Rakhi Special Movies – Tel
రాఖీ స్పెషల్ మూవీస్
భారతీయులు ప్రేమాభిమానాలకు, అప్యాయతలకు ఎంతో విలువనిస్తారు. అందులోనూ తోబుట్టువులు ప్రేమ ఎంతో ప్రత్యేకమైనది. ఒకే రక్తం పంచుక పుట్టకపోయినా కూడా అన్నా- చెల్లెళ్లు, అక్కా-తమ్ముళ్ల బంధం అద్భుతమైనది. ఏ ఆపాద వచ్చినా నేను ఉన్నా అనే సోదరులు అందరికీ ఉండాలని ప్రతీ ఆడబిడ్డ కోరిక. వీరి బంధానకి గుర్తుగానే రాఖీ పండుగను జరపుకుంటారు. తనకు ఎళ్లవేళల రక్షగా ఉండాలని సంవత్సరంలో ఒక రోజు రాఖీ కట్టి ఆశీర్వాదం తీసుకుంటారు. వీరి బంధంపై మన తెలుగులో సైతం ఎన్నో అద్భుతమైన సినిమాలు తెరకెక్కాయి. కుటుంబ సమేతంగా చూడదగ్గ చిత్రాలు కాబట్టి పండుగ సందర్భ ఆ చిత్రాలు, వాటి విశేషాలు ఏంటో చూద్దాం.
హిట్లర్
మెగాస్టార్ చిరంజీవి హీరోగా ముత్యాల సుబ్బయ్య దర్శకత్వంలో 1997లో తెరకెక్కిన చిత్రం హిట్లర్. ఐదు మంది చెల్లెళ్లకు అన్నయ్యగా, మాధవరావుగా మెగాస్టార్ నటన అందరినీ ఆకట్టుకుంది. వారిని పెంచే క్రమంలో మాధవరావు కాస్త కఠినంగా నడుచుకుంటారు. అది నచ్చని తన చెల్లెళ్లు అన్నయ్యకు ఎదురుతిరగడం, ఆ తరువాత వారికి ఎదురయ్యే కష్టాలు ప్రేక్షకుల గుండెను బరువెక్కిస్తాయి. చిత్రం ఆద్యంతం కట్టిపడేస్తుంది. ఇలాంటి అన్నయ్య అందరికీ ఉండాలి అనే ఆలోచన వస్తుంది.
పుట్టింటికి రా చెల్లి
అర్జున్ సర్జా ప్రధాన పాత్రలో మధుమిత చెల్లెలి పాత్రలో నటించిన చిత్రం పుట్టింటికి రా చెల్లి. కోడి రామ కృష్ణ దర్శకత్వంలో 2004లో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం బాక్స్ ఆఫీస్ వద్ద సంచలనమైన హిట్ సాధించింది. అల్లారు ముద్దుగా పెరిగిన చెల్లెలు అత్తగారింట్లో పడే పాట్లు ప్రేక్షకుడిని కదిలించాయి. ఈ సెంటిమెంట్ చిత్రాన్ని చూడడానికి ఆ సమయంలో కుటుంబాలు మొత్తం థియేటర్ల వద్ద బారులు తీరారు.
అర్జున్
మహేష్ బాబు నటించిన అర్జున్ చిత్రం సైతం ఇదే సెంటిమెంట్‌తో తెరకెక్కింది. అత్త, మామల నుంచి తన సోదరిని కాపాడుకోవాడానికి అన్నగా మహేష్ బాబు ఎంత దూరం అయినా వెళ్తాడు. ఒక సందర్భంలో ఇది నా సమస్య, నేను చూసుకుంటా అని తన సోదరి చెప్పినా, వారి ఇంటి బయటే ఉంటూ కంటికి రెప్పలా కాచుకుంటాడు. 2004లో గుణశేఖర్ దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రం ప్రేక్షకుల మనసును దోచింది.
రాఖీ
డైరెక్టర్ కృష్ణవంశీ, జూనియర్ ఎన్టీఆర్ కాంబినేషన్‌లో 2006లో రాఖీ చిత్రం విడుదలైంది. సమాజంలో స్త్రీలపై జరుగుతున్న ఆకృత్యాలు, ఆగడాలపై రాఖీ చేసే పోరాటమే ఈ చిత్రం కథ. తన చెల్లెకు జరిగిన అన్యాయం సమాజంలో ఏ అమ్మాయికి జరగకూడదని అన్యాయం చేసిన వారిని హతమారుస్తుంటాడు హీరో. దానికి ప్రతీ అమ్మాయి మద్దతు ఉంటుంది. ఈ చిత్రం సైతం ప్రేక్షకుల చేత కట్టతడి పె్టించింది.
గోరింటాకు
హీరో రాజశేఖర్, మీరా జాస్మీన్ అన్నాచెల్లెళ్లుగా నటించిన గోరింటాకు చిత్రం 2008లో విడుదలైంది. చెల్లెలు కోసం అన్నా చేేసే త్యాగం, అన్న కోసం చెల్లెలు చేసే త్యాగం ప్రేక్షకులను కన్నీటి పర్యంతం చేస్తాయి.
శివరామరాజు
జగపతి బాబు ప్రధాన పాత్రలో తెరకెక్కిన శివరామరాజు చిత్రంలో కూడా చెల్లెలు మంచి కోసం అన్నలు తమ ఆస్తి మొత్తాన్ని త్యాగం చేస్తారు. ఈ చిత్రం కూడా ప్రేక్షకులను కట్టిపడేసింది.
ఇవి మాత్రమే కాకుండా బాలకృష్ణ ముద్దుల మావయ్య, పవన్ కళ్యాణ్ నటించిన అన్నవరం, సీనియర్ ఎన్టీఆర్ నటించిన రక్త సంబంధం.
వెంకటేశ్ నటించిన గణేశ్, సూపర్ స్టార్ కృష్ణ నటించిన సంప్రదాయం, శోభన్ బాబు నటించిన జీవనరాగం, చెల్లెలి కాపురం కూడా ఇదే సెంటిమెంట్‌తో తెరకెక్కాయి. అంతే కాకుండా అక్కినేని నాగేశ్వరరావు నటించిన బంగారు గాజులు, కృష్ణం రాజు నటించిన పల్నాటి పౌరుషం చిత్రాలు ప్రధానంగా ఉన్నాయి.