Reading Time: < 1 min

Ram Charan Birthday Special
రామ్ చరణ్ పుట్టిన రోజు ప్రత్యేకత

వినయం, వివేకం, విజయం ఈ మూడు సూత్రాలను పాటిస్తూ తెలుగు పరిశ్రమలో ఆగ్రస్థానంలో ఉన్న నటుడు రామ్ చరణ్. తండ్రి బాటలోనడుస్తూ.. తనకంటూ ప్రత్యేకమైన రూటును ఏర్పాటు చేసుకున్నారు. మెగాఫ్యామిలీలో ఎంత మంది హీరోలు ఉన్నా నెక్ట్స్ జనరేషన్ మెగాస్టార్, పవర్ స్టార్ స్థానాలను ఆయనే రిజర్వ్ చేసుకున్నారు. అందుకే ఆయనకు మెగాపవర్ స్టార్ అనే ట్యాగ్ ఉంది. ఆర్ఆర్ఆర్ సినిమాతో గ్లోబల్ స్టార్ అనే మరో ట్యాగ్ ను సొంతం చేసుకున్నారు. మార్చి 27 ఆయన పుట్టిన రోజు సందర్భంగా పలువురు సినీ ప్రముఖులు ఆయనకు విషేస్ అందిస్తున్నారు. ఈ సందర్భంగా ఆయన ఫిల్మోగ్రఫీని చూద్దాం.

మెగాస్టార్ తనయుడిగా 2007లో పూరిజగన్నాథ్ డైరెక్షన్ లో చిరుత సినిమాతో తెలుగు తెరకు పరిచయం అయ్యారు. మొదటి సిినిమాతోటే డ్యాన్స్ లు, ఫైట్ లు ఇరగదీశాడు. ఇక రామ్ చరణ్ రెండో సినిమా మగధీర చిత్రంతో ఆయనలోని మరో కోణాన్ని పరిచయం చేశారు. పీరియాడికల్ డ్రామాగా తెరకెక్కిన ఈ ఫాంటసీ చిత్రంలో రామ్ చరణ్ యాక్షన్ సీక్వెన్సెస్ చాలా బాగా చేశారు. ఆ తరువాత ఆరెంజ్ సినిమాతో కాస్త తడబడ్డా వెంటనే రచ్చ చేశాడు. నాయక్ సినిమాతో నిలబడ్డారు కానీ తుఫాన్ తో మళ్లీ పడీ ఎవడు లాంటి కాన్సెప్ట్ తో మ్యాజిక్ క్రియేట్ చేశాడు. గోవిందుడు అందరివాడేలే అంటూ పలకరించి బ్రూస్లీతో కాస్త నిరాశ పరిచాడు. అస్సలు నిరుత్సాహ పడకుండా ధృవతారల దూసుకొచ్చి రంగస్థలం లో ఆయన సత్తా చాటారు. వినయ విధయ రామ అంటూ ఆర్ఆర్ ఆర్ సినిమాతో గ్లోబల్ స్టార్ అయ్యారు. ఆచార్యలో కాస్త మెరిశాడు. గేమ్ ఛేంజర్ అంటూ బాక్స్ ఆఫీస్ దగ్గర కాస్త తడబడ్డాడు. ఇప్పుడు బుచ్చి సనా దర్శకత్వంలో పెద్ది సినిమాతో రాబోతున్నారు.

1. Chirutha (2007)

2. Magadheera (2009)

3. Orange (2010)

4. Racha (2012)

5. Naayak (2013)

6. Toofan (2013)

7. Yevadu (2014)

8. Govindudu Andari Vadele (2014)

9. Bruce Lee(2015)

10. Dhruva(2016)

11. Rangasthalam(2018)

12. Vinaya Vidheya Rama(2019)

13. R R R – Roudram Ranam Rudhiram(2022)

14. Acharya (2022)

15. Game Changer (2025)

16. Peddi(2025)