Reading Time: < 1 min

The Devil Chair Teaser Review
ది డెవిల్ చైర్ టీజర్ రివ్యూ

పారానార్మల్ యాక్టివిటీస్ బ్యాగ్ డ్రాప్ లో తెరకెక్కిన తాజా చిత్రం ది డెవిల్ చైర్. యాక్టర్ అభి అదిరే అభిగా అందరికి తెలుసు. అభి విక్కీగా ప్రాధాన పాత్రలో వస్తున్న ఈ చిత్రంలో టీజర్ ఇటీవల విడుదల అయింది. టీజర్ ని చూస్తే.. విక్కీ తన గాళ్ ఫ్రెండ్ ఇద్దరు డబ్బులు సంపాదించి పెళ్లి చేసుకొని సెటిల్ అవాలి అనుకుంటారు. అంతలోనే విక్కీ జాబ్ పోయి ఇంట్లో కాళీగా ఉంటాడు. తన చిన్న చిన్న అవసరాలకు కూడా తన గాళ్ ఫ్రెండ్ ని డబ్బులు అడిగి తనను విసిగిస్తుంటాడు. తనకు యాంటిక్ పీసెస్ ను కలెక్ట్ చేయడం హాబీ ఒక చైర్ ను చూపిస్తారు. అక్కడే అభి ఒక డైలాగ్ అంటాడు. ఒక తన్ను తన్నితే విరిగి పోయే ఈ కూర్చికున్నంత వాల్యూ కూడా లేదు చీ తనపై తాను చిరాకు పడుతాడు. అలాంటి సమయంలో అభి కూరగాయలు కట్ చేస్తూ ఏదో ఆలోచిస్తుంటే వేలు తెగుతుంది. వెంటనే చేయిని అక్కడనుంచి వేగంగా తీసే క్రమంలో ఒక రక్తపు చుక్క ఆ చైర్ మీద పడుతుంది. వెంటనే ఆ చైర్ పై ఒక వ్యక్తి ప్రత్యక్షం అవుతాడు. ఎవరు నువ్వు లోపలికి ఎలా వచ్చావు అని విక్కీ అరుస్తుంటే నీవు రక్తం ఇచ్చినందుకు ఈ డబ్బు తీసుకో అని కొంత డబ్బు ఇస్తాడు.

ఆ డబ్బు తీసుకొని విక్కీ సంతోష పడుతాడు. ఆ తరువాత డబ్బు కోసం తన బ్లడ్ ఇవ్వడం మొదలు పెడుతాడు విక్కీ. ఈ క్రమంలో కొన్ని భయానక సీన్స్ చూపించారు. మరీ డబ్బు కోసం విక్కీ అలా ఎంతకాలం చేస్తాడు. అసలు ఆ కూర్చికి ఉన్న కథ ఏంటీ? రక్తం ఇవ్వగానే ప్రత్యక్షం అవుతున్న వారు ఏవరు? ఒక ఆవిడ తన పిండాన్ని కూడా కత్తితో పొడిచి బలి ఇస్తుంది కదా.. ఆ సీన్ నేపథ్యం ఏంటి? ఒక సీన్ లో అభి ఆ కుర్చిలో కూర్చొని ఉంటాడు దాని నేపథ్యం ఏంటి అనే సినిమాలో చూసి తెలుసుకోవాలి.