమౌళి ప్రతిభకు అవార్డులు కొలమానం కాదు.. 2016లోనే ఆయనకు పద్మశ్రీ వచ్చింది. ఉత్తమ దర్శకుడిగా మగధీర, ఈగ, బహుబలి చిత్రాలకు నంది అవార్డులు వచ్చాయి. ఆయన తెరకెక్కించిన ఈగ, బహుబలి పార్ట్ 1, పార్ట్ 2 చిత్రాలకు జాతీయ ఉత్తమ చలన చిత్ర అవార్డులు వచ్చాయి. అలాగే దక్షిణ భారత సినిమా అవార్డులు, మా, సైమా వంటి అనేక అవార్డులు ఆయన్ను వరించాయి. వీటితో పాటు అత్యున్నతమైన అస్కార్ అవార్డు కూడా ఆయన సినిమాలోని పాటకు రావడం విశేషం. ప్రస్తుతం ఆయన మహేష్ బాబుతో ఓ యాక్షన్ అడ్వెంచర్ ప్లాన్ చేస్తున్నారు. దానికి సంబంధించిన పనులు జరుగుతున్నాయి. ఆర్ఆర్ఆర్ చిత్రంతో ప్రపంచాన్ని ఆకర్షించిన ఆయన మహేష్ బాబు చిత్రంతో ప్రపంచాన్ని గెలవాలని బిజినెస్ ఆఫ్ టాలీవుడ్ తరఫున రాజమౌళికి జన్మదిన శుభాకాంక్షలు.