Swag Movie Review
స్వాగ్ మూవీ రివ్యూ
Emotional Engagement Emoji
శ్రీ విష్ణు సినిమా అంటే మినిమమ్ గ్యారెంటీ అనే ఆలోచన ఉంటుంది. కామెడీతో పాటు, ఎమోషనల్ కంటెంట్ ను కూడా అందిస్తూ ప్రేక్షకులకు ఎప్పుడూ వినుత్నమైన కథలను అందిస్తారు. ఇక డైరెక్టర్ హసిత్ గోలీ తెరకెక్కించిన రాజా రాజా చోరా సినిమా ఎలా ఉంటుందో తెలుసు మళ్లీ వీరి కాంబినేషన్ లో మూవీ అనగానే చాలా మందికి అంచనాలు పెరిగాయి. ట్రైలర్, ప్రచారా చిత్రాలతో సిినిమాపై ఆసక్తి పెరిగింది. ఇక ట్రైలర్ లో చూపించినట్లు సంపూర్ణమైన తెలుగు చిత్రం అనీ, 1551 సంవత్సరం నుంచి మగాడి జీవితం అంటూ చాలా రకాల పాయింట్ లతో థియేటర్ కు రప్పించారు. ఇన్ని అంచనాల నడుమ విడుదలైన స్వాగ్ సినిమా ఎలా ఉంది. ప్రేక్షకుల అంచనాలను ఏ మేరకు అందుకుందో చూద్దాం.
కథ:
ఎస్సైగా పనిచేస్తున్న భవభూతి(శ్రీవిష్ణు) త్వరలో రిటైర్డ్ అవబోతుంటాడు. అతనికి ఆడవాళ్లు అంటే పెద్దగా నచ్చరు. అతనికి శ్వాగనిక వంశం గురించి ఒక ఉత్తరం వస్తుంది. ఆ వంశ వారసుడికోసం వంశవృక్షం నిలయంలో ఒక అధికారి(గోపరాజు రమణ) వాళ్ల అమ్మ ఎదురు చూస్తుంటారు. ఈ సారి ఆ వంశం నుంచి ఎవరు రాకపోతే కజానా మొత్తం తీసుకోవాలని ఆశపడుతుంటాడు అధికారి. అదే సమయంలో కజానా కోసం భవభూతి అక్కడికి వస్తాడు. తాను ఇదే వంశానికి చెందిన వాడు అయితే ఒక పలక ఉంటుంది అది తీసుకురా అని అధికారి పంపిస్తాడు. అదే సమయంలో అనుభూతి(రీతూ వర్మ) తానే ఆ వంశానికి వారసురాలు అని ఒక లెటర్ తీసుకొని వస్తుంది. ఇదిలా ఉంటే సంగ(శ్రీ విష్ణు) సోషల్ మీడియాలో ఫేమస్ కావాలనుకుంటాడు. అతనికి ఒక లవ్ స్టోరీ ఉంటుంది. అమ్మాయి వాళ్ల నాన్న, సంగతో మీ నాన్న ఎవరో నీ కన్నా తెలుసా అని అవమానిస్తాడు. అదే సమయంలో ఈ వంశానికి చెందిన కవలలు ఉన్నారు అని, వంశవృక్షం నిలయానికి ఒక లెటర్ వస్తుంది. ఆ కవలలు ఎవరు? ఆ కవలల తండ్రి యయాతి(శ్రీ విష్ణు) ఏం అయ్యాడు. ఆ లెటర్స్ రాసేది ఎవరు? సంగ(శ్రీ విష్ణు) ఎవరి కొడుకు? మీరా జాస్మిన్ పాత్ర ఏంటి? ఇక శ్వాగనిక వంశం, వింజామర వంశం పంతం ఏంటి? శ్రీవిష్ణు వేసిన పాత్రాలు ఏంటి? తెలియాలంటే స్వాగ్ సినిమా చూడాల్సిందే.
విశ్లేషణ:
మనము చిన్నప్పటి నుంచి మాతృస్వామ్య వ్యవస్థ గురించి విన్నాము. ఆ తరువాత పితృస్వామ్య వ్యవస్థ గురించి విన్నాము. ఇప్పుడు సాగుతున్నదంతా పితృస్వామ్య వ్యవస్థే. ఇదే పాయింట్ తో సినిమాను ఓపెన్ చేస్తాడు. వింజామర వంశ రాణి అయిన రుక్మిణీ దేవి క్రి.పూ. 1551లో ఆ రాజ్యాన్ని పారిపాలిస్తుంది. తన నుంచి తన భర్త శ్వాగనిక వంశస్తుడైన రాజా భవభూతి రాజ్యాన్ని ఎలా దక్కించుకొంటాడు అనే పాయింట్ తో కూర్చొబెడుతాడు డైరెక్టర్. ఆ తరువాత కథ ప్రజెంట్ లో జరుగుతుంంది. రిటైర్మెంట్ కు దగ్గర పడుతున్న ఎస్సై భవభూతి అంటే విష్ణుకు ఆడవాళ్లు అంటే నచ్చకపోవడంతో తన పై ఆఫీసర్ తనకు రావల్సిన బెనిఫిట్స్ ను నిలిపివేస్తుంది. అప్పుడే భవభూతికి ఒక లెటర్ వస్తుంది. దానికి ఆధారంగా వంశవృక్ష నిలయానికి వెళ్తాడు. అక్కడ జరిగే డ్రామాను చాలా కొత్తగా చూపించారు.
భవభూతి భార్య రేవతి తనకు ఎందుకు దూరం అయిందో చెప్పే ఎపిసోడ్ చాలా బాగుంది. ఆ క్యారెక్టర్ లో మీరా జాస్మిన్ పాత్ర సైతం చాలా బాగుంది. ఈ సినిమాలో శ్వాగనిక వంశానికి మూల పురుషుడైన భవభూతితో మొదలుపెడితే, అతని వారసుడు యయాతి, అతని ఇద్దరి కొడుకులు అయిన తంగా, భవభూతి, వీరి తరువాత సంగ ఇలా మొత్తం ఐదు పాత్రల్లో శ్రీ విష్ణు కనిపిస్తాడు. అయితే ఏ పాత్రకు ఆ పాత్రే ప్రత్యేకం. సినిమా ప్రారంభం అయిన తరువాత డైరెక్టర్ హసిత్ గోలీ ప్రపంచంలోకి ఎంటర్ అవడానికి కొంత సమయం పడుతుంది. ఇక ఫస్ట్ హాఫ్ అయిపోయాక క్లారిటీ వస్తుంది.
ఇక సెకండ్ హాఫ్ సినిమా అంతా డ్రామా సాగుతుంది. ఇప్పటికీ జెండర్ ఇక్వాలిటీ మీద పోరాడుతుంటాము, ఎంత సేపు ఆడ, మగా మాత్రమే సమానత్వం గురించి మాట్లాడుకుంటారు కానీ అదే మనిషిగా పుట్టిన ట్రాన్స్జ్ జెండర్ రైట్స్ ఏంటి అనే అంశాన్ని చెప్పిన తీరు మెప్పిస్తుంది. సెకండ్ హాఫ్ లో కొన్ని ఎమోషనల్ సీన్స్ కచ్చితంగా ఆలోచింప జేస్తాయి. సినిమాలో కొన్ని లాజిక్స్ మిస్ అవుతాయి. అవేవి పట్టించుకోకుండా డైరెక్టర్ చెప్పాలనుకున్న పాయింట్ ను చెప్పాడు అనిపిస్తుంది. అసమానతలు, బేధాలు లేకుండా ఉండేందుకే కదా చదువుకునేది, అలాంటి చదువులో వివక్షలు ఏంటి అనే డైలాగ్ బాగుంటుంది. ఎక్కువ క్యారెక్టర్లు ఉండడం, చెప్పాలనుకున్న పాయింట్ ను సాగదీయడం సినిమాకు కొంత మైనస్ అని చెప్పవచ్చు.
ఎలా చేశారు:
స్వాగ్ సినమా కంప్లీట్ వన్ మ్యాన్ షో అని చెప్పవచ్చు. దాదాపు ఐదు పాత్రల్లో శ్రీ విష్ణు యాక్ట్ చేశారు. అలాగే ఏడు, ఎనిమిగి గెటప్ లో కనిపించారు. ఏ పాత్రలో కూడా ఇబ్బందికరంగా అనిపించలేదు. చాలా మంచి ఫర్ఫార్మెన్స్ చేశారు. అన్నింటికన్న ఎక్కువగా ఒక స్పెషల్ పాత్ర ఉంటుంది. అందులో ఆయన యాక్టింగ్ నెక్ట్స్ లెవల్ అని చెప్పచ్చు. అలాగే రీతూ వర్మ సైతం రెండు పాత్రల్లో బాగా చేసింది. మీరా జాస్మిన్ స్క్రీన్ ప్రజెన్స్ చాలా బాగుంది. ఫర్ఫార్మెన్స్ కూడా అద్భుతంగా చేసింది. సునిల్, గెటప్ శ్రీను, పృథ్వీ
తమ పాత్ర మేరా అలరించారు.
సాంకేతిక అంశాలు:
డైరెక్టర్ హసిత్ గోలీ అల్రెడీ ప్రూవుడ్. రైటింగ్ పరంగా చాలా బాగా రాసుకున్నాడు డైరెక్టర్. చెప్పాల్సిన పాయింట్ చెప్పడానికి చాలా పెద్ద కథను అల్లుకున్నాడు. 1551 నుంచి నేటి వరకు చెబుతూ వచ్చాడు. ఎంటర్ టైన్ చేశాడు కానీ ఎక్కడో మిస్ అయిన ఫిలింగ్, ఇంకా సంపూర్ణం అవలేదు అని పిస్తుంది. ఇక డీఓపీ వర్క్ బాగుంది . మ్యూజిక్ బాగుంది. ఎడిటింగ్ కూడా కరెక్ట్ గా ఉంది.
ప్లస్ పాయింట్స్
శ్రీ విష్ణు యాక్టింగ్
కథ
మ్యూజిక్
మైనస్ పాయింట్స్
కథనం
ఎక్కువ క్యారెక్టర్లు అవడం
అంతిమ తీర్పు: అలరిస్తూనే ఆలోచింపజేసే చిత్రం.
Movie Title:-Swag
Banner:- People Media Factory
Release Date : 04-10-2024
Censor Rating : “U/A”
Cast:- Sree Vishnu, Ritu Varma, Meera Jasmine, Daksha Nagarkar, Saranya Pradeep
Directed by:-Hasith Goli
Music:-Vivek Sagar
Cinematography:-Vedaraman Sankaran
Editing:- Viplav Nyshadham
Producer:- T.G. Vishwa Prasad