Today Tollywood Topics
ఈరోజు సినిమా ముఖ్యాంశాలు
తెలుగు సినిమా పరిశ్రమలో ఈరోజు ముఖ్యాంశాలు ఏంటో చూద్దాం.
1. చిన్న సినిమాగా విడుదలైన కోర్టు చిత్రం బాక్స్ ఆఫీస్ వద్ద భారీ కలెక్షన్లను రాబడుతోంది. విడుదలైన 6 వ రోజుకే రూ. 36.85 కోట్లు గ్రాస్ వసూల్ చేసిన పోస్టర్ ను అధికారికంగా మేకర్స్ విడుదల చేశారు.
2. సిద్దు జొన్నల గడ్డ, వైష్ణవి చైతన్య హీరోహీరోయిన్లుగా నటిస్తున్న జాక్ చిత్రం నుంచి కిస్ సాంగ్ ఈ రోజు విడుదలైంది. సరేన్ ఈ పాటను రాయగా సురేష్ బొబ్బిలి మ్యూజిక్ అందించారు.
3. ప్రదీప్ మాచి రాజ్ దీపిక పిల్లి నటించిన అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి చిత్రం నుంచి మొదటి చినుకు పాట విడుదలైంది. చంద్రబోస్ రచించిన ఈ పాటకు రధన్ మ్యూజిక్ అందించారు.
4. నాని నటిస్తున్న హిట్ 3 చిత్రం నుంచి ప్రేమ వెల్లువ అనే ఫస్ట్ సింగిల్ విడుదల చేస్తున్నట్లు మేకర్స్ పోస్టర్ విడుదల చేశారు. శీనిధి శెట్టి, నానిల మధ్య మంచి డ్యూయేట్ సాంగ్ లా అనిపిస్తుంది.