Thandel Movie Thank You Meet
తండేల్ మూవీ థాంక్ యూ మీట్
‘తండేల్’ సినిమా ప్రయాణం శ్రీకాకుళంలోనే మొదలైయింది. మన ‘తండేల్’ ఇక రాజులమ్మ జాతరే. ఇంత పెద్ద విజయాన్ని ఇచ్చిన ఆడియన్స్ కి థాంక్ యూ: బ్లాక్ బస్టర్ లవ్ సునామీ థాంక్ యూ మీట్ లో హీరో అక్కినేని నాగచైతన్య
యువ సామ్రాట్ అక్కినేని నాగచైతన్య, సాయి పల్లవి మ్యూజికల్ బ్లాక్ బస్టర్ ‘తండేల్’. చందూ మొండేటి దర్శకత్వంలో మెగా ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ సమర్పణలో గీతాఆర్ట్స్ బ్యానర్‌పై ఫ్యాషనేట్ ప్రొడ్యూసర్ బన్నీవాసు ప్రతిష్టాత్మకంగా నిర్మించారు. భారీ అంచనాలతో ఫిబ్రవరి 7న ప్రపంచ వ్యాప్తంగా విడుదలై ఈ చిత్రం అన్ని చోట్ల దుల్లగొట్టే రెస్పాన్స్ తో బ్లాక్ బస్టర్ సక్సెస్ ని సొంతం చేసుకుంది. ప్రేక్షకులు, అభిమానులు, విమర్శకులు సినిమాపై ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు. అన్ని వర్గాల ప్రేక్షకులని అలరించిన ‘తండేల్’ హౌస్ ఫుల్ గా రన్ అవుతోంది. ఈ సందర్భంగా ‘తండేల్’ టీం బ్లాక్ బస్టర్ లవ్ సునామీ థాంక్ యూ మీట్ నిర్వహించారు. శ్రీకాకుళంలోని కోడి రామ్మూర్తి స్టేడియంలో జరిగిన ఈ వేడుకకు భారీ సంఖ్యలో అభిమానులు హాజరయ్యారు. ఈ వేడుకలో నాగాచైతన్య, సాయిపల్లవి స్టేజ్ పై డ్యాన్స్ చేయడం ప్రేక్షకులని విశేషంగా అలరించింది.
థాంక్ యూ మీట్ లో హీరో అక్కినేని నాగ చైతన్య మాట్లాడుతూ.. అందరికీ నమస్కారం. ‘తండేల్’ సినిమా ప్రయాణం శ్రీకాకుళంతోనే మొదలైయింది. ఇక్కడికి రావడం చాలా ఆనందంగా వుంది. చందు, కార్తిక్ ఐడియా చెప్పినప్పుడు మొదట ఇక్కడికే వచ్చాను. మీతో మాట్లాడిన తర్వాత తండేల్ రాజు క్యారెక్టర్ కి ఒక డిజైన్ దొరికింది. ఈ రోజు ఆ క్యారెక్టర్ కి అందరూ కాంప్లిమెంట్స్ ఇస్తున్నారంటే అది మీ వల్లే. మీ అందరికీ థాంక్. శ్రీకాకుళం ఓ అద్భుతం. నాకు శ్రీకాకుళం యాస చాలా ఇష్టం. ‘దద్దా చెప్పాను కదా ఈపాలి యేట దుల్లగొట్టేద్దామని. మన ‘తండేల్’ సినిమా ఇక రాజులమ్మ జాతరే. సాయి పల్లవికి థాంక్ యూ. వాసు గారు, అరవింద్ గారు లేకపొతే ఈ జర్నీ వుండేది కాదు. ఈ ఈవెంట్ ని జాగ్రత్తగా ఆర్గనైజ్ చేసిన పోలీసువారికి, సహకరించిన అందరికీ థాంక్ యూ సో మచ్. థాంక్ యూ శ్రీకాకుళం. లవ్ యూ ఆల్’అన్నారు
హీరోయిన్ సాయిపల్లవి మాట్లాడుతూ.. అందరికీ నమస్కారం. మీ అందరినీ చూస్తుంటే చాలా ఆనందంగా వుంది. ఈ కథ ఇక్కడే మొదలైయింది. సక్సెస్ మీట్ మీ అందరినీ కలవడం ఆనందంగా వుంది. మీ లైఫ్ ని స్క్రీన్ పై తీసుకురావడానికి పర్మిషన్ ఇచ్చిన మీ అందరికి థాంక్ యూ. ఇది చాలా స్ఫూర్తివంతమైన కథ. ఈ సినిమా చేయడం నాకు ఓ భాగ్యం. ఇలాంటి కథ నేను చేస్తానని నమ్మినందుకు దర్శక నిర్మాతలు థాంక్ యూ. ఈ సినిమా మీ అందరికీ నచ్చడం నాకు చాలా సంతోషాన్ని ఇచ్చింది. చైతు గారు చాలా హార్డ్ వర్క్ చేశారు. ఈ సినిమాపై ఆయన చాలా నమ్మకం పెట్టారు. మా టీం అందరూ చాలా నమ్మకం పెట్టుకున్నాం. మా నమ్మకం నిజమైనందుకు చాలా ఆనందంగా వుంది’అన్నారు.
నిర్మాత బన్నీవాసు మాట్లాడుతూ.. థాంక్ యూ శ్రీకాకుళం. ఈ జనం చూసి షాక్ అవుతున్నాను. ఈ కథ ఒక్కడే పుట్టింది. డి మత్సలేశ్యం ప్రజలందరికీ థాంక్ యూ. వారి కథ ఇండస్ట్రీలో పెను సంచలనం రేపింది. మాకు సపోర్ట్ చేసిన అందరికీ తనక్ యూ’అన్నారు
డైరెక్టర్ చందూ మొండేటి మాట్లాడుతూ..సిక్కోలు జనాలు దుల్లగొడతారని విన్నాను. ఇప్పుడు చూస్తున్నాను. కథ ఇక్కడే ఆజ్యం పోసుకుంది. ఉత్తరాంధ్ర మీద సినిమా తీస్తే అన్ని దిక్కులు దద్దరిల్లిపోతాయని ఇప్పుడు నాకు అర్థమైంది. ఇంత మంచి విజయాన్ని ఇచ్చిన అందరికీ థాంక్యు. సినిమానిచ్చిన చైతు గారికి థాంక్ యూ. సాయి పల్లవి ఒప్పుకుంటేనే సినిమా అయిపోతుంది.ఇలాంటి నటీనటులు, నిర్మాతలు ఉంటే ఎవరైనా సినిమాని ఇంత క్వాలిటీ గా తీస్తారు. ఇదంతా ఒక టీం ఎఫర్ట్. అందరికీ థాంక్యూ’అన్నారు.
చిత్ర సమర్పకులు అల్లు అరవింద్ మాట్లాడుతూ.. ప్రేక్షకులకు, మీడియా మిత్రులకు, శ్రీకాకుళం ప్రజలందరికీ నమస్కారం. శ్రీకాకుళం జిల్లాలో జరిగిన ఒక కథను తీసుకుని సినిమా చేశాం. ఈ సినిమాని ఇంత గొప్పగా ఆదరించిన తెలుగు ప్రేక్షకులందరికీ ధన్యవాదాలు. ఇక్కడ ప్రారంభమైన ఈ సినిమాని ఈ వేదికగా మీ అందరికీ కృతజ్ఞతలు చెప్పాలని వచ్చాం. కోడి రామ్మూర్తి గారి స్టేడియంలో ఈ వేడుక జరుపుకోవడం చాలా ఆనందంగా ఉంది. ఆయన ఈ ప్రాంతంలో పుట్టి దేశానికి ఎన్నో పేరు ప్రఖ్యాతలు తీసుకొచ్చారు. ఆయన కథని ఏనాటికైనా ఒక సినిమాగా గాని వెబ్ సిరీస్ కి కానీ చేయాలని తలుస్తున్నాం. ఈ సినిమాలో అత్యద్భుతంగా నటించిన నాగచైతన్య గారికి, లేడీ సూపర్ స్టార్ సాయి పల్లవి గారికి, సినిమాని అద్భుతంగా తీసిన డైరెక్టర్ చందు కి థాంక్యూ. సినిమాకి పని చేసిన అందరికీ కృతజ్ఞతలు’అన్నారు.