Reading Time: 3 mins

Thandel Movie Release Date Press Meet Event

 

తండేల్ మూవీ రిలీజ్ డేట్ ప్రెస్ మీట్

‘తండేల్’ ఎప్పుడు రిలీజ్ చేసినా అది పండగే. ఫిబ్రవరి 7.. దుల్లకొట్టేదాం: రిలీజ్ డేట్ ప్రెస్ మీట్ లో హీరో నాగ చైతన్య

-అల్లు అరవింద్ ప్రెజెంట్స్ – నాగ చైతన్య, సాయి పల్లవి, చందూ మొండేటి, బన్నీ వాస్, గీతా ఆర్ట్స్ – తండేల్ ఫిబ్రవరి 7, 2025న థియేట్రికల్ రిలీజ్

యువ సామ్రాట్ నాగ చైతన్య హీరోగా, చందూ మొండేటి దర్శకత్వంలో తెరకెక్కుతున్న హైలీ యాంటిసిపేటెడ్ మూవీ ‘తండేల్’ విడుదలకు సిద్ధమవుతోంది. అల్లు అరవింద్ సమర్పణలో ప్రతిష్టాత్మకమైన గీతా ఆర్ట్స్ బ్యానర్‌పై బన్నీ వాస్ నిర్మిస్తున్న ఈ సినిమా ప్రొడక్షన్ పూర్తి కావస్తుండగా, రిలీజ్ డేట్ ని అఫీషియల్ గా అనౌన్స్ చేశారు.

తండేల్ ఫిబ్రవరి 7, 2025న ప్రేక్షకుల ముందుకు రానుంది. వాలెంటైన్స్ డే కి ముందు సినిమా రిలీజ్ కావడం, సీజన్‌లోని రొమాంటిక్ మూడ్‌ను క్యాపిటిలైజ్ చేసుకునే పర్ఫెక్ట్ ఆపర్చునిటీ.

రిలీజ్ డేట్ పోస్టర్ లో లీడ్ పెయిర్ నాగ చైతన్య మరియు, పల్లవి మధ్య కెమిస్ట్రీ అదిరిపోయింది. ఇది అందమైన సముద్ర నేపథ్యంలో సెట్ చేయబడింది. ఈ పోస్టర్ వారి పాత్రలు మధ్య డీప్ లవ్ ని సూచిస్తుంది. ఇప్పటికే విడుదలైన టీజర్, పోస్టర్‌లకు అద్భుతమైన స్పందన రావడంతో సినిమాపై భారీ బజ్ ఏర్పడింది. బ్లాక్‌బస్టర్ హిట్ ‘లవ్ స్టోరీ’ తర్వాత నాగ చైతన్య, సాయి పల్లవి జోడిని మరోసారి తెరపై చూడటానికి అభిమానులు ఎంతగానో ఎదురుచుస్తున్నారు.

ఆంధ్ర ప్రదేశ్‌లోని శ్రీకాకుళం జిల్లాలోని డి మచ్చిలేశం గ్రామంలో జరిగిన నిజ జీవిత సంఘటనల స్ఫూర్తితో ఈ మూవీని రూపొందిస్తున్నారు. లవ్, యాక్షన్, డ్రామా, అడ్రినలిన్ రష్ మూమెంట్స్ బ్లెండ్ తో ఈ సినిమా అద్భుతంగా వుండబోతోంది.  నేషనల్ అవార్డ్ విన్నింగ్ కంపోజర్ దేవి శ్రీ ప్రసాద్ ఈ చిత్రానికి మ్యూజిక్ అందిస్తున్నారు. సినిమాటోగ్రఫీ శామ్‌దత్,  నేషనల్ అవార్డ్ విన్నర్ నవీన్ నూలి ఎడిటర్. ఆర్ట్ విభాగానికి శ్రీనాగేంద్ర తంగాల నేతృత్వం వహిస్తున్నారు.

రిలీజ్ డేట్ ప్రెస్ మీట్ లో హీరో నాగ చైతన్య మాట్లాడుతూ.. ప్రేక్షకులకు, అభిమానులకు అందరికీ నమస్కారం. నా కెరీర్‌లో ఇప్పటి వరకు రిలీజ్‌ డేట్‌ను ముందుగా అనుకొని దాన్ని బట్టి సినిమా పూర్తిచేసేవాడిని. సినిమా మొత్తం పూర్తయ్యాక రిలీజ్ డేట్‌ చెబితే బాగుండేదని అనుకునేవాడిని. ఒక యాక్టర్ కి రిలీజ్ డేట్ ఎప్పుడు అని తెలుసుకోవాలని వుంటుంది. అరవింద్ గారికి రిలీజ్ డేట్ గురించి అడిగాను. ఆయన ముందు సినిమా చూపించండని అడిగారు.  నేను అనుకున్న సినిమా అక్కడ కనిపిస్తే రిలీజ్ డేట్ చెప్తాను అన్నారు. ఆ మాట ఆయన అన్నప్పుడు నాకు చాలా హ్యాపీగా అనిపించింది. సినిమా అంటే ఇలానే తీయాలి. ఇది మామూలు సినిమా కాదు. శ్రీకాకుళంలో కొందరు మత్స్యకారుల జీవితం. వారి కష్టం దేశం అంతా షేక్ చేసింది. మేము ఎడిట్ చూశాం. ఈ సినిమా ఎప్పుడు రిలీజ్ చేసినా అది పండగే అవుతుంది. ఫిబ్రవరి7 డేట్ పై నేను చాలా సంతోషంగా వున్నాను.  మంచి సినిమాతో మీ ముందుకు వస్తున్నందుకు ఆనందంగా ఉన్నాం.  100% లవ్ సినిమాతో వాసు తో నా జర్నీ స్టార్ట్ అయింది. ఆయనతో మళ్ళీ ఒక సినిమా చేయాలని ఎప్పటినుంచో అనుకుంటున్నాను.  గీతా ఆర్ట్స్‌లో ఈ స్టోరీ లైన్‌ గురించి వినగానే నాకు చేయాలని అనిపించింది. చాలా పెద్ద కాన్వాస్ సినిమా ఇది. ఈ పాత్ర గురించి తెలుసుకోవాలని శ్రీకాకుళం వెళ్లి మత్స్యకారులతో గడిపాం. నన్ను తెరపై నెక్స్ట్ లెవల్ లో చూపించాలని డైరెక్టర్ చందూ చాలా కష్టపడ్డారు. సాయి పల్లవి క్వీన్‌ ఆఫ్‌ బాక్సాఫీస్‌. తన పాత్ర గురించి కాదు అన్ని పాత్రల గురించి ఆలోచిస్తూ చాలా సపోర్ట్ చేస్తుంది. ఫిబ్రవరి 7.. దుల్లకొట్టేదాం. అందరికీ థాంక్ యూ.’ అన్నారు

హీరోయిన్ సాయి పల్లవి మాట్లాడుతూ.. అందరికీ నమస్కారం. ఈ వేడుకుని చూస్తుంటే ఒక ప్రీ రిలీజ్ ఈవెంట్ లా అనిపిస్తుంది. ఈ సినిమా చేసినప్పుడు కంటే ఇప్పుడు చాలా పెద్ద కాన్వాస్ అయింది.  గీత ఆర్ట్స్ అల్లు అరవింద్ గారు,  బన్నీ వాస్ గారు నాకు ఎలాంటి అవార్డు వచ్చినా, నా సినిమా విజయమైనా ఎంతగానో గౌరవించి, సన్మానిస్తారు.  ఒక కూతురులా చూసుకుంటారు. దానికి నేను థాంక్యూ తప్ప ఇంకేం చెప్పలేను.  మంచి కంటెంట్ ఎప్పుడు వస్తుందో జనాలకి అప్పుడు నచ్చేస్తుంది. ఫిబ్రవరి 7న ఈ సినిమా రావడం చాలా ఆనందంగా ఉంది చాలా బ్యూటిఫుల్ డేట్ అది. ఈ సినిమా అందరికీ నచ్చాలని కోరుకుంటాను. చాలా ఎఫర్ట్ పెట్టి సినిమా చేశాం. అందరికీ థాంక్యూ సో మచ్’ అన్నారు.

నిర్మాత బన్నీ వాస్ మాట్లాడుతూ.. అరవింద్ గారు నా మీద చాలా పెద్ద బాధ్యత పెట్టారు. డిసెంబర్ 20న ఈ సినిమా ఎందుకు రాలేదో వివరణ ఇవ్వమని నాకు చెప్పారు. ఈ సినిమా మొదలు పెట్టినప్పుడు డిసెంబర్ 20న రావాలని టార్గెట్ గా పెట్టుకున్నాం. కానీ ఈ సినిమా షూట్ చేయడం చాలా చాలెంజింగ్. ఒక తుఫాన్ క్రియేట్ చేయాలి. వేరే దేశాల నావెల్ షిప్ కావాలి. చాలా పర్మిషన్స్ తెచ్చుకోవాలి. వీటన్నిటితో పాటు ఏదైతే ఒక క్వాలిటీ ప్రోడక్ట్ ని మేము ఆడియన్స్ కి ఇవ్వాలి అనుకున్నాము అలాంటి క్వాలిటీ ప్రొడక్ట్స్ ఇవ్వాలంటే మేము టీంకి కి టైం ఇవ్వాలి. సినిమా చాలా అద్భుతంగా వచ్చింది. అక్కినేని అభిమానులందరికీ చెప్తున్నాను మీరందరూ హ్యాపీగా ఫీలయ్యే ప్రోడక్ట్  ఫిబ్రవరి 7న మీకు మీకు అందిస్తాం. చైతన్య గారు 100% లవ్ సినిమాలో ఫస్ట్ టైం నిర్మాతగా నా పేరు వేసిన వ్యక్తి.  నన్ను ప్రొడ్యూసర్ గా యాక్సెప్ట్ చేసిన హీరో. ఆయన నాకు ప్రొడ్యూసర్ గా  ట్యాగ్ ఇచ్చారు. దానికి బదులుగా నేను ఒక్కటే ఇవ్వగలను. తండేల్ సినిమాను తీసుకెళ్లి 100 కోట్ల క్లబ్ లో కూర్చోబెడతాం. దానికి కావలసిన అన్ని ప్రయత్నాలు చేస్తున్నాము. అక్కినేని అభిమానులందరికీ చెప్తున్నాను. మంచి షాపింగ్ కాంప్లెక్స్ కి వెళ్ళండి మంచి షర్టు కొనుక్కోండి. కాలర్ ని బాగా ఐరన్ చేయించండి. ఫిబ్రవరి 7 మార్నింగ్ షో చూసిన తర్వాత మీ కాలర్ ఎత్తే రోజది. మీ కాలర్ని ఎత్తే సినిమానే 100% డెలివర్ చేస్తాం. గీత ఆర్ట్స్ నుంచి మేము ఇస్తున్న పక్కా ప్రామిస్ ఇది. సాయి పల్లవి గారు క్వీన్ ఆఫ్ ది బాక్సాఫీస్. చైతన్య గారు, సాయి పల్లవి గారు వీళ్లంతా మాతో ఉన్నప్పుడు ఈ సినిమాని 100 కోట్ల క్లబ్ లోకి తీసుకెళ్లడం పెద్ద పని కాదు. 100% తీసుకెళ్తాం. థాంక్యూ సో మచ్ ‘ అన్నారు

డైరెక్టర్ చందూ మొండేటి మాట్లాడుతూ.. అల్లు అరవింద్ గారి లాంటి గ్రేట్ ప్రొడ్యూసర్ అన్ని చూసే డేట్ వేస్తారు. బిలీవ్ మీ.. అరవింద్ గారు ఏదైతే డేట్ ఇచ్చారో.. ఈ సినిమాకి ది బెస్ట్ రెవిన్యూ, నెంబర్స్ మనం చూస్తున్నాం. థాంక్యూ సో మచ్’ అన్నారు.

నిర్మాత అల్లు అరవింద్ మాట్లాడుతూ.. తండేల్ రిలీజ్ డేట్ చెప్పడం మాకు ఎంతో ప్రత్యేకం. అందుకే మీ అందరి సమక్షంలో ఒక వేడుకలా రిలీజ్ డేట్ ని రివిల్ చేస్తున్నాం. డైరెక్టర్ చందు ఒకరోజు డేట్ చెప్పండి సార్ అని నన్ను కోరారు. ఫస్ట్ హాఫ్ చూశాను. సెకండ్ హాఫ్ చూసిన తర్వాత కూడా చెప్తాను అన్నాను. అప్పటివరకు డేట్ చెప్పకూడదని అనుకున్నాను. రెండు రోజుల క్రితం సెకండ్ హాఫ్ చూశాను. డేట్ పెట్టేద్దామని అన్నాను. ఫిబ్రవరి 7, 2025న తండేల్ రిలీజ్ అవుతుంది. సినిమాకి బెస్ట్ రిలీజ్ డేట్ ఏమిటని డైరెక్టర్ చందు ఒకసారి నన్ను అడిగారు. సినిమా పెద్దగా పోటీ లేకుండా ఒంటరిగా రావాలి. మంత్ ఎండ్ కాకుండా మంత్ లో ఫస్ట్ వీక్ అయితే బాగుంటుంది. అలాగే మన కంటెంట్ ఏమిటో రీచ్ అయ్యేలా, సినిమాని తప్పకుండా చూడాలనే క్యురియాసిటీ కలిగించేలా ప్రమోట్ చేయాలి. ఇవన్నీ 25% మాత్రమే. మిగతా 75% సినిమా బాగుండాలి. బావున్న సినిమా మనదగ్గర వుంది. ఫిబ్రవరి 7 వేస్తే.. 14 ఫిబ్రవరి ఇంపార్టెన్స్ మనకు తెలుసు. అక్కడికి పీక్ లో ఉంటుంది. ఆ డేట్ కి వేద్దామని చెప్పాను’ అన్నారు.

నటీనటులు :

నాగ చైతన్య, సాయి పల్లవి

సాంకేతిక సిబ్బంది :

రచన, దర్శకత్వం: చందూ మొండేటి
నిర్మాత: బన్నీ వాస్
బ్యానర్: గీతా ఆర్ట్స్
సంగీతం: దేవి శ్రీ ప్రసాద్
డీవోపీ: షామ్‌దత్
ఎడిటర్: నవీన్ నూలి