Miss You Movie Review
మిస్ యూ మూవీ రివ్యూ
Emotional Engagement Emoji
సిద్దార్థ్ తెలుగు వారికి కొత్తేమి కాదు. నిజానికి ఒకప్పుడు ఈ హీరోకు మినిమమ్ మార్కెట్ ఉండేది తెలుగులో. నువ్వోస్తానంటే నేను వద్దాంటానా, బొమ్మరిల్లు వంటి సినిమాలతో మంచి పాపులారిటీ సంపాదించుకున్నారు. లవర్ బాయ్ ఇమేజ్ సొంతం చేసుకున్న ఈ హీరో కొన్నాళ్లు తమిళ్ సినిమాలు చేస్తూ తెలుగుపై దృష్టి పెట్టలేదు. మళ్లీ తెలుగు వారికి దగ్గర కావాలనే ప్రయత్నాలు మొదలు పెట్టారు. అలా అజయ్ భూపతి తెరకెక్కించిన సముద్రం సినిమాలో నెగిటీవ్ రోల్ లో కనిపించారు. ఆ తరువాత కూడా ఒకటి రెండు చిత్రాలలో కనివిందు చేసినా పెద్దగా ఆడలేదు. మళ్లీ తన అదృష్టాన్ని పరీక్షించుకోవడానికి మిస్ యూ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చేశారు. ఈ రోజు విడుదలైన ఈ చిత్రం ఆడియెన్స్ ను ఎంతవరకు ఆకట్టుకుందో తెలుసుకుందాం.
కథ:
వాసు(సిద్దార్థ్) డైరెక్టర్ కావాలనే లక్ష్యంలో ఉంటాడు. అదే సమయంలో ఒక పోలిటికల్ మర్డర్ కేసులో సాక్ష్యంగా ఉంటాడు. దాంతో వాసుపై హాత్యాప్రయత్నం జరుగుతుంది. దాని నుంచి బయట పడిన వాసు తన చివరి రెండు సంవత్సరాల గతాన్ని మర్చిపోతాడు. అదే మంచిది అనుకున్న అతని కుటుంబం వాసుకి ఫ్రీడం ఇస్తారు. అనుకోకుండా ఒక ఫ్రెండ్ తో బెంగళూరు వెళ్తాడు. అక్కడ సుబ్బలక్ష్మీ(ఆషికా రంగనాథన్) ని చూస్తాడు. తొలిచూపులోనే ప్రేమించి ప్రపోజ్ చేస్తాడు. సుబ్బలక్ష్మీ రిజెక్ట్ చేస్తుంది. వాళ్ల అమ్మతో చెప్పి కన్విన్స్ చేయమని అమ్మాయి ఫోటో చూపించగానే వాళ్ల అమ్మతో సహా, తన ఫ్రెండ్స్ అందరూ షాక్ అవుతారు. ఆ అమ్మాయి వద్దని వారిస్తారు. వాసు ఒప్పుకోకపోవడంతో తన గతం గురించి చెబుతారు. అది విని వాసు షాక్ అవుతాడు. అసలు వాసు గతంలో ఏం జరిగింది. సుబ్బలక్ష్మీకి వాసుకి ఏంటి సంబంధం. పొలిటికల్ మర్డర్ ఏంటి? దానికి వాసుకి సంబంధం ఏమిటి? వాసు తన గతాన్నితిరిగి ఎలా పొందారు. సుబ్బలక్ష్మీ వాసు ప్రేమను ఒప్పుకుందా? లేదా అని తెలియాలంటే మూవీ చూడాల్సిందే.
విశ్లేషణ:
మిస్ యూ కథ చాలా చిన్నదే, అలాగే సింపుల్ కూడా. కానీ స్క్రీన్ ప్లే తో మ్యాజిక్ చేశారు. ఫస్ట్ హాఫ్ లో హీరోకు థ్రెట్ ఉందనే కాన్సెప్ట్ తో ఒపెన్ చేసి గతాన్ని మరిచిపోవడంతో ప్రేక్షకుడిలో ఒక ఆలోచనను రేకిత్తించారు. ఎప్పటికైనా హీరోకు గతం గుర్తుకొచ్చి మళ్లీ సంఘర్షణ ఉంటుంది అనే ఆలోచనను కలిగించారు. అలా సాగుతున్న కథలో హీరో ఒక కారణంతో బెంగళూరు వెళ్తాడు. అక్కడ హీరోయిన్ ను చూసి ప్రపోజ్ చేయడం వరకు ఏదో ఫీల్ గుడ్ మూవీలా సాగుతుంది. ఎప్పుడైతే వాసు అమ్మ, ఫ్రెండ్స్ తన గతాన్ని రివీల్ చేస్తారో అక్కడ నుంచి అసలు కాన్ ఫ్లిక్ట్ మొదలు అవుతుంది.
సెకండ్ హాఫ్ లో గత 2 సంవత్సరాలలో వాసు జీవితంలో ఏం జరిగిందో చెప్పే ఎపిసోడ్స్ పెద్దగా బోర్ కొట్టవు కానీ ఇంకాస్త బాగా రాసుకొని ఉంటే బాగుండేది అనిపించింది. కథలో రెండు మెయిన్ పాయింట్స్ ఉన్నట్లు గతం రివీల్ అయిన తరువాత అర్థం అవుతుంది. గతం అయితే తెలుసుకుంటాడు కానీ తనకు గుర్తుకు రాకపోవడంతో కథ కాస్త సాగదీతగా అనిపిస్తుంది. సినిమా కేవలం రెండు గంటలు మాత్రమే ఉండడం మిస్ యూ కి చాలా పెద్ద ప్లస్ అని చెప్పవచ్చు. ముందు నించి చెప్పినట్లు పొలిటికల్ మర్డర్ అనేది కథలో మెయిన్ పాయింట్ కాదు. ఆ కాన్ ఫ్లిక్ట్ క్లోజ్ అయిన తరువాత అసలు సంఘర్షణ చూపించారు. క్లైమాక్స్ లో ఇంకాస్త ఎమోషనల్ పండించే అవకాశం ఉంది కానీ కాస్త లైట్ వే లో ముగించారు.
నటీనటులు
సిద్దార్థ్ యాక్టింగ్ చాలా బాగుంది. రెండు వెరియేషన్స్ ఉన్న పాత్రలో ఒదిగిపోయారు. ఫైట్స్ కూడా బాగా చేశారు. డ్యాన్స్ కూడా చేశారు కానీ ఇంకా బాగా చేసుంటే బాగుండేది. హీరోయిన్ ఆషికా రంగనాథన్ ఆకట్టుకుంది. తన ప్లెసెంట్ లుక్ తో పాటు యాక్టింగ్ విషయంలో కూడా ఆకట్టుకుంది. ఇక ఫ్రెండ్స్ క్యారెక్టర్స్ అందరు అలరించారు. మిగితా నటీనటులు అందరూ మంచి ఫార్ఫార్మెన్సెస్ ఇచ్చారు.
సాంకేతిక అంశాలు:
సినిమా కథ చిన్నదే అయినా స్క్రీన్ ప్లే,డైరెక్షన్ మెప్పించింది. ఆ టెన్షన్ బిల్డింగ్ ఆకట్టుకుంటుంది. ఈ విషయంలో డైరెక్టర్ ఎన్. రాజశేఖర్ కు ఫుల్ మార్కులు వేయవచ్చు. మ్యూజిక్ డైరెక్టర్ జీబ్రాన్ ఆకట్టుకున్నారు. సాంగ్ ట్యూన్స్ బాగున్నాయి కానీ తెలుగు లిరిక్స్ పెద్దగా ఆకట్టుకోలేదు. మిగితా టెక్నిషన్స్ బాగానే చేశారు.
ప్లస్ పాయింట్స్
సిద్దార్థ్ యాక్టింగ్
ఆషికా రంగనాథన్ లుక్
కథనం
మ్యూజిక్
మైనస్ పాయింట్
ఎమోషన్స్ పెద్దగా లేవు
చిన్న పాయింట్ కావడం
అంతిమతీర్పు: రెండు గంటలు టైమ్ పాస్ మూవీ, అక్కడక్కడ ఫీల్ గుడ్ గా అనిపిస్తుంది.
Movie Movie : Miss You(dubbed from Tamil)
Banner : 7 Miles Per Second Productions
Release Date : 13-12-2024
Censor Rating : “U”
Cast : Siddharth, Ashika Ranganath, Karunakaran, Balasaravanan, “Lollusabha” Maran
Written & Directed by N.Rajasekar
Music : Ghibran Vaibhoda
Cinematography : KG.Venkatesh
Editor : Dinesh Ponraj
Producer : Samuel Mathew
Nizam Distributor : Global Cinemas
Runtime : 128 minutes