ధగడ్ సాంబ చిత్రం ట్రైలర్ విడుదల
డైలాగ్ కింగ్ సాయికుమార్ చేతులమీదుగా విడుదలైన బర్నింగ్ స్టార్ సంపూర్ణేష్ బాబు ‘ధగడ్ సాంబ’ ట్రైలర్
బి.ఎస్. రాజు సమర్పణలో ప్రవీణ క్రియేషన్స్ ప్రవేట్ లిమిటెడ్ బ్యానర్ పై సంపూర్ణేష్ బాబు, సోనాక్షి హీరో హీరోయిన్లుగా ఎన్.ఆర్.రెడ్డి దర్సకత్వంలో తెరకెక్కిన ”ధగడ్ సాంబ” చిత్రాన్ని నిర్మాత ఆర్ ఆర్. బీహెచ్ శ్రీనుకుమార్ రాజు నిర్మిస్తున్నారు. తాజాగా సెన్సార్ కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ సినిమాకు.. U/A సర్టిఫికెట్ వచ్చింది. ఒక్క కట్ కూడా లేకుండా సెన్సార్ పూర్తి చేసుకుంది . సెన్సార్ బోర్డు సభ్యుల నుంచి ప్రశంసలు పొంది. పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది.అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకుని విడుదలకు సిద్ధమైన ఈ చిత్రం నుండి ఇంతకుముందు విడుదలైన టీజర్ & ప్రోమోకు మంచి స్పందన లభిస్తోంది..మే 9 సంపూర్ణేష్ బాబు బర్త్ డే సెలెబ్రేషన్స్ ఘనంగా జరుపుకున్నారు.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చిన డైలాగ్ కింగ్ సాయికుమార్ ”ధగడ్ సాంబ” ట్రైలర్ ను విడుదల చేశారు. అనంతరం జరిగిన పాత్రికేయుల సమావేశంలో
డైలాగ్ కింగ్ సాయికుమార్ మాట్లాడుతూ..సంపూర్ణేష్ బాబుకు జన్మదిన శుభాకాంక్షలు. ఉదయం నుంచి సాయంత్రం ఇంటికి వెళ్లేవరకు ప్రతి ఒక్కరు ఎంతో టెన్షన్ కు గురవుతున్నారు. అలాంటి వారికి సంపూర్ణేష్ బాబు సినిమా గొప్ప రిలీఫ్ నిస్తుంది. సుమారు రెండున్నర గంటలు పాటు హాయిగా నవ్వుకునేలా తన సినిమా ఉంటుంది.ఈ సినిమా ట్రైలర్ బాగుంది.ఇందులో మంచి మంచి ఫీల్ కలిగే సీన్స్ చాలా ఉన్నాయి. యాక్షన్ కూడా బాగా చేశాడు.ఈ మద్యే సంపూ తో అన్నాను అన్ని సినిమాలు చేస్తున్నావ్ పోలీస్ స్టోరీ కూడా చేయమన్నాను.నిన్ను అగ్ని గా చూడాలని ఉంది. జమదగ్ని S/O అగ్ని అనే టైటిల్ పెట్టుకోమన్నాను. ఏమో.న్ అది కూడా చేసి సర్ప్రైజ్ ఇస్తాడేమో.. చూడాలి. ఇంకా సంపూ అనేక మంచి సినిమాలు చేయాలని కోరుతున్నాను.టెక్నికల్ అందరూ కూడా చాలా చక్కగా పని చేశారు.మంచి టెక్నీషియన్స్ ను, మంచి నటులను, మంచి కథను సెలెక్ట్ చేసుకొని దర్శక, నిర్మాతలు తీశారు. ఈ నెల 20 న ప్రేక్షకుల ముందుకు వస్తున్న ఈ చిత్రాన్ని ప్రేక్షకులందరూ ఆదరించి ఆశీర్వదించాలని అన్నారు.
చిత్ర దర్శకుడు యన్.ఆర్.రెడ్డి మాట్లాడుతూ..ఈరోజు బర్త్ డే జరుపుకుంటున్న సంపూ కు జన్మదిన శుభాకాంక్షలు.
సంపూ గారు కామెడీ, సెంటిమెంట్ తో పాటు మాస్ ప్రేక్షకులను ఆకట్టుకునే యాక్షన్ ఫైట్స్ చాలా బాగా చేశారు. ఇప్పటి వరకు చేసిన సినిమాలు ఒక ఎత్తైతే ఈ సినిమా సంపూ గారి కెరీర్ లో ది బెస్ట్ సినిమా అవుతుంది.ఈ సినిమాలో సంపూని సరికొత్తగా చూస్తారు.ఈ చిత్రానికి ముజీర్ గారు ఎంతో సపోర్ట్ చేశారు.తను నాకు లైఫ్ టైం ఫ్రెండ్ గా ఉండాలని కోరుకుంటున్నాను. ఇందులో ఎలాంటి వల్గారిటీ లేకుండా ఫ్యామిలీ ఆడియన్స్ అందరూ వచ్చి చూసేలా ఈ సినిమా ఉంటుంది.బాలు గారు చాలా చక్కటి కొరియోగ్రఫీ చేయగా డేవిడ్ గారు మంచి మ్యూజిక్ ఇచ్చారు. పాపారావు గారు చక్కని ఎడిటింగ్ చేశారు.ఫైట్స్ మాస్టర్స్ యాక్షన్స్ సీన్స్ అద్భుతంగా చేశారు. బాషా ,జ్యోతి, అప్పారావు, చలాకీ చంటి ,ఫిష్ వెంకట్ అందరూ చాలా బాగా నటించారు.ఈ సినిమాలో అన్ని రకాల ఎమోషన్స్ ఉంటాయి. నటీనటులు, టెక్నీషియన్స్ అందరూ ఎంతో కష్టపడ్డారు.ఈ నెల 20 న వస్తున్న ఈ చిత్రం ప్రతి ఒక్కరికీ కచ్చితంగా నచ్చుతుంది అన్నారు.
చిత్ర నిర్మాత ఆర్ ఆర్. బీహెచ్ శ్రీనుకుమార్ రాజు మాట్లాడుతూ.. ఈ రోజు బర్త్ డే జరుపుకుంటున్న సంపూ గారికి జన్మదిన శుభాకాంక్షలు.మా చిత్రాన్ని ఆశీర్వదించ డానికి వచ్చిన సాయి కుమార్ గారికి ధన్యవాదాలు. ఈ సినిమా స్టార్ట్ చేసిన తరువాత కొన్ని ఇబ్బందులు పడ్డా వాటిని అధిగమిస్తూ సినిమాను పూర్తిచేయడం జరిగింది.సంపూర్ణేష్ తనదైన శైలిలో స్టెప్స్ వెయ్యడం జరిగింది. అలాగే యాక్షన్ ఫైట్స్ కూడా చాలా చక్కగా చేశారు.ఈ సినిమాలో సంపూని సరికొత్తగా చూస్తారు. హీరోయిన్ సోనాక్షి నటన అదనపు ఆకర్షణ కానుంది. అలాగే ఈ సినిమాకోసం ఎంతో కష్టపడిన చిత్ర యూనిట్ కు ధన్యవాదాలు.సంపూర్ణేష్ బాబు నటించిన సినిమాను మొట్ట మొదటి సారిగా ప్రపంచ వ్యాప్తంగా ఈ నెల 20 న విడుదల చేస్తున్నాము.ఫుల్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ గా ప్రేక్షకుల ముందుకు వస్తున్న మా సినిమాను ప్రేక్షకులు ఆదరించాలని మనస్ఫూర్తిగా కోరుతున్నాను అన్నారు.
హీరో సంపూర్ణేష్ బాబు మాట్లాడుతూ…నాలాంటి చిన్న నటున్ని ఆశీర్వదించడానికి వచ్చిన గురువు గారు సాయి కుమార్ కు పాదాభివందనాలు.కరోనా తర్వాత ఈ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది.అప్పటి నుండి ఇప్పటి వరకు ఏ మాత్రం తగ్గకుండా ధగఢ్ సాంబ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తున్న రెడ్డి గారికి, రాజు గారికి, ముజీర్ గారికి ధన్యవాదాలు.ఇప్పటి వరకు కామెడీ సినిమాలు చేసిన నేను ఈ సినిమాలో సీరియస్ గా వుండే డీఫ్రెంట్ సబ్జెక్ట్ తో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాను. ఈసినిమా లో ఉన్న నాలుగు ఫైట్స్ ను నలుగురు ఫైట్ మాస్టర్స్ తో చేయడం చాలా సంతోషంగా ఉంది. నాతో పాటు జ్యోతి, బాషా, అప్పారావు ఇలా చాలామంది నటిస్తున్నారు కెమెరామెన్ ముజీర్ కొబ్బరిమట్ట నుండి నాతో జర్నీ చేస్తున్నాడు. ఇప్పటి వరకు నేను చేసిన సినిమాలకు భిన్నంగా ఈ సినిమా ఉంటుంది. ఇప్పటి వరకు నా సినిమాలను ఆదరించారు. మంచి కథాంశంతో ఈ నెల20 న వస్తున్న ఈ చిత్రాన్ని కూడా అందరూ ఆదరించాలని మనస్ఫూర్తిగా కోరుతున్నాను.ఈ రోజు నాతో పాటు పుట్టిన రోజు జరుపుకుంటున్న విజయ్ దేవరకొండ కు, సాయి పల్లవి గార్లకు జన్మదిన శుభాకాంక్షలు అన్నారు.
కెమెరా మాన్ ముజీర్ మాలిక్ మాట్లాడుతూ..ఈ రోజు బర్త్ డే జరుపుకుంటున్న సంపూగారు ఇలాంటి బర్త్ డే లు మరెన్నో జరుపుకోవాలి.లాక్ డౌన్ లో చిత్ర యూనిట్ అంతా ఎంతో కష్టపడ్డారు.అందుకే ఈ రోజు సినిమా ఇంత బాగా వచ్చింది.
రాజు మాస్టర్ శిష్యులు ముగ్గురు ఈ సినిమాలో మూడు ఫైట్స్ కు ఫైట్ మాస్టర్స్ గా పని చేశారు. మాకు గురువులైన సాయి కుమార్ ఎంతో బిజీ షెడ్యూల్ లో ఉన్నా మా “ధగఢ్ సాంబ” టీం ను ఆశీర్వదించడానికి వచ్చి చిత్ర ట్రైలర్ విడుదల చేసినందుకు నా ధన్యవాదాలు.సంగీత దర్శకుడు డేవిడ్ అద్బుతమైన మ్యూజిక్ చేశాడు.ఇందులోని పాటలకు మంచి రెస్పాన్స్ వస్తుంది.ఈ నెల20 న ప్రేక్షకుల ముందుకు వస్తున్న ఈ చిత్రం గొప్ప విజయం సాధించాలని అన్నారు.
సంగీత దర్శకుడు డేవిడ్ మాట్లాడుతూ.. సినిమా చాలా బాగా వచ్చింది.ఇందులో ఉన్న నాలుగు పాటలు కూడా మంచి ఊపున్న పాటలు.ప్రేక్షకుల నుండి అద్భుతమైన రెస్పాన్స్ వస్తుంది. ఇలాంటి మంచి సినిమాకు మ్యూజిక్ చేసే అవకాశం ఇచ్చిన దర్శక, నిర్మాత లకు ధన్యవాదాలు అన్నారు.
హీరోయిన్ సోనాక్షి మాట్లాడుతూ.. ఇలాంటి మంచి చిత్రం లో నటించే అవకాశం దర్శక నిర్మాత లకు ధన్యవాదాలు.
నటీనటులు:
సంపూర్ణేష్ బాబు, సోనాక్షి, జ్యోతి, చలాకి చంటి, మిర్చి మాధవి, ఆనందభారతి, పిడి.రాజు తదితరులు
బ్యానర్: ప్రవీణ క్రియేషన్స్ ప్రవేట్ లిమిటెడ్
నిర్మాత: ఆర్.ఆర్
డైరెక్టర్: ఎన్.ఆర్.రెడ్డి
సమర్పణ: బి.ఎస్.రాజు
కెమెరా: ముజీర్ మాలిక్
మ్యూజిక్: డేవిడ్.జి
ఎడిటర్: కె.ఎ. వై.పాపారావు
డాన్స్: బి.బాలు
పి.ఆర్.ఒ: లక్ష్మీ నివాస్