Telugu In House Directors
తెలుగు నిర్మాణ సంస్థల మూవీ డైరెక్టర్స్
సినిమా అనే వ్యాపార కళారంగాన్ని ఎంత ప్రతిభావంతంగా చేసినా కొన్ని సార్లు ఫలితాలు తారుమారు అవుతుంటాయి. అయినా సరే వరుసగా సినిమాలను నిర్మించి సరైన విజయాన్ని అందుకోవడానికి దర్శక-నిర్మాతలు ప్రయత్నాలు చేస్తూనే ఉంటారు. నిజానికి చాలా మంది నిర్మాతలు ఒక సినిమా తీసీ తమ అదృష్టాన్ని పరీక్షించుకోవాలి అనుకుంటారు. అలా వచ్చి చేతులు కాల్చుకున్న వారు కొందరైతే విజయం సాధించి వ్యవస్థగా మారిన వారు కొందరున్నారు. అలా తెలుగు పరిశ్రమలో చాలా మంది నిర్మాతలు మంచి స్థాయిలో ఉన్నారు. దాని వెనుక వారికి ఉన్న తెలివైన ఆలోచనే కారణం. సినిమా నిర్మాణ పరిశ్రమలు చాలా ఉన్నాయి. కానీ కొన్ని కంపెనీల నుంచే రెగ్యూలర్ గా సినిమాలు వస్తుంటాయి. వచ్చిన సినిమాలు అన్ని హిట్లు అవుతున్నాయా అంటే అదీ లేదు. అయినా రెగ్యూలారిటీ మెంటైన్ చేస్తున్నారు. దీనికి వెనుక బలమైన స్ట్రాటజీ ఉంది.
తెలుగులో టాప్ ఫిల్మ్ ప్రొడ్యూసింగ్ కంపెనీలు అనగానే మైత్రీ మూవీ మేకర్స్, సితార ఎంటర్ టైన్మెంట్స్, వైజయంతి మూవీస్, గీతా ఆర్ట్స్, సురేష్ ప్రొడక్షన్స్, శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్, పీపుల్స్ మీడియా తదితర కంపెనీలు గుర్తుకొస్తాయి. వీటి నుంచి రెగ్యూలర్ గా మైత్రీ, సితారా కంపెనీల నుంచే సినిమాలు వస్తున్నాయి . ఎందుకంటే ఆ కంపెనీల దగ్గర ఇన్ హౌస్ డైరెక్టర్లు ఉన్నారు. రైటింగ్ టీమ్ ఉంది. కథలు వాళ్ల కంపెనీలోనే తయారు అవుతాయి. కొత్త కథలు విన్నా, కొత్త డైరెక్టర్లకు అవకాశాలు ఇచ్నినా కూడా కంపెనీలో తయారే అయ్యే కథలు కూడా ఉంటాయి కాబట్టి వరుసగా సినిమాలు వస్తున్నాయి. మైత్రీ మూవీ మేకర్స్ విషయమే చూసుకుందాం.. శ్రీమంతుడు సినిమాను కొరటాల శివ కాంబినేషన్ లో తెరెక్కించారు. వెంటనే ఆయనతోనే జనతా గ్యారేజ్ చేశారు. రంగస్థలం సుకుమార్ తో తీశారు. ఆయనతో పుష్ప1, పుష్ప2 తీశారు. పుష్ప3 ప్లానింగ్ లో ఉంది. వీటి మధ్య చిత్రలహరి, డీయర్ కామ్రెడ్, మత్తు వదలరా వంటి సినిమాలు కూడా తీశారు. దీని ద్వరా వారు మార్కెట్లో ఎప్పుడూ ఉంటారు. కొత్తవాళ్లతో సినిమా ఫలితాలు అటుఇటుగా ఉన్నా సుకుమార్ లాంటి డైరెక్టర్స్ అన్ని నష్టాలను పూడిచే కంటెంట్ ఇస్తారు. ఇదే నమ్మకంతో పెట్టుబడులు పెడుతారు.
అదే విధంగా సితారా ఎంటర్ టైన్మెంట్ చూసుకుంటే.. హారికా హాసినీ, సితారా ఎంటర్ టైన్మెంట్ రెండు కంపెనీలు అనుసంధానంగా పని చేస్తాయి. త్రివిక్రమ్ శ్రీనివాస్ వీరి ఇన్ హౌస్ డైరెక్టర్. జులై. సన్నాఫ్ సత్యమూర్తి, అఆ, అజ్ఞాతవాసి, అరవింద సమేతా, అలా వైకుంఠపురములో, గుంటూరు కారం ఇలా త్రివిక్రమ్ అన్ని సినిమాలను ఈ సంస్థలే ప్రొడ్యూస్ చేస్తున్నాయి. ఆ తరువాత మ్యడ్, డీజే టిల్లు, టిల్లు స్కేర్, లక్కీ భాస్కర్ లాంటి కొత్త సినిమాలు వస్తున్నాయి. ఇలా రెండు నెలలకు ఒక సినిమా ప్రతీ పండుగకు ఒక సినిమా ఉండేలా చూసుకుంటున్నారు. ప్రతీ సినిమాకు డైరెక్టర్ త్రివిక్రమ్ సహాకారాలు ఉంటాయి. అదే నమ్మకంతో వారు ముందుకు వెళ్తున్నారు. ముందే చెప్పుకున్నట్లు ఒకటి, రెండు సినిమాలు నష్టాలను తీసుకొచ్చి నా త్రివిక్రమ్ ఉన్నాడనే నమ్మకం.
ఇక శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్ విషయానికి వస్తే.. దిల్ రాజు సైతం పెద్ద నిర్మాతనే కానీ ఆయన కంపెనీలో ఇన్ హౌస్ డైరెక్టర్లు లేరు. బయట డైరెక్టర్ల కథలను వింటారు. జాగ్రత్తగా సినిమాలు తీస్తారు. కొడితే గట్టిగా కొడుతారు. ఏదైనా తేడా వస్తే కొంత గ్యాప్ తీసుకొని మంచి సినిమా అందించాల్సి వస్తుంది. అదే విధంగా గీతా ఆర్ట్స్ పరిస్థితి. సురేష్ ప్రొడక్షన్ పరిస్థితి కూడా ఇంచుమించు అదే పరిస్థితి. అందుకే ఆ కంపెనీల నుంచి ఒక సినిమా వచ్చిందంటే దాని ఫలితంపై మరో సినిమా ఆధారపడి ఉంటుంది.