Reading Time: 2 mins

Telugu Top Heroes By Social Media Followers
సోషల్ మీడియా ఫాలోవర్స్ ఆధారంగా తెలుగు టాప్ హీరోలు

పరిశ్రమలో నటీనటులకు ఎంత క్రేజ్ ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఒకప్పుడు సోషల్ మీడియా లేదు. అప్పుడు సినిమా విడుదల అయినప్పుడే ఎక్కువ ఫ్యాన్స్ హడావిడీ ఉండేది. కానీ ఇప్పుడు సోషల్ మీడియా విపరీతంగా పెరిగిపోయింది. దాంతో సెలబ్రెటీలకు కూడా తమ ఫాలోవర్స్ ఎవరూ అనేది తెలుస్తుంది. నిజానికి సోషల్ మీడియాలో ఉన్న ఫాలోవర్స్‌ను వాళ్ల క్రేజ్ కూడా మార్కెట్‌లో పెరుగుతుందంటే అతిశ యోక్తి కాదు. సోషల్ మీడియా ఈ రోజుల్లో చాలా పవర్ ఫుల్ మీడియం అయిపోయింది. ఒకప్పుడు ఇద్దరి హీరోల సినిమాలు ఒకే రోజు విడుదల అయితే థియేటర్ల వద్ద రచ్చ జరిగేది, ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో ప్రతీరోజు రచ్చ రచ్చ జరుగుతుంది. మా హీరో గ్రేట్ అంటే మా హీరో గ్రేట్ అంటూ సోషల్ మీడియాలో ట్రోల్ చేసుకుంటారు.. ట్రెండ్ చేసుకుంటారు ఇలా మొత్తానికి ఓ వార్ జరుపుతారు. అందుకే హీరోలు సైతం తమ ఫాలోవర్స్‌ను పెంచుకునేందుకు, వారిని ఆకట్టుకునేందు ప్రయత్నిస్తున్నారు. ప్రస్తుతానికి సోషల్ మీడియా మాధ్యమాలైన ఎక్స్, ఇన్‌స్టా వేదికలలో ఉన్న ఫాలోవర్స్ బట్టి వారిని ఒక వరుసలో పెట్టే ప్రయత్నం చేద్దాం.

 

1. మహేష్ బాబు
సూపర్ స్టార్ మహేష్ బాబు ఫ్యాన్స్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. అటు మాస్ ఇటు క్లాస్ ఆడియన్స్ తో పాటు ముఖ్యంగా గర్ల్స్ ఎక్కువ మంది ఆయనకు అభిమానలు ఉంటారు అన్న విషయం అందరికీ తెలిసిందే. ఇక మహేష్ బాబుకు ఎక్స్ ప్లాట్ ఫామ్‌లో తెలుగులో అత్యధికంగా 13.7 మిలియన్ల ఫాల్లోవర్స్ ఉన్నారు. అలాగే ఇన్‌స్టాగ్రామ్‌లో సైతం 14.3 మిలియన్లతో టాప్ ప్లేస్‌లో ఉన్నారు.

2. అల్లు అర్జున్
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్‌ ఫ్యాన్స్ చేసే రచ్చ గురించి అందరికీ తెలిసిందే. వాళ్ల అభిమాన హీరోను ఎక్కడైనా ఎవరైనా చిన్న మాట అన్న ఊరుకోరు. సోషల్ మీడియాలో యుద్దమే చేస్తారు. ఇక అల్లు అర్జున్‌కు ఎక్స్ ఖాతాలో 8.3 మిలియన్ల మంది ఫాలోవర్స్ ఉండగా.. ఇన్‌స్టాగ్రామ్‌లో 26 మిలియన్స్ ఫాలోవర్స్‌తో మహేష్ బాబును బీట్ చేశారు.

3. ఎన్టీఆర్
జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్ ఫాలోయింగ్ మాములుగా ఉండదు. వరుసగా సిినిమాలు చేస్తున్న ఈ గ్లోబల్ స్టార్‌కు ఎక్స్ ఖాతాలో 7.6 మిలియన్ల ఫాలోవర్స్ ఉన్నారు. ఇక ఇన్‌స్టాగ్రామ్‌లో 8 మిలియన్స్ ఫాలోవర్స్ ఉన్నారు.

4. రానా
దగ్గుబాటి రానా సినిమాల్లో స్పెషల్ క్యారెక్టర్లు చేస్తన్నప్పటికీ హీరోగా రాణిస్తున్న నటుడు. రానాకు సైతం సోషల్ మీడియాలో విపరీతమైన ఫాలోవర్స్ ఉంటారు. ఎప్పుడూ యాక్టీవ్‌గా ఉండే రానాకు ఎక్స్ ఖాతాలో 6.9 మిలియన్ల మంది ఫాలోవర్స్ ఉన్నారు. అదే ఇన్‌స్టాగ్రామ్‌లో 5 మిలియన్ల మంది ఫాలోవర్స్ ఉన్నారు.

5. నాగార్జున
అక్కినేని నాగార్జునకు సైతం సోషల్ మీడియాలో విపరీతమైన ఫాలోవర్స్ ఉన్నారు. ఒక వైపు సినిమాలు మరోవైపు రియాలిటీ టీవీ షోలు చేస్తూ బిజీగా ఉండే కింగ్ నాగార్జునకు ఎక్స్ ఖాతాలో 6.3 మిలియన్ల మంది ఫాలోవర్స్ ఉన్నారు. కానీ ఇన్‌స్టాగ్రామ్‌లో మాత్రం 26 వేలమంది మాత్రమే ఉన్నారు.

6. పవన్ కల్యాణ్
పవన్ కల్యాన్ ఈ పేరు చెబితే మొదట గుర్తుకొచ్చేది ఆయన అభిమానులే. ఆయనకు సోషల్ మీడియాలో ఫాలోవర్స్ కన్నా బయట ఫాలోవర్స్ విపరీతంగా ఉంటారు. ఇక సోషల్ మీడియాలో చూసుకుంటే ఎక్స్ ఖాతాలో 5.8 మిలియన్లు, ఇన్‌స్టాగ్రామ్‌లో 3.6 మిలియన్ల మంది ఫాలోవర్స్ ఉన్నారు.

7. నాని
నేచురల్ స్టార్ నాని యాక్టింగ్‌కు ఎంతో మంది ఫ్యాన్స్ ఉన్నారు. ఈ మధ్య తన రూట్ మార్చి కాస్త్ మాస్ సినిమాలపై ఫోకస్ పెట్టారు. ఇక ఆయన సోషల్ మీడియా ఫాలోవర్స్ చూసుకుంటే ఎక్స్ ఖాతాలో 4.7 మలియన్లు మంది ఫాలోవర్స్, ఇన్‌స్టాగ్రామ్‌లో 8 మిలియన్ల మంది ఫాలోవర్స్ ఉన్నారు.

8. రామ్ చరణ్
ఆర్ఆర్ఆర్ చిత్రంతో గ్లోబల్ స్టార్ ఇమేజ్‌ను తెచ్చుకున్న హీరో రామ్ చరణ్‌కు సైతం విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. తయితే సోషల్ మీడియాలో మాత్రం కాస్త తక్కువగానే కనిపిస్తుంది. ఆయన ఎక్స్ ఖాతాలో 3.8 మిలియన్ల మంది ఫాలోవర్స్ ఉంటే, ఇన్‌స్టాగ్రామ్‌లో మాత్రం 24 మిలియన్ల మంది ఫాలోవర్స్ ఉన్నారు. ఈ లెక్కలో చూస్తే ఇన్‌స్టాగ్రామ్‌లో ఫాలోవర్స్ ను లెక్కెస్తే అల్లు అర్జున్ తరువాత స్థానంలో రామ్ చరణ్ ఉంటారు.

9. విజయ్ దేవరకొండ
తెలుగులో సోషల్ మీడియాలో మంచి బజ్ క్రియేట్ చేసే హీరోల్లో విజయ్ దేవరకొండ ముందు వరుసలో ఉంటారు. ప్రస్తుతం ఆయన సినిమాలు సరిగా ఆడడం లేదు, అయినా సరే ఆయన ఫాలోవర్స్ మాత్రం తగ్గేదే లే అంటున్నారు.. విజయ్ దేవరకొండకు ఎక్స్ ఖాతాలో 3.7 మిలియన్ల్ మంది ఫాలోవర్స్ ఉండగా ఇన్‌స్టాగ్రామ్‌లో మాత్రం 142 వేల మంది మాత్రమే ఫాలోవర్స్ ఉన్నారు.

10 . చిరంజీవి
తెలుగు చిత్ర పరిశ్రమలో మోస్ట్ పాపులర్ పర్సనాలిటీ చిరంజీవి. కానీ ఆయనకు సోషల్ మీడియాలో టాప్ హీరోలతో పోల్చుకుంటే కాస్త తక్కువే ఉన్నారు. అయినా సరే ఇంత మంది యంగ్ హీరోలు   ఉన్నప్పటికీ టాప్ 10లో చిరంజీవి ఉండడం విశేషం. ఆయనకు ఎక్స్ ఖాతాలో 2 మిలియన్ల మంది, ఇన్‌స్టాగ్రామ్‌లో 3.3 మిలియన్ల మంది ఫాలోవర్స్ ఉన్నారు.

చివరిగా డార్లింగ్, పాన్ ఇండియా స్టార్ ప్రభాస్‌ మాత్రం తన రూట్ సపరేట్‌గా నిర్మించుకున్నారు. ఆయనకు వ్యక్తిగతమైన ఎక్స్ ఖాతా లేదు కానీ ఆయన ఫ్యాన్స్ రన్ చేస్తున్న ప్రభాస్ రాజు ఎక్స్ ఖాతాలో 1.8 మిలియన్ల మంది ఫాలోవర్స్ ఉన్నారు. అలాగే ఇన్‌స్టాగ్రామ్‌లో మాత్రం 13 మిలియన్ల మంది ఫాలోవర్స్ ఉన్నారు. ఈ సోషల్ మీడియా ఖాతాల ద్వారా వారు అభిమానులకు సందేశాన్ని ఇవ్వగలుగుతున్నారు.