The Common Point Of Director Koratala Shiva Movies
డైరెక్టర్ కొరటాల శివ సినిమాలో ఆ కామన్ పాయింట్ గమనించారా
ప్రపంచవ్యాప్తంగా ప్రతీ సంవత్సరం వేలల్లో సినిమాలు వస్తుంటాయి. అయితే కొన్ని సినిమాలు చూసినప్పుడు అందులో కొన్ని సీన్లు వేరే ఏదో సినిమాలో చూసినట్లు అనిపిస్తుంది. మరికొన్ని సార్లు ఒకే స్టోరీ లైన్ తీసుకొని ట్రీట్మెంట్ మార్చి ఇంకోలా కథను తెరకెక్కిస్తారు. స్క్రీన్ ప్లే మారుస్తూ మనం చూసిన కథే అయినా.. అదేనా, కాదా అన్న సందేహం వచ్చేలా తెరకెక్కిస్తారు. ఈ విషయంలో డైరెక్టర్ కొరటాల శివ గొప్పతనం గురించి చెప్పుకోవాలి. ఆయన దర్శకత్వం వహించిన అన్ని చిత్రాలను ఒక సారి గమనిస్తే ఒక కామన్ పాయింట్ ఉన్నట్లు అనిపిస్తుంది. అదేంటంటే ఒక వ్యక్తి మంచి లక్ష్యంతో ఒక పనిని మొదలు పెడుతాడు. కొన్ని కారణాల వలన ఆ పనిని పూర్తి చేయలేకపోతాడు. కొంత కాలానికి అతనికి సంబంధించిన వ్యక్తి(హీరో) అదే పనిని మొదలు పెట్టి ఎన్ని సమస్యలు వచ్చినా పూర్తి చేస్తాడు. ఇదే పాయింట్‌తో ఆయన 5 చిత్రాలను తెరకెక్కించి మెప్పించారు. ఇప్పుడు దేవర చిత్రం సైతం ట్రైలర్ చూస్తే అలానే అనిపిస్తుంది. మరి ఆ విశేషాలెంటో చూద్దాం.
మిర్చి:
కొరటాల శివదర్శకత్వంలో 2013లో విడుదలైన మిర్చి సినిమా ఎంత ఘన విజయం సాధించిందో అందిరికీ తెలిసిందే. హింసతో మనుషుల్ని గెలవడం కాదు, ప్రేమతో మనసుల్ని గెలవాలని చెప్పారు. రెండు గ్రామాల మధ్య గొడవలను ఆపాలనే లక్ష్యంతో దేవా ప్రయత్నం చేసి విఫలం అవుతాడు. కొన్నాళ్లకు ఇంటికి వచ్చిన కొడుకు జై(ప్రభాస్) రెండు గ్రామాల మధ్య రగులుతున్న మంటకు ఆజ్యం పోస్తాడు. తరువాత తన తప్పు తెలుసుకొని శత్రువు ఇంట్లోకి వెళ్లి వాళ్లను ప్రేమాతో మారుస్తాడు. ఇక చివర్లో పోరు కాదు, ప్రేమించడమే మనిషి నిజమైన స్వాభావం అని నిరుస్తాడు. వాళ్ల నాన్న దేవ ప్రజల్లో తీసుకురావాలను కొన్న మార్పును జై తీసుకొస్తాడు. అంటే వాళ్ల నాన్న లక్ష్యాన్ని జై సాధించాడు.
శ్రీమంతుడు
సూపర్ స్టార్ మహేష్ బాబు కొరటాల శివ కాంబినేషన్‌లో 2015లో వచ్చిన శ్రీమంతుడు సినిమా చాలా పెద్ద హిట్ అయింది. రవి(జగపతి బాబు) తన ఊరికి మంచి చేయాలను కుంటాడు కానీ కొంత మంద గుండాల వలన అవనపడి సిటీకి వచ్చి తన తెలివితో బిలియనీర్ అవుతాడు. తన బిజినెస్ అంతా కొడుకు హర్ష(మహేష్ బాబు)కు ఇవ్వాలనుకుంటాడు. హర్షకు దాన్ని చూసుకోవడం ఇష్టం ఉండదు. తాను ప్రేమించిన అమ్మాయి ఊరుకు వెళ్లి గ్రామాన్ని దత్తత తీసుకొని అభివృద్ది చేస్తుంటాడు. ఈ క్రమంలో తన తండ్రి గతం గురించి తెలుస్తుంది. తన తండ్రికి అడ్డం వచ్చినట్లే హర్షకు కూడా మంచి చేయకుండా అడ్డుకోవాలని కొందరు చూస్తారు. వారితో ఫైట్ చేసి గ్రామాన్ని అభివృద్ధి పరిచి తండ్రి చేయలేకపోయిన పనిని కొడుకుగా హర్ష చేస్తాడు.
జనతా గ్యారేజ్
ఎన్టీఆర్ హీరోగా 2016లో వచ్చిన జనతా గ్యారేజ్ చిత్రంలో సత్యం(మోహన్ లాల్) ప్రభుత్వం సత్వర న్యాయ చేయలేదని, జనతాగ్యారేజ్ అనే ఆటోమోబైల్ సంస్థను స్థాపించి బాధితులకు అండగా ఉంటాడు. ఈ క్రమంలో తనకు చిన్నప్పుడే దూరం అయిన తమ్ముడి కొడుకు ఆనంద్, సత్యంతో పరిచయం అవుతుంది. ఈ జనతా గ్యారేజ్ బాధ్యతలు ఆనంద్(ఎన్టీఆర్)కు అప్పగిస్తాడు. పెద్ద నాన్న లక్ష్యాన్ని కొడుకుగా ఆనంద్ నెరవేరుస్తాడు.
భరత్ అనే నేను
మహేష బాబుతో రెండోసారి తెరకెక్కించిన చిత్రం భరత్ అనే నేను. 2018లో వచ్చిన ఈ చిత్రంలో రాఘవరావు(శరత్ కుమార్), వరదరాజు(ప్రకాశ్ రాజ్) స్నేహితులు పార్టీ పెట్టి ప్రజలకు సేవా చేయాలనుకుంటారు. కానీ వరదరాజు అవినీతి పరుడు. రాఘవరావు కొడుకు భరత్(మహేష్ బాబు) చిన్నప్పుటి నుంచి తండ్రికి దూరంగా ఫారెన్‌లో చదువుకుంటాడు. తాను పెద్దయ్యాక తండ్రి రాఘవరావు చనిపోవడంతో ఇండియాకు వస్తాడు. అనుకోకుండా సీఎం అవుతాడు. ఆయన కఠినమైన నిర్ణయాలతో వరదరాజును ఉక్కిరిబిక్కిరి చేస్తాడు. ఎలాగైనా తన తండ్రిని ఎలిమినేట్ చేసినట్లే భరత్‌కు కూడా ప్లాన్ చేస్తాడు. కానీ విఫలం అవుతాడు. తండ్రి కూర్చొవలనుకున్న సీఏం స్థానంలో భరత్ కూర్చుంటాడు.
ఆచార్య
మెగాస్టార్ చిరంజీవి, ఆయన తనయుడు రామ్ చరణ్ కలిసి నటించిన చిత్రం ఆచార్య. 2022లో విడుదలైన ఈ చిత్రం ధర్మస్థిలిలోని గుడి చుట్టు జరుగుతుంది. పాదగట్టంలో నివసించే సిద్ద(రామ్ చరణ్) గుడిలో మైనింగ్ జరగకుండా లోకల్ లీడర్లను ఎదురిస్తాడు. ఈ క్రమంలో సిద్దపై ఎటాక్ జరుగుతుంది. ఆ దాడిలో సిద్దను కాపాడి నక్సల్స్ తీసుకెళ్లిపోతారు. అక్కడే ఆచార్య(చిరంజీవి) ఉంటాడు. ఈ క్రమంలో ఒక ఫైట్ లో సిద్ద చనిపోతూ.. ధర్మస్థలిలో ఉన్న గుడిని కాపాడాలని మాట తీసుకుంటాడు. ఆయన లక్ష్యాన్ని నేరవేర్చడానికి ఆచార్య పాదగట్టంలో అడుగుపెడుతాడు. గుండాలను ఎదిరించి గుడిని కాపాడుతాడు.
దేవర
కొరటాల శివ తెరకెక్కించిన అన్ని చిత్రాలను జాగ్రత్తగ గమనిస్తే ఆ కామన్ పాయింట్ ఉంది. ఇక ఇటీవల విడుదలైన దేవర ట్రైలర్ చూస్తే ఆయన గత సినిమాల్లో ఉన్న పాయింటే కనిపిస్తుంది. భయంకరమైన కోస్టల్ ఏరియాలో అందరి క్రూరమైన ధైర్యాన్ని దేవర అనివేస్తుంటాడు. ఈ క్రమంలో భైర గ్యాంగ్ దేవరను ఎటాక్ చేస్తుంది. ఆయన లక్ష్యాన్ని కొనసాగిస్తూ.. దేవర ముసుగులో అందరిని భయపెట్టేది వర(ఎన్టీఆర్) ఏమో అని ట్రైలర్ చూస్తే అర్థం అవుతుంది. దానికి తగ్గట్టుగానే కొన్ని షాట్స్ కూడా చూపించారు. ఈ సెప్టెంబర్ 27 దేవర చిత్రం విడుదల కానుంది. ఇదే పాయింట్‌తో సినిమా తెరకెక్కితే.. కొరటాల శివ సీక్రేట్ ఫార్ములా రివీల్ అయినట్లే. అయితే రెండు భాగాలుగా తెరకెక్కుతన్న ఈ చిత్రాన్ని ఎలా చూపిస్తారో చూడాలి.