Reading Time: < 1 min

RRR Heroes Chose the Same Type Of Roles
ఆర్ఆర్ఆర్ తరువాత ఇద్దరి హీరోల పంథా ఒకటే

రాజమౌళి తెరకెక్కించిన ఆర్ఆర్ఆర్ చిత్రంతో స్టార్ హీరోలు రామ్ చరణ్, ఎన్టీఆర్ ల కెరీర్ గ్రాఫ్ ఏవిధంగా పెరిగిందో చూశాము. మూడు సంవత్సరాలు ఆ సినిమాకోసం వారు పడిన కష్టానికి ఫలితం దక్కింది. ఇద్దరికి గ్లోబల్ స్టార్ ఇమేజ్ వచ్చింది. ఆర్ఆర్ఆర్ విజయం తరువాత ఇద్దరి హీరోల నుంచి ఎలాంటి సినిమాలు వస్తాయని అందరు ఎదురుచూశారు. ఈ క్రమంలో రామ్ చరణ్ ప్రధాన పాత్రలో నటించిన ఆచార్య సినిమా విడుదలైంది. ఆ సినిమాను మినహా ఇస్తే ఎన్టీఆర్ నటించిన దేవర, రామ్ చరణ్ నటించిన గేమ్ ఛేంజర్ చిత్రాలలో కొన్ని సిమిలర్ పాయింట్స్ ఉన్నాయి. అవేంటో ఇప్పుడు చూద్దాం.

1. దేవర, గేమ్ ఛేంజర్ రెండూ భారీ బడ్జెట్ పాన్ ఇండియా చిత్రాలే కావడం విశేషం.
2. దేవర, గేమ్ ఛేంజర్ సినిమాల్లో ఎన్టీఆర్, రామ్ చరణ్ ఇద్దరు కూడా ద్విపాత్రాభినయం చేయడం విశేషం.
3. ఈ రెండు సినిమాల్లో ఇద్దరు హీరోలు సైతం తండ్రి కొడుకులాగా నటించారు.
4. రెండు సినిమాల్లో తండ్రి పాత్ర చనిపోతుంది. ఇంకా గమనిస్తే నమ్మిన వారితోటే వెన్నుపోటుకు గురై చనిపోతారు.
5. తండ్రి చేయలేని పని కొడుకు చేయడమే లక్ష్యంగా కథనం సాగడం రెండు సినిమాల్లో కామన్ పాయింట్
6. దేవర సినిమాలో జాన్వీ కపూర్, గేమ్ ఛేంజర్ సినిమాలో కియార అద్వాని ఇద్దరూ కూడా బాలీవుడ్ ముద్దుగుమ్మలే.
7. రెండు సినిమాలో కూడా విలన్ తెలుగు నటుడు కాదు. దేవరలో సైఫ్ అలీఖాన్ బాలీవుడ్ నుంచి, గేమ్ ఛేంజర్ సినిమాలో ఎస్ జే సూర్య తమిళo నుంచి నటించారు.
8. దేవర సినిమాలో దావుదీ అనే పాట, గేమ్ ఛేంజర్ సినిమాలో నానా హైరానా అనే పాట రెండూ కూడా రిలీజ్ తో పాటు విడుదల కాలేదు.
9. రెండు సినిమాల ఫలితాలు మిక్స్ డ్ టాక్ తెచ్చుకున్నాయి.
10. ఇక చివరిగా టాలీవుడ్ లో ఒక పెద్ద మిత్ ఉంది. రాజమౌళి హీరోలకు ఆయన సినిమా తరువాత ఫ్లాప్ ఉంటుంది. ఈ విషయంలో ఇద్దరు హీరోలు ఇదే రకమైన ఫలితాన్ని అందుకున్నారు అని చెప్పవచ్చు.