Reading Time: 2 mins

Singeetham Sreenivasa Rao Birthday Special
సింగీతం శ్రీనివాసరావు పుట్టిన రోజు స్పెషల్

కాలంతో పాటు పరుగెత్తే దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు. ప్రయోగాలు చేయడంలో ఆయనకు పెట్టింది పేరు. ఆయన సినిమాలు రంజింప చేయడమే కాదు ఆలోచింపజేస్తాయి. తొబ్బైలలో ఉన్న ఆయన ఇప్పటికీ యువత ఆలోచనలో పోటే పడే సత్తువ ఉన్న క్రీయేటర్ ఆయన. 2005లో తెరకెక్కిన ముంబై ఎక్స్‌ప్రెస్ చిత్రం చూస్తే అర్థం అవుతుంది. ప్రస్తుతం ఆయన సినిమాలకు దూరంగా ఉన్నప్పటికీ ఆయన అందించిన చిత్రాలు ఎప్పటికీ ఫ్రెష్ గానే ఉంటాయి. ఆయన పుట్టిన రోజు సందర్భంగా సినిమా ప్రస్థానాన్ని ఒక సారి చూద్దాం.

సింగీతం శ్రీనివాసరావు 1931 సెప్టెంబర్ 21న నెల్లూరు జిల్లా ఉదయగిరిలో జన్మించారు. ఆయన తండ్రి ఓ స్కూల్ హెడ్ మాస్టర్. తల్లికి సంగీతంలో ప్రావిణ్యం ఉంది. దాంతో చిన్నప్పటి నుంచి సింగితంకు చదువతో పాటు కళల పట్ల ఆసక్తి పెరింగింది. అలా చదువుకునే రోజుల్లోనే నాటకాలు రాస్తుండేవాడు. డిగ్రీ పూర్తయ్యాక కొంతకాలం పాఠశాలలో టీచర్ గా పని చేశారు. ఆ సమయంలో తన విద్యార్థులతో తాను రాసిన నాటకాలు స్టేజీలపై ప్రదర్చించేవారు. అలా దర్శకత్వంపై మక్కువ పెరిగింది. అదే పట్టుదలతో చిత్ర సీమలో అడుగు పెట్టారు. కె.వి.రెడ్డిని ఆశ్రయించారు. సీంగీతంలోని చురుకుతనం చూసిన కె.వి.రెడ్డి తన అసోసియేటెడ్ గా అవకాశం ఇచ్చారు. అలా మాయాబజార్ చిత్రానికి తొలిసారిగా పని చేశారు.

1972లో సింగీతం పూర్తి దర్శకత్వం వహించిన నీతి నిజాయితీ సినిమాను విమర్శకులు ప్రశంసించారు. కానీ థియేటర్ వద్ద విజయం సాధించలేదు. 1975లో తీసిన జమీందారుగారి అమ్మాయి విజయం సాధించింది. ఆ తరువాత 1976లో వచ్చిన అమెరికా అమ్మాయి అన్ని వర్గాల ప్రేక్షకులనూ మెప్పించింది. ఆ తరువాత పంతులమ్మ, అందమే ఆనందం వంటి చిత్రాలు మెప్పించాయి. కమల్ హాసన్ తో సొమ్మొకడిది సోకొకడిది, మైఖేల్ మదన కామరాజు కథ, అమావాస్య చంద్రుడు, అపూర్వ సహోదరులు సింగీతంకు మంచి పేరును తీసుకొచ్చాయి. ఆయన తెరకెక్కించిన చిత్రాలలో తరం మారింది మంచి సందేశత్మకమైన చిత్రంగా మిగిలింది. ఆయన ప్రమోగాలు చేయడంలో దిట్టా.. డైలాగులు లేకుండా తీసిన పుష్పక విమానం ఇప్పటికీ అదొక ఆర్ట్. ఆయన తెరకెక్కించిన చిత్రాలలో మయూరి, అమెరికా అమ్మాయి, తరంమారింది, ఆదిత్య 369, భైరవద్వీపం వంటివాటికి మంచి పేరు వచ్చాయి. ఇది ఆదిత్య 369 ఒకటి. భైరవద్వీపం వంటి చిత్రాలు అప్పట్లో ఓ ప్రభంజనం. ఇంత గొప్పచిత్రాలను అందించిన సింగీతం శ్రీనివాసరావుకు బిజినెస్ ఆఫ్ టాలీవుడ్ తరఫున జన్మదిన శుభాకాంక్షలు.