SSMB29 Second Schedule Start
ఎస్ఎస్ఎంబీ29 సెకండ్ షెడ్యుల్ ప్రారంభం
ఎస్ ఎస్ రాజమౌళి, మహేష్ బాబు కాంబినేషన్ లో తెరకెక్కుతున్న ఎస్ఎస్ఎంబి 29 సెకండ్ షెడ్యుల్ ప్రారంభం అయింది. భారీ బడ్జెట్ చిత్రం కాబట్టి తగు జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు తెలుస్తుంది. సినిమా పూజా కార్యక్రమం కూడా చాలా సీక్రెట్ గా నిర్వహించారు. ఇప్పటి వరకు కథ ఏంటో చెప్పలేదు. కానీ రచయిత విజయేంద్ర ప్రసాద్ ఒకటి రెండు సార్లు చెప్పారు. మహేష్ తో తీయబోయేది ఒక అడ్వెంచరర్ కథ అని, ఆఫ్రీకా అడవుల నేపథ్యంలో సాగుతుందని చెప్పారు. ఫుల్ లెంగ్త్ యాక్షన్ ఎపిసోడ్స్ లో మహేష్ బాబును ఉహించుకోవడం ప్రేక్షకులకు ముఖ్యంగా ఆయన అభిమానులకు కిక్ ఇచ్చింది. అందుకు తగ్గట్టుగానే మహేష్ లుక్ కూడా అక్కడక్కడ రివీల్ అవుతుంది. జట్టు, గడ్డం పెంచి చాలా కొత్తగా కనిపిస్తున్నారు. ఎంత సీక్రెట్ గా ఉందామన్నా.. ఎయిర్ పోర్టు ఆవరణంలోని ఫోటోలు బయటకు వచ్చేస్తున్నాయి. అందుకే సినిమా షూటింగ్ విషయంలో రాజమౌళి చాలా పకడ్బందీగా ఉంటున్నారు.
షూటింగ్ లొకేషన్ వివరాలు కూడా బయటకు చెప్పడం లేదు. సెట్లోకి ఫోన్ లు సైతం అనుమతించడం లేదు. వీటితో పాటు ప్లాస్టిక్ బాటిల్స్, ఇతర ప్లాస్టిక్ వస్తువులను కూడా అనుమతించడం లేదు. ఆ మధ్య పుష్ప చిత్రం షూటింగ్ సమయంలో కూడా ప్లాస్టిక్ నిషేదం గురించి వార్తలు వచ్చాయి. అదే తరహాలో ఈ సినిమాలో కూడా ప్లాస్టిక్ నిషేదించారు. చాలా రోజులు షూటింగ్ చేయాలి. ప్రతీ రోజు సెట్ లో దాదాపు ఐదు వందల మంది వరకు ఉంటారు. అందరూ ప్లాస్టిక్ వాడితే ఆ ప్రదేశం అంతా ప్లాస్టిక్ మయం అవుతుందని రాజమౌళి ఈ నిర్ణయం తీసుకున్నారట. ఈ చిత్రంలో ప్రియాంక చోప్రా హీరోయిన్ గా నటిస్తున్న విషయం తెలిసిందే. ఈ మధ్యే ఆమె సోదరుడు వివాహం కూడా జరిగింది. ఆ కారణంగానే ఒక వారం పాటు షూటింగ్ లో పాల్గొనలేదు. ఇప్పుడు మళ్లీ జాయిన్ కావడంతో మహేష్ బాబు, ప్రియాంక ఇద్దరి మధ్య సీన్స్ షూట్ చేస్తున్నట్లు తెలుస్తుంది.
షూటింగ్ హైదరాబాదులోని అల్ల్యూమినియం ఫ్యాక్టరీలో ఒక భారీ సెట్ ఏర్పాటు చేశారు. కే ఎల్ నారాయణ నిర్మాత, ఎంఎం కీరవాణి మ్యాజిక్ అందిస్తున్నారు. ప్రియాంక చోప్రాతో పాటు హాలీవుడ్ నటీనటులు సైతం ఈ సినిమాలో భాగస్వామ్యం కాబోతున్నారు.