Reading Time: 2 mins

Telugu Films Made On Lord Ganesh
వినాయకుడు చరిత్ర ఆధారంగా వచ్చిన తెలుగు సినిమాలు

ప్రతీ పనికి మొదటగా వినాయకుడు పూజ చేయడం మనకు అలవాటు. విఘ్నాలను తొలగించాలని ఆయన్ను నిత్యం వేడుకుంటాము. అదే నమ్మకమంతో తెలుగు పరిశ్రమలో సైతం చాలా సినిమాలు గణనాథుడి దీవెనలతో మొదలౌతాయి. అందుకే ఈ ఏకదంతుడికి సినిమాల్లో ఎప్పుడూ ప్రత్యేక స్థానం ఉంది. అయితే గణపయ్య నేపథ్యంలో ఎన్నో చిత్రాలు వచ్చాయి. మంచి విజయాలు సాధించాయి. అలాగే తెలుగులో స్వామిని కీర్తిస్తూ ఎన్నో పాటల సైతం వచ్చాయి. అవేంటో చూద్దాం.

వినాయక చవితి(1957)

వినాయక చవితి రోజున అందరమూ పూజలు చేయడం ఆనవాయితీ. ఈ కథా నేపథ్యాన్ని ఆధారంగా చేసుకొని సముద్రాల రాఘవాచార్య దర్శకత్వంలో వచ్చిన చిత్రం ‘వినాయక చవితి’. కె. గోపాలరావు నిర్మించిన ఈ సినిమా 1957 ఆగస్టు 22న విడుదలైంది. ఈ మూవీలో ఎన్టీఆర్, జమున, కృష్ణకుమారి, గుమ్మడి, రాజనాల తదితరులు నటించారు. కథ విషయానికి వస్తే.. వినాయక చవితి రోజు శ్రీకృష్ణుడు పాలలో చంద్రుణ్ణి చూస్తాడు. అలా చూడడం వలన శ్రీకృష్ణనిపై నింద పడుతుంది. అదేంటంటే సత్రాజిత్తు సంపాదించిన శమంతకమణిని అపహరించాడని అపఖ్యాతి పడుతుంది. ఆ తర్వాత వినాయక వ్రతం చేస్తాడు. దాంతో నిర్దోషిగా నిరూపించుకుంటాడు.

భూ కైలాస్‌(1958)

ఎన్టీఆర్‌ రావణునిగా, ఏఎన్నార్‌ నారదుడిగా నటించిన ‘భూ కైలాస్‌’ కె. శంకర్‌ దర్శకత్వంలో ఏవీఎం సంస్థ నిర్మించిన ఈ సినిమా 1958లో రిలీజైంది. పరమేశ్వరుడి భక్తుడైన రావణాసురుడు తన తల్లికి మాట ఇస్తాడు. ఎలాగైనా శివుని ఆత్మలింగం తెస్తానని తపస్సు చేస్తాడు. రావణున్ని తపస్సుకు శివుడు ప్రత్యక్ష్యం అవుతాడు. ఆయన తపస్సును మెచ్చుకున్న ఆత్మలింగం ఇస్తాడు. దానికితో పాటు ఒక షరతు కూడా ఇస్తాడు. దీన్ని నేలపై పెట్టకూడదని అంటాడు. దానితో అమరత్వం పొందిన రావణును ఈ భూమిని పాలించాలి అనుకుంటాడు. విషయం తెలుసుకున్న నారదుడు ఆత్మలింగం లంకకు చేరకుండా అడ్డుకోవాలని గణపతిని ప్రార్థిస్తాడు. రావణాసురుడు సంధ్యా వందనం చేసే సమయంలో శివలింగం నెలపై పెట్టేలా వినాయకుడు పథకం పన్నుతారు. అలాగే చేస్తాడు రావణుడు. దీంతో రావణసురుడు కోపంతో తనని తాను వధించుకోవాలని చూస్తాడు. విషయం తెలుసుకున్న శివుడు కరుణించి తాను శివలింగాన్ని కింద పెట్టిన ప్రదేశం భూకైలాసంగా మారుతుందని వరం ఇస్తారు. దీంతో కథ ముగుస్తుంది.

శ్రీ వినాయక విజయం

గణపతి జీవిత చరిత్రను పూర్తి స్థాయిలో తీసిన చిత్రం శ్రీ వినాయక విజయం. కమలాకర కామేశ్వరరావు దర్శకత్వం వహించారు. కృష్ణంరాజు, వాణిశ్రీ శివపార్వతులుగా నటించారు. ఈ చిత్రంలో వినాయకుడి జన్మగురించి చెప్తారు. శివదీక్షలో ఉన్న పార్వతి స్నానాకి వెళుతూ పిండితో ఒక బొమ్మను చేసిన ప్రాణం పోస్తుంది. అదే సమయంలో అక్కడి వచ్చిన శివున్ని గదిలో అమ్మవారు స్నానం ఆచరిస్తున్నందున లోనికి అనుమతించారు. ఇద్దరి మధ్య మాటామాటా పెరుగుతుంది. దీంతో శివునికి కోపం వస్తుంది. వినాయకుడి శిరస్సు ఖండిస్తాడు. విషయం తెలుసుకున్న పార్వతి దేవి తన బిడ్డను ఎలాగైనా బతికించమని కోరుతుంది. దాంతో దక్షణపు దిక్కున తల పెట్టి పడుకున్న ఏ జీవినైనా వధించుక రమ్మని ఆజ్ఙాపిస్తాడు. అలా ఆ బాలునికి ఏనుగు తలను అమర్చి ప్రాణం పోస్తాడు. అలా గణనాథుని కథ మొదలౌతుంది. ఆ తరువాత గణపతి మూషికసూరున్ని ఎలా వధించాడు అనేది మిగితా కథ. ఈ చిత్రం 1979 డిసెంబరు 22న విడుదలైంది. ఇప్పటికీ వినాయక చవితిని పురస్కరించుకొని ఈ సినిమాను టెలికాస్ట్ చేస్తారు.

సినిమాలు మాత్రమే కాకుండా గణేష్ దేవుడిపై అనేక పాటలు వచ్చాయి. అందులో దేవుడు చేసిన మనుషులు చిత్రంలో దేవుడు చేసిన మనుషుల్లారా.. అనే పాట ఉంటుంది. ఎన్టీఆర్, కృష్ణ నటించిన ఈ సినిమాలలో వినాయక నిమజ్జనం సందర్భంలో ఈ పాట వస్తుంది. అలాగే వెంకటేష్‌ నటించిన ‘కూలీ నెంబర్‌ 1’ సినిమాలో ‘దండాలయ్యా ఉండ్రాలయ్యా, ‘జై చిరంజీవ’ సినిమాలో ‘జై జై గణేశా.. జై కొడత గణేశా.. బాలకృష్ణ ‘డిక్టేటర్‌’ మూవీలోని ‘గం గం గణేశా అనే పాటులు ఇప్పటికీ వినిపిస్తూనే ఉంటాయి. అలాగే ‘దేవుళ్లు’ సినిమాలోని ‘జయ జయ శుభకర వినాయక..’ ‘పోకిరి’ సినిమాలోని జగడమే పాటలో ‘గణపతి బప్పా మోరియా.. అనే బీట్ వస్తుంది. ఇలా చాలా తెలుగు సినిమాల్లో గణపతిపై పాటలు ఉన్నాయి.