Thandel Movie Press Meet
తండేల్ సినిమా ప్రెస్ మీట్ ఈవెంట్
పైరసీ పెద్ద క్రైమ్. తండేల్ సినిమాని పైరసీ చేస్తున్న వెబ్‌సైట్స్, వాట్సాప్, టెలిగ్రామ్, గ్రూప్ అడ్మిన్లకు ఇదే నా హెచ్చరిక. కేసులు పెట్టాం. మీరు జైలు వెళ్లే అవకాశం ఉంది: నిర్మాత అల్లు అరవింద్
కొంతమంది తెలిసి, మరికొంత మందికి తెలియక పైరసీ చేస్తున్నారు. క్రిమినల్ కేసు ఫైల్ అయితే, వెనక్కి తీసుకోలేము. యువత ఇందులో ఇరుక్కొవద్దు. ఈరోజు ప్రతిదీ ట్రాక్ చేయొచ్చు. మా సినిమా క్లిప్ ఒక్కటి ప్లే చేసినా కేసు పెడతాం: నిర్మాత బన్నీవాసు
”వాట్సాప్, టెలిగ్రామ్ గ్రూప్ అడ్మిన్లకు ఇదే నా హెచ్చరిక. అడ్మిన్లు జాగ్రత్తగా ఉండండి. మీరు జైలు వెళ్లే అవకాశం ఉంది. మేము పట్టుదలతో ఉన్నాం. పైరసీ పెద్ద క్రైమ్. ఇప్పుడు సైబర్ సెల్స్ బాగా పనిచేస్తున్నాయి. ఇప్పుడు మిమ్మల్ని పట్టుకోవడం కూడా తేలిక. నిన్న ఆర్టీసీ బస్సుల్లో సినిమా పైరసీ ప్రింట్ ప్రదర్శించడం డ్రైవర్ అమాయకత్వం’అన్నారు నిర్మాత అల్లు అరవింద్. నాగచైతన్య, సాయిపల్లవి జంటగా చందూ మొండేటి దర్శకత్వంలో రూపొందిన మూవీ తండేల్. అల్లు అరవింద్ గీత ఆర్ట్స్ సమర్పణలో బన్నీ వాసు నిర్మించిన ఈ చిత్రం ఫిబ్రవరి 7న ప్రేక్షకుల ముందుకు వచ్చి బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకుంది. అయితే ఈ సినిమాను పైరసీ చేసి ఆన్లైన్లో పెట్టారు. అలాగే ఏపీఎస్ ఆర్టీసీ బస్సులోనూ ప్రదర్శించారు. దీనిపై చిత్ర నిర్మాతలు బన్నీవాసు, సమర్పకులు అల్లు అరవింద్ విలేకరుల నిర్వహించారు.
ప్రెస్ మీట్ లో నిర్మాత అల్లు అరవింద్ మాట్లాడుతూ.. అందరికీ నమస్కారం. మీ అందరి సహకారంతో తండేల్ సినిమా సినిమా పెద్ద సూపర్ హిట్ అయింది. మా టీమ్ అంతా కలిసి ఆంధ్రాలో సక్సెస్ టూర్ చేస్తున్నారు. ప్రజల నుంచి చాలా అద్భుతమైనటువంటి స్పందన వస్తుంది. ఇవాళ కలవడానికి ముఖ్య ఉద్దేశం పైరసీ. నిర్మాతలు, ఫిల్మ్ ఛాంబర్, ఓటీటీ చర్యల వల్ల కొన్ని సంవత్సరాలుగా సినిమా పైరసీ ఆగింది. అయితే రెండు నెలల నుంచి మళ్లీ పైరసీ రాక్షసి పడగ విప్పి నాట్యం ఆడుతోంది. మొన్న దిల్ రాజు గారి సినిమాని ఇలాగే ఆన్లైన్లో విడుదల చేశారు. చాలా ప్రయత్నాలు చేసి, లింక్‌లు తొలగించాం. పైరసీపై పోరాటం చేసేందుకు ఫిల్మ్ ఛాంబర్లో సెల్ ఏర్పాటు చేశాం. వాళ్లు పగలూ రాత్రి పైరసీ నియంత్రణకు పనిచేస్తూ ఉంటారు. సమస్య ఏంటంటే, చాలా మంచి ప్రింట్ ఎక్కువగా వచ్చేస్తోంది. వాట్సప్ గ్రూపుల్లో లింకులను ఫార్వర్డ్ చేస్తున్నారు. ఇలా చేస్తున్న వాట్సప్, టెలిగ్రామ్ గ్రూప్‌ల అడ్మిన్లను గుర్తించాం. వారిని సమాచారాన్ని సైబర్ క్రైమ్ దృష్టికి తీసుకెళ్లాం. వారందనినీ అరెస్ట్ చేయిస్తాం. వాట్సాప్, టెలిగ్రామ్ గ్రూప్ అడ్మిన్లకు ఇదే నా హెచ్చరిక. అడ్మిన్లు జాగ్రత్తగా ఉండండి. మీరు జైలు వెళ్లే అవకాశం ఉంది. మేము పట్టుదలతో ఉన్నాం. ఇదొక క్రైమ్. ఇప్పుడు సైబర్ సెల్స్ బాగా పనిచేస్తున్నాయి. ఇప్పుడు మిమ్మల్ని పట్టుకోవడం కూడా తేలిక. కొంతమంది వెబ్సైట్స్లోనూ పెడుతున్నారు. నిన్న ఆర్టీసీ బస్సుల్లో సినిమా పైరసీ ప్రింట్ ప్రదర్శించడం డ్రైవర్ అమాయకత్వం. సినిమా సక్సెస్ కావడనికి మీడియా వారు ఎంత సహకరించారో పైరసీని అరికట్టడానికి కూడా సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాను. సినిమా సక్సెస్‌ను ఆస్వాదించే సమయంలో ఇదొక ప్రతిబంధకం అయింది. దయచేసి మీరంతా సహకరించాలని కోరుతున్నాను’ అన్నారు.
నిర్మాత బన్నీ వాసు మాట్లాడుతూ..‘‘గత రెండేళ్ల నుంచి పైరసీ కంట్రోల్ లోకి వచ్చింది. ‘గీత గోవిందం’ తర్వాత చాలా ఫైట్ చేసిన కఠిన చర్యలు తీసుకోవడం వల్ల చాలా వరకూ తగ్గింది. ఓటీటీల రాకతో పైరసీ తగ్గుతూ వచ్చింది. అన్ని భాషలతో పోలిస్తే, తెలుగులో పైరసీని చాలా వరకూ కంట్రోల్ చేయగలిగాం. తెలుగులో ఎప్పుడూ లేని కల్చర్ గత రెండు నెలల కనపడుతోంది. ఈ సినిమా మా అందరి కష్టం. రెండేళ్లు ఎంతో శ్రమించాం. సినిమా బ్లాక్ బస్టర్ సాధించి మేము ఎంజాయ్ చేసే సమయంలో ఇలా జరిగింది. సోమవారం నుంచి టికెట్ రేట్లు తగ్గించాలని అల్లు అరవింద్ సూచించారు. అందుకు తగినట్లుగానే చాలా థియేటర్స్‌లో టికెట్ ధరలు తగ్గించాం. సినిమాను ఎక్కువ మందికి అందుబాటులోకి తీసుకురావాలన్నదే మా ఉద్దేశం. మా బాధేంటంటే కొంతమంది తెలిసి, మరికొంత మందికి తెలియక ఇలాంటి పనులు చేస్తున్నారు. క్రిమినల్ కేసు ఫైల్ అయితే, వెనక్కి తీసుకోలేము. యువత ఇందులో ఇరుక్కొవద్దు. ఈరోజు ప్రతిదీ ట్రాక్ చేయొచ్చు. సైబర్ పోలీసులకు ఇది మరింత ఈజీ. ఈ రోజు కేసులు వేశాం. ఆర్టీసీ బస్సులో ప్రదర్శించడం మమ్మల్ని మరింత బాధించింది. మూడో రోజు సినిమాని ఎపీఎస్ ఆర్టీసీలో వేస్తే నిర్మాతలు ఇంకమేము ఏం చేయాలి. ఈ పైరసీలో మొదటి బాధితుడు పవన్‌కల్యాణ్‌గారు. ‘అత్తారింటికి దారేది’ ముందే విడుదలైంది. ఈ విషయాన్ని ఆయన దృష్టికీ తీసుకెళ్లేందుకు ప్రయత్నిస్తున్నాను. ఈ విషయాన్ని చాలా సీరియస్ గా తీసుకుంటాం. ‘‘తండేల్’ పైరసీ కాపీ 100శాతం ఓవర్సీస్ నుంచే వచ్చింది. ఇది తమిళ ప్రింట్ నుంచి వచ్చింది. దానికి తెలుగు ఆడియో కలిపారు. అది కూడా గుర్తించాం. క్యూబ్‌లో కోడ్ ఉంటుంది. కానీ, పైరసీ కాపీలో ఆ కోడ్‌లేదు. ఎక్కడి నుంచి వచ్చిందనే దానిని గుర్తించే పనిలో ఉన్నాం. ఈ విషయంలో నిర్మాతలకు మన ప్రభుత్వం చాలా బాగా సపోర్ట్ చేస్తోంది. పైరసీ చేసిన వాళ్లకి, దాన్ని డౌన్లోడ్ చేసుకున్న వాళ్లకీ కేసులు వర్తిస్తాయి. సామాన్య ప్రజలు ఇందులో చిక్కుకోవద్దని కోరుతున్నా. కేబుల్ ఆపరేటర్లకు కూడా మా హెచ్చరిక. మా సినిమా క్లిప్ ఒక్కటి ప్లే చేసినా కేసు పెడతాం. చివరి వరకూ పోరాడుతాం.‘తండేల్’ పైరసీ చేస్తే 9573225069 నెంబర్ కు మెసేజ్ చేయండి. అభిమానులు చేయాల్సింది ఇదొక్కటే. సాక్ష్యాలు ఉంటే కచ్చితంగా న్యాయపోరాటం చేస్తాం. ముఖ్యంగా అక్కినేని అభిమానులకు చెబుతున్నాను. చైతన్య గారికి చాలా మంచి సినిమా తీసిఇచ్చాము. ఆయన కెరీర్ లో వన్ అఫ్ ది బెస్ట్ అయ్యే చాన్స్ వుంది. అన్ని విధాలుగా ప్రమోట్ చేస్తున్నాం. అలాంటి సినిమాని కాపడుకోవాల్సిన బాధ్యత మాతో పాటు మీకూ వుంది. పైరసీ జరిగితే ఈ నెంబర్ కి మెసేజ్ పెట్టండి’ అన్నారు.