Reading Time: 3 mins

The G.O.A.T Movie Review
ది గోట్ మూవీ రివ్యూ

Emotional Engagement Emoji

దళపతి విజయ్ తమిళ సూపర్ స్టార్ అయినా తెలుగు ప్రేక్షకులకు ఎంతో దగ్గరయ్యారు. ఆయన నటించిన తుపాకీ, బిగిల్, మాస్టర్, లియో వంటి చిత్రాలు తెలుగులో సైతం బ్లాక్ బస్టర్ అయ్యాయి. దాంతో తెలుగులో మంచి మార్కెట్ ఏర్పడింది. తాజాగా డైరెక్టర్ వెంకట్ ప్రభు దర్శకత్వంలో హీరో విజయ్ డ్యూయల్ రోల్ చేసిన ది గోట్ మూవీ విడుదలైంది. ట్రయిలర్‌తో మంచి రెస్పాన్స్ తెచ్చుకున్న ఈ చిత్రం ప్రచార కార్యక్రమాలు కూడా అందరినీ ఆకర్షించాయి. ఇక విజయ్ ఫ్యాన్స్ మాత్రం విపరీతమైన అంచనాలు పెంచుకున్నారు. ఇన్ని ఎక్స్‌పెక్టేషన్స నడుమ విడుదలైన ది గోట్ చిత్రం ఏ మేరకు ఆకట్టుకుందో చూద్దాం.

కథ:
గాంధీ(విజయ్) యాంటి టెర్రరిస్ట్ స్క్వాడ్‌లో పనిచేసే ఆఫీసర్. గాంధీ ఏం పని చేస్తుంటాడో ఆయన భార్య(స్నేహ), కొడుకు జీవన్‌లకు కూడా తెలియనీయకుండా రహస్యంగా రా ఏజెంట్‌గా పనిచేస్తుంటాడు. కల్యాణ్(ప్రభుదేవ), సునిల్(ప్రశాంత్), అజయ్(అజ్మల్ అమీర్) లు కూడా గాంధీతో కలిసి టీమ్‌గా పనిచేస్తుంటారు. ఒక మిషన్ కోసం గాంధీ తన కొడుకు, ప్రెగ్నెన్సీతో ఉన్న తన భార్యను తీసుకొని బ్యాంకాక్ వెళ్తాడు. అక్కడ అనుకోకుండా తన కొడుకు మిస్ అవుతాడు. తరువాత చనిపోయినట్లు తెలుస్తుంది. అదే సమయంలో స్నేహ కూతురికి జన్మనిస్తుంది. కొన్నాళ్లకు గాంధీ స్క్వాడ్ను వదిలేసి చెన్నై ఎయిర్‌పోర్టులో వర్క్ చేస్తుంటాడు. మళ్లీ కొన్నాళ్లకు ఓ మిషన్ మీద రష్యాకు వెళ్లాల్సి వస్తుంది. ఆ సమయంలో జీవన్ కనిపిస్తాడు. కొంత సంఘర్షణ తరువాత జీవన్‌ను ఇంటికి తీసుకొస్తాడు గాంధీ. కుటుంబం అంతా సంతోషంగా ఉంటారు. అదే సమయంలో గాంధీ బాస్ నజీర్(జయ రాం) ఒక సీక్రెట్ చెప్పాలి అని, కలువమంటాడు. కలిసే సమయంలో ఒక వ్యక్తి నజీర్‌ను చంపేస్తాడు. అలా అజయ్‌ను కూడా చంపేస్తారు. ఈ హత్యలు చే్తున్నది ఎవరు? జీవన్ ఎలా బతికొచ్చాడు?
ఇన్నాళ్లు ఎక్కడున్నాడు? మీనన్ ఎవరు? మీనన్‌కు జీవన్‌కు ఏంటీ సంబంధం? వీటన్నింటిని గాంధీ ఎలా ఎదుర్కొన్నాడు అనేది తెలియాలంటే ది గ్రేట్ ఆఫ్ టైమ్ చూడాల్సిందే.

విశ్లేషణ:
తెలుగులో సైతం ఇలాంటి రా ఏజెంట్ కథలు చాలానే చూశాము. ఇందులో కొత్తదనం ఎమన్నా ఉందంటే అది తండ్రీకొడుకుల మధ్య వచ్చే కాన్‌ఫ్లిక్ట్. చిన్నప్పుడే తప్పిపోయిన కొడుకు పెద్దవాడిన తరువాత కలువడం అనేది ఒక ఎమోషనల్ పాయింట్, మాములుగా అయితే ఏ డైరెక్టర్ అయినా ఆ పాయింట్‌ను చాలా హృద్యంగా చెబుతారు. కానీ వెంకట్ ప్రభు మాత్రం తాను చెప్పాలను కున్న కోణంలోనే చెప్పారు. ఇక చిత్రం మొదలవ్వడమే ఓ భారీ యాక్షన్ ఎపిసోడ్‌తో మొదలౌతుంది. ఆ తరువాత కామెడీ డ్రామాతో నెమ్మదిగా కథలోకి తీసుకెళ్తాడు డైరెక్టర్. కథ బ్యాంకాక్‌కు షిఫ్ట్ అయిన తరువాత కాన్‌ఫ్లిక్ట్ మొదలౌతుంది. అలా సాగుతున్న తరుణంలో తప్పిపోయిన కొడుకు మళ్లీ కనిపించడంతో కథలో కొత్త మలుపు మొదలౌతుంది. ఇక సెకండ్ ఆఫ్‌ నుంచి అసలు కథ మొదలౌతుంది. అసలు జీవన్ బ్యాక్ స్టోరీ ఏంటీ అనేది కథలో ఇంట్రెస్టింగ్ పాయింట్. మీనక్షీ చౌదరీతో వచ్చే లవ్ ట్రాక్  పెద్దగా ఆకట్టుకోలేదు. నిజానికి ఈ పాత్ర కేవలం ఒక పాట కోసం అన్నట్లు మాత్రమే ఉంది. ఇక త్రిష స్పెషల్ సాంగ్‌లో ఆకట్టుకుంది. సెకండ్ ఆఫ్‌లో చాలా సందర్భాలు జరిగిన ఫీలింగ్ వస్తుంది. ముఖ్యంగా సినిమాలో ఎమోషన్స్ లేవు. తండ్రీ కొడుకుల మధ్య బాండింగ్ కానీ, తల్లి ఎమోషన్ కానీ కరెక్ట్‌గా చూపించలేదు. సినిమా ఫస్ట్ ఆఫ్ బాగుంది, సెకండ్ ఇంకా బాగుంటే బాగుండేది.

నటీనటులు:
విజయ్ నటన గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. కొడుకుగా, తండ్రిగా అద్భుతమైన యాక్టింగ్ కనబరిచారు. అయితే కొడుకుగా యంగ్ కనిపించడం కోసం విజయ్ చాలా ఎఫర్ట్ పెట్టినట్లు అనిపిస్తుంది. ఇది కంప్లీట్ విజయ్ సినిమా. ఆ తరువాత ప్రశాంత్, అజ్మల్, ప్రభుదేవ, స్నేహ, లైలా వాళ్ల పాత్రల పరిదిమేర నటించారు. మీనన్‌గా మోహన్ నటన సైతం ఆకట్టుకుంది.

సాంకేతిక అంశాలు:
ముఖ్యంగా డైరెక్టర్ వెంకట్ ప్రభు స్క్రీన్ప్లే బాగుంది. చిన్న రివేంజ్ కథను మూడు గంటలు కూర్చొబెట్టడం అంటే మాములు విషయం కాదు. అయితే కొన్ని లాజిక్‌లు మాత్రం వదిలేశారు. ఇక సినిమాటోగ్రఫి బాగుంది. బీజీఎమ్ ఇంకాస్త బెట్టర్‌గా కొట్టాల్సింది . ఎడిటింగ్ సినిమాకు మైనస్ అలాగే సెకండ్ కాస్త ట్రిమ్ చేస్తే బాగుండేది. ప్రొడక్షన్ వాల్యూస్ చాలా బాగున్నాయి.

ప్లస్ పాయింట్స్

విజయ్ యాక్టింగ్
యాక్షన్ సీక్వెన్స్
కామెడీ

మైనస్ పాయింట్స్
ఎడిటింగ్
బీజీఎం

తీర్పు:
విజయ్ ఫ్యాన్స్ కు ఫుల్ మీల్స్ లాంటి సినిమా కానీ ఏదో మిస్ అయిన ఫిలింగ్ అయితే ఉంటుంది.

Cast & Crew Details :

Movie Title : The Greatest of All Time
Banner : AGS Entertainment (P) Ltd
Release Date : 05-09-2024
Censor Rating : “U/A”
Cast : Thalapathy Vijay, Prashanth , Prabhudeva , Mohan, Jayaram , Sneha , Laila, Ajmal
Story – Director : Venkat Prabhu
Music : Yuvan Shankar Raja
Cinematography : Siddhartha Nuni
Editor : Venkat Raajen
Producers : Kalpathi S Aghoram, Kalpathi S Ganesh, Kalpathi S Suresh
Nizam Distributor : Mythri Movie Distributors LLP
Runtime : 180 minutes