Reading Time: < 1 min

Ram Charan Game Changer Dhop Song Creates Sensation
దూసుకుపోతున్న గేమ్ ఛేంచర్ ధోప్ సాంగ్

రామ్ చరణ్, శంకర్ కాంబినేషన్ లో వస్తున్న తాజా చిత్రం గేమ్ ఛేంజర్. సంక్రాంతి కానుకగా విడుదల అవుతున్న ఈ చిత్రం నుంచి రీసెంట్ గా కొత్త సాంగ్ ను రిలీజ్ చేశారు. ఈ చిత్రానికి సంబంధించిన ప్రీ రిలీజ్ ఈవెంట్ అమెరికాలో జరిగిన విషయం తెలిసిందే. ఈ వేడుకలో ధోప్ సాంగ్ ను రిలీజ్ చేశారు. మ్యూజిక్ డైరెక్టర్ తమన్ స్వరపరిచిన ఈ పాటలో రామ్ చరణ్ గ్రేస్ తో కనిపించారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాని ఓ రేంజ్ లో పాపులర్ అవుతుంది. దీనిపై ప్రేక్షకుల నుంచి రెస్పాన్స్ సాలిడ్ గా ఉంది. పాట విడుదలైన 24 గంటల్లో సాలీడ్ వ్యూస్ వస్తున్నాయి. ధోప్ సాంగ్ కి ఇప్పటివరకు వ్యూస్ పరంగా 22.27 మిలియన్ వ్యూస్ సొంతం చేసుకుంది.
లైక్స్ పరంగా మాత్రం 240K లైక్స్ ను సొంతం చేసుకుంది. సంక్రాంతి కానుకగా వస్తున్న ఈ సినిమాపై భారీగా అంచనాలు ఉన్నాయి. శంకర్ దర్శకత్వం వహించగా ప్రముఖ తెలుగు నిర్మాత దిల్ రాజు అత్యంత భారీ బడ్జెట్ తో ఈ సినిమా తెరకెక్కిస్తున్నారు. ఇందులో కియార అద్వాని హీరోయిన్ గా నటిస్తుండగా అంజలి, శ్రీకాంత్, ఎస్.జే సూర్య, మురళి శర్మ తదితరులు నటిస్తున్నారు.