Saripodhaa Sanivaram Director Vivek Athreya
సరిపోదా శనివారం డైరెక్టర్ వివేక్ ఆత్రేయ
తెలుగు ఇండస్ట్రీలో ట్యాలెంటెడ్ దర్శకులు ఎంతో మంది ఉన్నారు. అందులో వివేక్ ఆత్రేయ ఒకరు. మొదటి సినిమా నుంచి వినుత్నమై కథలతో అలరిస్తున్నారు. తాజాగా నేచురల్ స్టార్ నాని హీరోగా సరిపోదా శనివారం అనే చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు. వివేక్ ఆత్రేయ అందరిలా కమర్షియల్ చిత్రాలు చేయడం లేదు, అందుకే ఆయనకు రావాల్సిన గుర్తింపు రావడం లేదని అంటే సుందరానికి చిత్రం విడుదలైన సమయంలో చాలా మంది అన్నారు. కమర్షియల్ చిత్రాలు కాదు కంటెంట్ ఉన్న చిత్రాలను అందించాలనేది ఆయన కాన్సెప్ట్ అని ప్రెస్ మీట్‌లో పేర్కొన్నారు. ఇప్పుడు కంటెంట్‌తో పాటు కమర్షియల్ ఎలిమెంట్స్ యాడ్ చేసి సరిపోదా శనివారం సినిమాతో గురువారం థియేటర్లకు వస్తున్నారు.
వివేక్ ఆత్రేయా బీ.టెక్ పూర్తి చేసుకొని తమిళనాడులోని ఐబీఎం కంపెనీలో జాబ్ చేశారు. ఆ తరువాత సినిమాలకోసం హైదరాబాద్ వచ్చారు. కొత్త వాళ్లను ప్రోత్సహిస్తూ.. తరుణ్ భాస్కర్, విజయ్ దేవరకొండలతో పెళ్లి చూపులు చిత్రాన్ని రూపొందించిన రాజ్ కందుకూరి కథ చెప్పారు. దాంతో శ్రీ విష్ణు, నివేతా పేతురాజ్ హీరోహీరోయిన్లుగా మెంటల్ మదిలో చిత్రం 2017లో తెరకెక్కింది. రోమాంటిక్ లవ్ డ్రామాతో ప్రేక్షకులను కూర్చొబెట్టాడు వివేక్. ఆతరువాత థ్రిల్లర్ డ్రామాగా తెరకెక్కిన చిత్రం బ్రోచేవారేవరురా.
యంగ్ హీరో శ్రీ విష్ణుతో రెండవ సారి కాంబినేషన్‌లో బ్రోచేవారేవరురా చిత్రం మంచి విజయాన్ని అందుకుంది. ఈ చిత్రంలో శ్రీవిష్ణుతో పాటు, సత్యదేవ్, నివేతా థామస్, నివేతా పేతురాజ్ నటించారు. ఈ చిత్రం రైటింగ్‌కు గాను క్రిటిక్స్ ఛాయిస్ ఫిల్మ్ అవార్డును వివేక్ ఆత్రేయా అందుకున్నారు. ఈ చిత్రాన్ని కన్నడలో రీమేక్ చేశారు. అలాగే హిందీలో సైతం రీమేక్ చేశారు. సెకండ్ సినిమాతో మంచి మార్కులు కొట్టేసిన వివేక్ సాగర్ తరువాత నేచురల్ స్టార్ నానితో కలిసి పనిచేశారు.
నేచురల్ స్టార్ నాని, నజ్రియా నజిమ్ జంటగా ఓ లవ్, సస్పెన్స్ డ్రామాతో భిన్న మతాలకు చెందిన రెండు కుటుంబాల నేపథ్యంలో సాగే కథే అంటే సుందరానికి చిత్రం. నాని అద్భుతంగా నటించినా, నజ్రియా ఆకట్టుకున్న ఎక్కడో పట్టుతప్పిన ఫీలింగ్‌తో అంటే సుందరానికి చిత్రం బాక్స్ ఆఫీస్ వద్ద పెద్దగా ఆడలేదు. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ కాబట్టి బడ్జెట్ కూడా పెరిగింది. బ్రోచేవారేవరురా చిత్రానికి, అంటే సుందరానికి ఈ రెండు చిత్రాలకు మ్యూజిక్ డైరెక్టర్‌గా వివేక్ సాగర్ పనిచేశారు. వివేక్ ఆత్రేయా ఆయన పేరు మాత్రమే కాదు ఆయన మాటలు కూడా సౌమ్యంగానే ఉంటాయి. ఆయన సినిమాలు కూడా అంతే సౌమ్యంగా ఉంటాయి. అయితే సరిపోదా శనివారం మాత్రం కాస్త భిన్నంగా ఉంటుందేమో అని ట్రైలర్ చూస్తే అర్థం అవుతుంది.
డీవీవీ ఎంటర్‌టైన్మెంట్ బ్యానర్‌పై డీవీవీ దానయ్య రూపొందిస్తున్న చిత్రం సరిపోదా శనివారం. వివేక్ ఆత్రేయ హీరో నానితో బ్యాక్ టు బ్యాక్ తీస్తున్న చిత్రం ఇది. నాని సరసన బ్యూటీఫుల్ హీరోయిన్ ప్రియాంక అరుళ్ మోహాన్ నటిస్తోంది. జేక్స్ బేజాయ్ మ్యూజిక్ డైరెక్టర్‌గా పనిచేస్తున్నారు. ఆగస్టు 29 గురువారం ఈ చిత్రం విడుదలకు సిద్ధం అవుతోంది. అయితే వివేక్ తెరకెక్కించిన అన్ని చిత్రాలకు కంటే ఈ చిత్రానికి బడ్జెట్ ఎక్కువ. దాదాపు రూ. 90 కోట్లతో తెరకెక్కిన ఈ చిత్రం బాక్స్ ఆఫీస్ వద్ద తన అదృష్టాన్ని పరీక్షించుకోనుంది. ఇప్పటి వరకు చిన్న బడ్జెట్ చిత్రాలను హ్యండీల్ చేసిన వివెక్ ఆత్రేయ ఇంత బడ్జెట్ చిత్రాన్ని ఎలా హ్యండీల్ చేశారా చూడాలి మరి.