Saripodhaa Sanivaaram Movie Review
సరిపోదా శనివారం మూవీ రివ్యూ
Emotional Engagement Emoji
నేచురల్ స్టార్ నాని సినిమా వస్తుంది అంటే మినిమమ్ గ్యారెంటీ అనే నమ్మకంతోనే థియేటర్లకు వెళుతాము. వినుత్నమైన కథలతో ఫ్యామిలీ ఆడియెన్స్‌ను దృష్టిలో నాని సినిమాలు తీస్తుంటారు. దర్శకుడు వివేక్ ఆత్రేయ, నాని కాంబినేషన్‌లో గతంలో అంటే సుందరానికి అనే చిత్రం ఆశించిన ఫలితం రాకపోయినా, వీరి కాంబినేషన్ మళ్లీ తెరమీదకు రావడంతో ప్రేక్షకుల్లో అంచనాలు ఏర్పడ్డాయి. డీవీవీ దానయ్య నిర్మాణ సారథ్యంలో తెరకెక్కిన సరిపోదా శనివారం చిత్రంలో నాని సరసన ప్రియాంకా అరుళ్ మోహాన్, విలన్‌గా ఎస్.జే సూర్య నటిస్తుండం ట్రైలర్, టీజర్ బాగుడండం, ప్రమోషన్లు సైతం ప్రేక్షకులను ఆకట్టుకునేలా చేసి సినిమాపై అంచనాలు పెంచారు. భారీ బడ్జెట్‌తో ఈ వారం థీయేటర్లోకి వచ్చిన సరిపోదా శనివారం చిత్రం ఏ మేరకు మెప్పించిందో సమీక్షిద్దాం.
కథ:
సూర్య(నాని)కి చిన్నప్పటి నుంచి ఏదైనా అన్యాయాన్ని చూస్తే కోపం వస్తుంది. దాన్ని కంట్రోల్ చేయడానికి సూర్య తల్లి(అభిరామి) వారం అంతా కోపాన్ని ఒక్క రోజు చూపించు, మనం కోపం వెనుక సరైనా కారణం ఉండాలి, అలా ఉన్నప్పుడే మన కోపానికి ఒక అర్థం ఉంటుంది. అందుకనే వారంలో ఒక్కరోజే తీర్చుకో అని చెప్పడంతో సూర్య ప్రతీ శనివారం తన కోపాన్ని చూపిస్తాడు. చిన్నతనంలో తాను ఇష్టపడ్డ అత్త కూతురు కళ్లు, తల్లి మరణిస్తారు. మిగితా రోజుల్లో తప్పు చేసిన వారి పేర్లను తన డైరీలో రాసుకొని, వారం అంతా ఆలోచించే తన కోపం నిజమే అనుకుంటే శనివారం చితక్కొట్టడం సూర్యకు అలవాటు. అది ముందే తెలుసుకున్న సూర్యనాన్న(సాయికుమార్) డైరీలో పేరు చూసి వాళ్ళను జాగ్రత్తగా ఉండమని చెప్పడం పరిపాటి. ఈ నేపథ్యంలో సోకులపాలెం పోలీసుస్టేషన్‌కు కొత్త కానిస్టేబుల్‌గా చారులత(ప్రియాంక అరుళ్ మోహన్) జాయిన్ అవుతుంది. ఆ స్టేషన్ సీఐ దయానంద్(ఎస్ జే సూర్య) ఒకరకమైన సైకో క్యారెక్టర్. తన అన్న మీద కోపంతో లోకులపాలెం ప్రజలను చితక్కొడుతుంటాడు. ఈ నేపథ్యంలో ఒక సందర్భంలో సూర్య, చారులతల మధ్య పరిచయం ఏర్పడుతుంది. చారులతకు వైలెన్స్ అంటే ఇష్టం ఉండదు. సోకులపాలెం గ్రామస్తులకు హీరో చేత ఇన్సురెన్స్‌లు చేయిస్తుంది. ఇలా సాగతున్న కథలో సోకులపాలెం వాళ్లను ఆనంద్ కొడుతాడు. అక్కడితో హీరోకు కోపం వస్తుంది. ఆ తరువాత ఏం జరిగింది. హీరో మరదలు దొరికిందా? అసలు మురళి శర్మ క్యారెక్టర్‌కు దయానంద్‌కు ఏంటి సంబంధం? చారులతకు హీరో గురించి నిజం తెలిసిందా? సోకులపాలెం వాళ్లను హీరో కాపాడడా? లేదా? అనేది తెలియాలంటే మూవీ చూడాల్సిందే.
ప్లస్ పాయింట్స్:
ఎస్ జే సూర్య యాక్టింగ్ అద్భుతంగా ఉంది. సైకో పోలీసు క్యారెక్టర్‌లో హీరోను డామినేట్ చేసేలా ఆకట్టుకున్నారు. హీరో నాని చాలా బాగా చేశాడు. ఫైటింగ్ సీన్స్ బాగున్నాయి. ముఖ్యంగా సినిమాకు బీజీఎమ్ ప్రాణం పోసింది. రైటింగ్, కామెడీ సినిమాకు ప్లస్ పాయింట్స్ అని చెప్పవచ్చు.
మైనస్ పాయింట్స్:
సెకండ్ ఆఫ్ కాస్త ల్యాగ్ అయింది. హీరోకు, విలన్ మధ్య కాన్‌ఫ్లిక్ట్ పెద్దగా లేదు. కథలో సంఘర్షణ లోపించింది. అలాగే ఎమోషన్లు బలంగా పండలేదు. హీరో, హీరోయిన్ల నడుమ సీన్లు పెద్దగా ఆకట్టుకోలేదు.
సాంకేతిక విభాగం:
సరిపోదా శనివారం చిత్రంలో రైటింగ్ పరంగా వివేక్ ఆత్రేయకు మంచి మార్కులు పడుతాయి. అలాగే బీజీఎమ్ అందించిన జేక్స్ బెజోయ్ సినిమాకు హీరో అని చెప్పవచ్చు. ఎడిటింగ్ ఇంకాస్త షార్ప్‌గా కట్ చేసి ఉంటే బాగుండేది. డీవీవీ దానయ్య నిర్మాణ విలువలు చాలా బాగున్నాయి.
తీర్పు:
సరిపోదా శనివారం సినిమా నాని కోసం వెళ్లేవాళ్లకు ఎస్.జే సూర్య యాక్టింగ్ కూడా సర్‌ప్రైజ్ ఇస్తుంది. ఫ్యామిలీతో ఒక్కసారి చూసేయొచ్చు. భావోద్వేగాలు ఇంకా బలంగా పండింటే ఈ శనివారం థియేటర్లు సరిపోయేవి కావు.
Cast & Crew Details :
Banner : DVV Entertainments
Release date:-29.08.2024
Censor rating:-“U/A”
Cast – Nani,Suryah, Priyanka Arul Mohan, Sai kumar
Story – Director: Vivek Athreya
Music: Jakes Bejoy
Cinematography: Murali G
Editing: Karthika Srinivas R
Producers: D V V Danayya, Kalyan Dasari
Runtime:-170 minutes