Reading Time: < 1 min

Thandel Hero Naga Chaithanya Film Journey
తండేల్ హీరో నాగచైతన్య ఫిల్మ్ జర్నీ

అక్కినేని నటవారసత్వాన్ని ముందుకు తీసుకెళ్తున్న మరో తరం నటుడు నాగచైతన్య. జోష్ సినిమాతో తెలుగు తెరపై మెరిసారు. మొదటి సినిమాతోటే ప్రేక్షక లోకాన్ని ఆకర్షించారు. రెండువ సినిమాతో అమ్మాయిల మనుసు దోసుకున్నాడు. గౌతమ్ మీనన్ దర్శకత్వంలో ఏమాయ చేశావే సినిమాతో అటు తమిళ ప్రేక్షకులకు సైతం చేరువయ్యారు. ఆ తరువాత సుకుమార్ దర్శకత్వంలో సినిమా చేసి కేవలం లవర్ బాయ్ ఇమేజ్ మాత్రమే కాదు మాస్ ఇమేజ్ సైతం తెచ్చుకున్నారు. హిట్ ఫ్లాప్ లతో సంబంధం లేకుండా వరుసగా సినిమాలు చేసే నాగచైతన్య ప్రస్తుతం మరో ప్రయోగాత్మకమైన సినిమాతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు.

అల్లు అరవింద్ సమర్పణలో జీ2 బ్యానర్ పై బన్నివాస్ నిర్మిస్తున్న తాజా చిత్రం తండేల్. కార్తికేయ2 ఫేమ్ చందు మొండేటి దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమాలో నాగచైతన్యతో పాటు సాయిపల్లవి నటిస్తున్నారు. ఈ చిత్రం ఫిబ్రవరి 7న ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్దంగా ఉంది. ఈ సందర్భంగా నాగచైతన్య సినిమా జర్నీని చూద్దాం.

2009- జోష్
2010- ఏం మాయ చేశావే,
2011- 100% లవ్, దడా, బెజవాడ
2013- తడాక
2014- మనం, ఆటోనగర్ సూర్య, ఒక లైలా కోసం
2015- దోచేయ్
2016- ప్రేమమ్, సాహసం శ్వాసగా సాగిపో
2017- రారండోయ్ వేడుక చూద్దాం, యుద్ధం శరణం
2018- శైలజరెడ్డి అల్లుడు, సవ్వసాచి
2019- మజిలీ, వెంకీమామ
2021- లవ్ స్టోరీ
2022-బంగారు రాజు, థాంక్యూ, లాల్ సింగ్ చడ్డా
2023- కస్టడీ
2025- తండేల్