Sunday Girl Friend Movie Launched
సండే గర్ల్ ఫ్రెండ్ మూవీ ప్రారంభం
పూజా కార్యక్రమాలతో లాంఛనంగా ప్రారంభమైన లవ్, మ్యూజికల్ ఎంటర్ టైనర్ మూవీ “సండే గర్ల్ ఫ్రెండ్”
కామ్నా శర్మ, సుమన్, అలీ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న సినిమా “సండే గర్ల్ ఫ్రెండ్”. ఈ చిత్రాన్ని లార్విన్ మూవీస్ సంస్థ నిర్మిస్తోంది. లవ్ అండ్ మ్యూజికల్ ఎంటర్ టైనర్ కథతో దర్శకుడు గడ్డం వెంకటరమణ రెడ్డి ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. ఈ సినిమాకు ఆయన స్టోరీ, స్క్రీన్ ప్లే, డైలాగ్స్ తో పాటు లిరిక్స్ కూడా అందిస్తుండటం విశేషం. సండే గర్ల్ ఫ్రెండ్ సినిమా ఈ రోజు హైదరాబాద్ ప్రసాద్ ల్యాబ్స్ లో పూజా కార్యక్రమాలతో లాంఛనంగా ప్రారంభమైంది. సుమన్, ఇంద్రజ, అలీ ఈ ప్రారంభోత్సవంలో అతిథులుగా పాల్గొన్నారు.
“సండే గర్ల్ ఫ్రెండ్” ప్రారంభోత్సవ ముహూర్తపు సన్నివేశానికి నటుడు అలీ క్లాప్ నివ్వగా, సుమన్ స్క్రిప్ట్ అందజేశారు. ఇంద్రజ కెమెరా స్విచ్ఛాన్ చేశారు. అతిథులు సండే గర్ల్ ఫ్రెండ్ చిత్ర బృందానికి తమ బెస్ట్ విశెస్ అందించారు. ఈ సందర్భంగా
దర్శకుడు గడ్డం వెంకటరమణా రెడ్డి మాట్లాడుతూ – నేను ప్రస్తుతం సీఎం పెళ్లాం అనే సినిమాను రూపొందిస్తున్నాను. ఆ సినిమా రాజకీయ నేపథ్యంతో మెసేజ్ ఓరియెంటెడ్ గా ఉంటుంది. అయితే నా నెక్ట్ మూవీ అదే జానర్ లో కాకుండా పూర్తిగా నేటి ట్రెండ్ లవ్ స్టోరీతో చేస్తున్నాను. సండే గర్ల్ ఫ్రెండ్ సినిమా లవ్ అండ్ మ్యూజికల్ ఎంటర్ టైనర్ గా ఆకట్టుకుంటుంది. పాటలు చాలా ట్రెండీ లిరిక్స్ తో కంపోజిషన్ తో ఉంటాయి. పాటల రికార్డింగ్ కంప్లీట్ అయ్యింది. ప్రతిభావంతులైన నటీనటులను మా మూవీలోకి తీసుకుంటాం. వారికి ఇదే మా ఆహ్వానం. త్వరలోనే సండే గర్ల్ ఫ్రెండ్ సినిమా రెగ్యులర్ చిత్రీకరణ ప్రారంభిస్తాం. అన్నారు.
హీరోయిన్ కామ్నా శర్మ మాట్లాడుతూ – నేను ముంబై నుంచి వచ్చాను. సండే గర్ల్ ఫ్రెండ్ చిత్రంతో నేను తెలుగు ప్రేక్షకులకు పరిచయం కావడం సంతోషంగా ఉంది. ఈ చిత్రంలో నటించే అవకాశం అందించిన దర్శకుడు గడ్డం వెంకటరమణ రెడ్డి గారికి థ్యాంక్స్ చెబుతున్నా. ముంబై నుంచి వచ్చిన హీరోయిన్స్ ను తెలుగు ప్రేక్షకులు బాగా ఆదరించారు. నాకు కూడా మీ సపోర్ట్ అందిస్తారని కోరుకుంటున్నా. అన్నారు.
నటీనటులు –
కామ్నా శర్మ, సుమన్, అలీ, ఘర్షణ శ్రీనివాస్, షాలినీ నాయుడు, తదితరులు
టెక్నికల్ టీమ్ –
బ్యానర్ – లార్విన్ మూవీస్
కెమెరా, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ – నాగ శ్రీనివాసరెడ్డి
ఎడిటర్ – రామారావు
మ్యూజిక్ – ప్రిన్స్ హెన్రీ
స్టోరీ, స్క్రీన్ ప్లే, డైలాగ్స్, లిరిక్స్, డైరెక్షన్ – గడ్డం వెంకటరమణ రెడ్డి