This Week Releases Telugu Movies
ఈ వారం విడుదలయ్యే తెలుగు చిత్రాలు
ప్రేక్షకులను అలరించడానికి ప్రతీవారం కొత్త సినిమాలు థియేటర్లో, ఓటీటీలలో విడుదల అవుతుంటాయి. ఈ వారం కూడా కొన్ని తెలుగు సినిమాలు విడుదల అవడానికి సిద్ధం అయ్యాయి. ఆ సినిమాలేంటో చూద్దాం.
కోర్ట్
నాని ప్రజెంట్ చేస్తున్న తాజా చిత్రం కోర్ట్. వాల్ పోస్ట్రర్ బ్యానర్ పై ఆయన సోదరి ప్రశాంతి తిపిర్నేని ఈ సిినిమాను నిర్మిస్తున్నారు. ప్రియదర్శి లాయర్ గా కనిపిస్తున్నారు. ఈ చిత్ర ట్రైలర్ విడుదలై సినిమాపై మంచి అంచనాలు పెంచింది. ఈ వారం మార్చి 14న థియేటర్లో విడుదలకు సిద్ధం అయింది.
దిల్ రూబా
కిరణ్ అబ్బవరం నటిస్తున్న తాజా చిత్రం దిల్ రూబా. విశ్వకరుణ్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో రుక్సన్ థిల్లాన్ హీరోయిన్ గా నటిస్తున్నారు. మార్చి 14 న విడుదల అవుతున్న ఈ చిత్ర ట్రైలర్ మెప్పించింది. తప్పు చేశాక చెప్పే సారీకి, అవసరం తీరాక చెప్పే థ్యాంక్స్ కు నా దృష్టిలో పెద్దగా తేడా లేదు అనే డైలాగ్ ఆసక్తికరంగా ఉంది.
ఆఫీసర్ ఆన్ డ్యూటీ
కున్‌చకో బొబన్, ప్రియమణి జంటగా నటించిన ఈ మలియాళ క్రైమ్ డ్రామా చిత్రం మార్చి 14న ప్రేక్షకుల ముందుకు రానుంది. యుగానికి ఒక్కడు చిత్రం రీరిలీజ్ అవుతుంది.
వీటితో పాటు ఓటీటీలో కూడా సినిమాలు విడుదల అవుతున్నాయి. అందులో భాగంగా అక్కినేని అఖిల్ నటించిన ఏజెంట్ చిత్రం సోనిలీవ్ లో స్ట్రీమింగ్ కానుంది. ఈ చిత్రం విడుదలై చాలా రోజులు అయినప్పటికీ ఇన్నాళ్లకు ప్రేక్షకుల ముందుకు రానుంది. మార్చి 14న ఈ చిత్రం స్ట్రీమింగ్ కానుంది.
ఈటీవి విన్ లో పరాక్రమం, రామం రాఘవం చిత్రాలు విడుదల స్ట్రీమింగ్ అవుతున్నాయి.