Saripodhaa Sanivaaram Is Lengthy Movie
నాని సరిపోదా శనివారం మూవీ నిడివి ఎక్కువే
నేచురల్ స్టార్ నాని హీరోగా నటిస్తున్న తాజా చిత్రం సరిపోదా శనివారం. వివేక్ ఆత్రేయ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని డీవీవీ దానయ్య ప్రొడ్యూస్ చేస్తున్న విషయం తెలిసిందే. ఈ సిినిమా ఆగస్టు 29న ప్రేక్షకుల ముందుకు వస్తుండడంతో మూవీ ప్రొమోషన్స్ వేగవంతం చేశారు. అంతే కాకుండా పాన్ఇండియా సినిమా కాబట్టి అన్ని లాంగ్వేజ్‌లలో ప్రమోషన్లు చేస్తున్నారు. ఇక హీరో నాని కెరియర్‌లో సరిపోదా శనివారం ఒక ప్రత్యేకమైన చిత్రమని ఆయనే స్వయంగా చెప్పారు. దాంతో చిత్రంపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ఇప్పటికే విడుదలైన ట్రైలర్ అందరినీ ఆకట్టుకుంది. వీటిన్నింటి మధ్య ఒక విషయం మాత్రం నాని అభిమానులను భయపెడుతుంది. రన్ టైం విషయంలో మూవీ టీమ్ కాన్ఫిడెంట్‌గా ఉన్నప్పటికీ అభిమానులు మాత్రం కాస్త కంగారు పడుతున్నట్లు తెలుస్తుంది.
ఈ మధ్య వచ్చే అన్ని సినిమాలు 2 గంటల 30 నిమిషాలు మించడం లేదు. నిజానికి ప్రేక్షకులు సైతం రెండున్నర గంటల సినిమాకు అలవాటు పడ్డారు. ఈ తరుణంలో 3 గంటల నిడివితో ఎదైనా మూవీ విడుదల అవుతుందంటే దానిపై చర్చ సాగుతుంది. అందుకే తప్పనిసరి అయితే తప్ప రన్ టైం రెండున్నర గంటలు దాటడం లేదు. అందుకే ఈ విషయంలో చిత్రబృందం చాలా జాగ్రత్తగా వ్యవహరిస్తుంది. మూవీ బాగున్నా సరే లెంగ్త్ ఎక్కువైతే ప్రేక్షకులు బోర్ అంటున్నారు. అందుకే వీలైనంత వరకు ఎడిటింగ్ రూమ్‌లోనే లెంగ్త్ కంట్రోల్ చేస్తున్నారు. ఇక సరిపోదా శనివారం సినిమా నిడివి విషయంలో కూడా అదే ప్రచారం కొనసాగుతుంది.
సరిపోదా శనివారం మూవీ రన్ టైమ్ 2 గంటల 50 నిమిషాలు. దీనిలో టైటిల్స్ ఓ మూడు నిమిషాలు తీసేసిన 2 గంటల 47 నిమిషాలు ఉంటుంది. తాజా పరిస్థితుల్లో ఇది కాస్త ఎక్కువే, అయినా సరే కంటెంట్‌పై నమ్మకంతో మూవీ టీమ్ రిస్క్ తీసుకుంటుంది. హీరో నాని, యాక్టర్, డైరెక్టర్ ఎస్‌జే సూర్య మధ్య వచ్చే సీన్లు సినిమాకు హైలెట్ అవుతాయని తెలుస్తుంది. ఈ చిత్రంలో కథ సోకులపాలెం నేపథ్యంలో సాగుతుందని ట్రైలర్ చూస్తే అర్థం అయింది. హీరో నాని నటించిన మూవీస్‌కు సంబంధించిన ప్రమోషన్లు నాని దగ్గరుండి చూసుకుంటాడున్న విషయంత తెలిసిందే. దానిలో భాగంగానే సరిపోదా శనివారం చిత్రాన్ని పాన్ ఇండియా స్థాయిలో అన్ని చోట్లా తానే ప్రమోట్ చేస్తున్నారు.
సినిమా నిడివి విషయంలో విమర్శకులు మరో అభిప్రాయాన్ని సైతం చెబుతున్నారు. కంటెంట్ ఎంగేజ్ చేస్తే నిడివి పెద్ద మ్యాటర్ కాదని అంటున్నారు. ఈ మధ్య వచ్చిన అనిమల్ చిత్రాన్ని అందుకు ఉదాహారణగా చూపిస్తున్నారు. సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో రణ్‌బీర్ కపూర్ హీరోగా తెరకెక్కిన అనిమల్ చిత్రం ఏకంగా 3 గంటల 21 నిమిషాల రన్ టైం ఉంది. అయినా సినిమా కమర్షల్‌గా హిట్ అయింది. దీని విషయంలో లెంగ్త్ గురించి ఎవరూ ప్రస్తావించలేదు. కథ బాగుంటే ప్రేక్షకులు 3 గంటల వరకు కూర్చోవడంలో ఎలాంటి ఇబ్బంది పడరని మరికొన్ని సినిమాలు సైతం నిరూపించాయి. దీన్ని బట్టి చూస్తే సరిపోదా శనివారం సినిమా కథలో దమ్ము ఉంటే నిడివి సమస్య ఉండదు అనేది స్పష్టం అవుతుంది. ఈ విషయంలో అభిమానులు ఎవరూ కంగారు పడాల్సిన పని లేదని తెలుస్తుంది. చూడాలి మరి విడుదల తరువాత నిడివి ప్లస్ అవుతుందో, మైనస్ అవుతుందో.