Reading Time: 2 mins

Saripodhaa Sanivaaram Movie Press Meet

సరిపోదా శనివారం మూవీ ప్రెస్ మీట్ 

 

డి వి వి ఎంటర్ టైన్మెంట్స్ బ్యానర్ లో డి వి వి దానయ్య నిర్మాతగా, వివేక్ ఆత్రేయ దర్శకత్వంలో, నేచురల్ స్టార్ నాని, ఎస్ జె సూర్య, ప్రియాంకా మోహన్ ప్రధాన పాత్రలుగా వస్తున్న యాక్షన్ ఎంటర్ టైనర్  ‘ సరిపోదా శనివారం ‘ సినిమా మీడియా సమావేశం దసపల్లా హోటల్ లో గ్రాండ్ గా జరిగింది.

ఇప్పటికే ఈ సినిమా నుండి రిలీజ్ అయిన పోస్టర్స్, సాంగ్స్,టీజర్, ట్రైలర్ అన్నీ ప్రేక్షకుల అంచనాలను రోజు రోజుకి పెంచేస్తున్నాయి. ట్రైలర్ వచ్చిన తర్వాత ఈ సినిమా పై అమాంతంగా హైప్ క్రియేట్ అయింది. కాగా ఇప్పటికే సినిమా తేదీ ఆగస్ట్ 29 అని ప్రకటించడంతో పోస్ట్ ప్రొడక్షన్ పనులతో పాటు ప్రమోషన్ ఈవెంట్స్ తో హీరో నాని బిజీగా వున్నారు. విడుదల రిలీజ్ డేట్ దగ్గరవుతుందటంతో, చిత్ర బృందం వివిధ భాషల్లో ప్రమోషనల్ ఈవెంట్స్ లో విరామం లేకుండా పాల్గొంటున్నారు. అందులో భాగంగా ఈరోజు హైదరాబాద్ లో మీడియాతో జరిగిన క్వశ్చన్ అండ్ ఆన్సర్ సెషన్ లో హీరో నాని, హీరోయిన్ ప్రియాంక అరుల్ మోహన్, ప్రముఖ నిర్మాత దిల్ రాజు, దాసరి కళ్యాణ్ తదితరులు పాల్గొన్నారు.

 

నాని మాట్లాడుతూ..” ఈ సినిమాకి పని చేసిన ప్రతి టెక్నీషియన్ మరియు యాక్టర్స్ చాలా చాలా కష్టపడ్డారు, వాళ్ళ కష్టానికి మించి సక్సెస్ రాబోతుంది. డైరెక్టర్ వివేక్ ఆత్రేయ ఈరోజు కూడా పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ లో బిజీ గా వుండి ప్రెస్ మీట్ కి రాలేకపోయారు. ముఖ్యంగా మ్యూజిక్ డైరెక్టర్ జేక్స్ బిజోయ్ పేరు ఇకపై తెలుగు ఇండస్ట్రీ లో మారుమోగిపోతోంది. ఇప్పుడే దిల్ రాజు గారు కన్ఫర్మ్ చేశారు హైదరాబాద్ మెయిన్ థియేటర్ గా సుదర్శన్ 35 ఎంఎం ఫిక్స్ చేశారు, ఈ 29th మార్నింగ్ షో మీ అందరితో కలిసి చూస్తా. కానీ ఒక్క షరతు ఆరోజు అందరూ ఇలా రెడ్ క్లాత్ కట్టుకొని రండి. సినిమా చూస్తూ సెలబ్రేట్ చేసుకుందాం”.

ప్రియాంక మోహన్ మాట్లాడుతూ ” నాని గారితో ఇది నాకు రెండో సినిమా, నాని గారితో కలిసి వర్క్ చేయడం ఛాలెంజింగ్ గానూ, ఒక పిక్నిక్ లా సెట్లో వుంటుంది. అంతేకాకుండా నాకు అదొక లెర్నింగ్ ఎక్సపీరియెన్స్. ఈ సినిమా కథ నా పాత్ర చారులత చుట్టూ వుంటుంది. చారు క్యారెక్టర్ మీకు ఖచ్చితంగా నచ్చుతుంది” అని చెప్పారు.

నిర్మాత డి వి వి దానయ్య గారు మాట్లాడుతూ ” సినిమా బాగా వచ్చింది. ఈ సినిమాలో నాని నటన మొదటి నుండి చివరి వరకు నెక్స్ట్ లెవెల్ లో వుంటుంది.దానికి తగ్గ కథ, నానికి సరితూగే ఎస్ జె సూర్య గారి నటన అద్భుతంగా స్క్రీన్ మీద పండింది. మా బ్యానర్ నుండి RRR తర్వాత మరో బ్లాక్ బస్టర్ మూవీ వస్తోంది. మీరందరూ థియేటర్ లో ఖచ్చితంగా ఎంజాయ్ చేస్తారు, OG సినిమా డిసెంబర్ లో రిలీజ్ వుంటుంది. కళ్యాణ్ గారు త్వరలో షూటింగ్ లో పాల్గొని తన పార్ట్ ని పూర్తిచేస్తారు.” అని చెప్పారు.