Thandel Heroin Sai Pallavi Movie journey
తండేల్ హీరోయిన్ సాయి పల్లవి మూవీ జర్నీ
అందాల తారా సాయి పల్లవి తెలుగు ప్రేక్షకుల హృదయాలకు ఎంతో దగ్గరైన నటీ. ఈ మలియాల ముద్దుగుమ్మ ప్రేమమ్ సినిమాతో వెండితెరపై ఎంట్రీ ఇచ్చితె తెలుగులో అందరినీ ఫిదా చేసింది. శేఖర్ కమ్ముల దర్శకత్వంలో వరుణ్ తేజ్ హీరోగా తెరకెక్కిన ఫిదా సినిమాతో తెలుగు వారికి దగ్గరైంది. తన ఎక్స్ ప్రెషన్స్ తో మాయ చేసింది. డ్యాన్స్ తో అందరి మతి పోగొట్టింది. తెలుగులో చాలా మంది హీరోలు సాయిపల్లవితో డ్యాన్స్ చేయాలంటే ఇప్పటికీ ఒక్క క్షణం ఆలోచిస్తారు. వంట్లో ఎముకల బదులు స్ప్రింగులు ఉన్నట్లు డ్యాన్స్ చేస్తుంది. అయితే సినిమాల్లో నటించడానికి ముందు ప్రముఖ టెలివిజన్ ఛానెల్ లో ప్రసారం అయ్యే ఢీ షో డ్యాన్స్ చేసింది. డాక్టర్ చదువుకొని యాక్ట్రెస్ అయిన ఈ నటీ ఫిల్మోగ్రఫీని ఒకసారి చూద్దాం.
2005లో కస్తూరి మాన్ అనే చిత్రంలో కాలేజీ అమ్మాయి పాత్రలో నటించింది. 2008లో ధమ్ ధూమ్ అనే తమిళ చిత్రంలో ఓ చిన్న పాత్రలో నటిచింది.
2015 – ప్రేమమ్
2016- కాళి
2017-ఫిదా, మిడిల్ క్లాస్ అబ్బాయి
2018- దియా, కణం, పడి పడి లేచే మనసు, మారి 2
2019-అథిరన్, ఎన్.జి.కె
2020-పావ కధైగల్
2021-లవ్ స్టోరీ, శ్యామ్ సింగరాయ్
2022-విరాట పర్వం,గార్గి
2024-అమరన్
2025-తండేల్