Sankranthiki Vastunnam Trailer Review
సంక్రాంతికి వస్తున్నాం ట్రైలర్ రివ్యూ
విక్టరీ వెంకటేష్, దర్శకుడు అనిల్ రావిపూడి కాంబినేషన్ లో వస్తున్న తాజా చిత్రం సంక్రాంతికి వస్తున్నాము. దిల్ రాజు నిర్మిస్తున్న ఈ చిత్రంలో ఐశర్యరాజేష్, మీనాక్షి చౌదరి హీరోయిన్స్ గా నటిస్తున్నారు. ఈ చిత్రానికి సంబంధించిన ట్రైలర్ విడుదలై యూట్యూబ్ లో మంచి బజ్ క్రియేట్ చేస్తోంది. ట్రైలర్ లోనే కథ ఏంటి అనేది చెప్పేశారు. ఒక వ్యక్తి కిడ్పాప్ వలన రాష్ట్రంలోని గవర్నమెంట్ పడిపోయే అవకాశం ఉందని, అతన్ని కాపాడలని ఒక టీమ్ ను తీసుకుంటారు. ఆ టీమ్ కు ఎక్స్ పోలీస్ మెన్ అయిన వెంకటేష్ అవసరం ఉంటుంది. దాంతో అతన్ని తీసుకురావాడినికి మీను వెళ్తుంది. అప్పటికే భాగ్యను పెళ్లిచేుకొని నలుగురు పిల్లలతో హాయిగా ఉంటున్న వెంకటేష్ లైఫ్ లోకి మీను రావడంతో, ఆ తరువాత వారి కుటుంబంలో ఏం జరిగింది అనేది కామెడీతో చూపించనున్నట్లు ట్రైలర్ చూస్తే అర్థం అవుతుంది.
కిడ్నాప్ ఆపరేషన్ కు సిద్దం అయిన వెంకటేష్ వెంట భాగ్యం కూడా వెళ్తాననడం చాలా ఇంట్రెస్టింగ్ పాయింట్. వీరంత అతన్ని ఎలా కాపాడుతారు అనేది కథ. అయితే క్లైమాక్స్ ఒక మంచి ట్విస్ట్ ఎక్స్ పెక్ట్ చేసేలా ఉంది ట్రైలర్. ఇప్పటికే విడుదలైన పాటలు అన్ని చాలా బాగున్నాయి. ఇప్పుడు ట్రైలర్ కూడా నచ్చడంతో సినిమాపై మంచి అంచనాలు ఏర్పడ్డాయి.
Movie Title : Sankranthiki Vasthunam
Banner: Sri Venkateswara Creations
Release date:-14.01.2025
Cast : Venkatesh Daggubati, Meenakshi Chaudhary, Aishwarya Rajesh, Upendra Limaye
Writer – Director: Anil Ravipudi
Music: Bheems Ceciroleo
Cinematography : Sameer Reddy
Editor: Tammiraju
Producer: Shirish