Reading Time: 2 mins

Saripodhaa Shanivaaram Hero Nani – New Directors

నాని పరిచయం చేసిన దర్శకులు

సినిమా పరిశ్రమలో ఏ విభాగంలో పని చేయాలన్నా అనుభవం ఉందా అని అడుగుతారు. అలాంటిది డైరెక్షన్ ఫీల్డ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. కానీ టాలీవుడ్‌లో కొంత మంది హీరోలు మాత్రం కథ నచ్చితే చాలు కొత్త దర్శకుడైనా అవకాశం ఇస్తారు. అలా కొత్త డైరెక్టర్లను తెలుగు తెరకు పరిచయం చేసిన వారిలో కింగ్ నాగార్జున మొదటి వరుసలో ఉంటారు. ఆ తరువాత మాస్ మహారాజ్, నెక్ట్స్ నేచురల్ స్టార్ నాని ఉంటారు. చేసినవి తక్కువ సినిమాలే అయినా సరే ఎక్కువ మందికి అవకాశం ఇచ్చి నూతన ట్యాలెంట్‌ను పరిశ్రమకు అహ్వానించారు. నాని పరిచయం చేసిన దర్శకులు ఎవరో చూద్దాం.

1. హీరో నానితో సత్యం బెల్లంకొండ తెరకెక్కించిన చిత్రం స్నేహితుడా. అప్పటికే నాని హీరోగా అష్టాచమ్మ, రైడ్ రెండు చిత్రాలు చేశారు.
2009లో స్నేహితుడా సినిమా తీసిన తరువాత సత్యం బెల్లం కొండ మిస్టర్. మన్మథ చిత్రాన్ని 2013లో తెరకెక్కించారు.

2. 2010లో నాని హీరోగా తెరకెక్కిన ఎమోషనల్ చిత్రం భీమిలీ కబడ్డీ జట్టు. ఈ చిత్రానికి దర్శకత్వం వహించిన తాతినేని సత్యకు నాని తొలి అవకాశం ఇచ్చారు. ఆ తరువాత సత్య శివ మనసులో శృతి, శంకర, వీడెవడు వంటి చిత్రాలు డైరెక్ట్ చేశారు.

3. తెలుగు లేడీ డైరెక్టర్ నందిని రెడ్డికి సైతం హీరో నానినే తొలి అవకాశం ఇచ్చారు. వీరి కాంబినేషన్‌లో 2011లో అలా మొదలైంది చిత్రం విడుదలైంది. ఈ చిత్రం నాని కెరీర్‌లో మంచి హిట్ అందుకున్నారు. ఇక నందిని రెడ్డి సైతం అలా మొదలైంది తరువాత బిజీ అయ్యారు. వరుసగా జబర్దస్త్, కళ్యాణం వైభోగం, ఓ బేబీ, పిట్ట కథలు, అన్నీ మంచి శకునాలే వంటి చిత్రాలను తెరకెక్కించారు.

4. ఎవడే సుబ్రమణ్యం చిత్రంతో నాగ్ అశ్విన్ తెలుగు తెరకు పరిచయం అయ్యారు. ఇప్పుడు పాన్ ఇండియా మూవీ కల్కిని తెరకెక్కించారు. అయితే 2015లో నాగ్ అశ్విన్‌ను పరిచయం చేసిన క్రేడిట్ సైతం నానికే చెల్లుతుంది.

5. అప్పటికే ఎంతో పేరున్న నాని 2017లో సైతం మరో కొత్త దర్శుకుడికి అవకాశం ఇచ్చారు. శివ నిర్వాణ దర్శకత్వంలో నిను కోరి సినిమాలో నటించి, డైరెక్టర్‌కు అవకాశం కల్పించారు. శివ నిర్వాణ జర్నీ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. విజయ్ దేవరకొండ, సమంత కాంబినేషన్‌లో వచ్చిన ఖుషి వరకు ఆయన తీసిన చిత్రాలన్నీ తెలుగు ప్రేక్షకులకు తెలుసు.

6. హిట్ సినిమాతో తెలుగు తెరపై మ్యాజిక్ చేసిన శైలేష్ కొలను దర్శకుడికి 2020లో అవకాశం ఇచ్చారు. ఆ తరువాత దర్శకుడు శైలేష్ కొలను హిట్ 2, సైంధవ్ వంటి చిత్రాలు చేశారు.

7. తెలంగాణ నేపథ్యంలో వచ్చి మంచి కమర్షల్ హిట్ సాధించిన నాని చిత్రం దసరా. ఈ చిత్రానికి దర్శకత్వం వహించిన శ్రీకాంత్ ఓదెల సైతం కొత్త దర్శకుడే. ప్రస్తుతం నానితో దసరా 2 ప్లాన్ చేసుకుంటున్నారు శ్రీకాంత్.

8. నేచురల్ స్టార్ నాని, బ్యూటిఫుల్ హీరోయిన్ మృణాల ఠాకూర్ కాంబినేషనల్ వచ్చిన చిత్రం హాయ్ నాన్నా. ఈ మూవీతో శౌర్వూవ్ దర్శకుడిగా పరిచయం అయ్యారు. ఆ క్రేడిట్ హీరో నానికే దక్కుతుంది.

నాని ఇప్పటి వరకే మొత్తం 30 చిత్రాలలో నటించారు. అందులో 8 మంది కొత్త దర్శకులకే అవకాశం ఇచ్చారు. ఇక మిగిలిన దర్శకులు సైతం ఒక సినిమా తీసిన వారికే ఎక్కువగా అవకాశం ఇచ్చారు. ఇన్ని చిత్రాలు తీసినా సరే కథ నచ్చితే మళ్లీ కొత్త వాళ్లకు అవకాశం ఇవ్వడానికి నాని ఎప్పుడూ ముందే ఉంటారు. హీరో నానిది ఎంతో గొప్ప మనుసు ఎందుకంటే ఒక డైరెక్టర్ గత ఫలితాన్ని దృష్టిలో పెట్టుకోకుండా కథ నచ్చితే అవకాశం ఇచ్చేస్తారు. అలానే సరిపోదా శనివారం చిత్రం తెరకెక్కింది. వివేక్ దర్శకత్వంలో వచ్చిన అంటే సుందరానికి నెగిటీవ్ టాక్ వచ్చిన సంగతి తెలిసిందే. అయినా సరే అవేవి పట్టించుకోకుండా మళ్లీ మంచి కథ కుదరడంతో అవకాశం ఇచ్చి గొప్ప మనుసు చాటుకున్నారు నేచురల్ స్టార్ నాని.