Reading Time: 3 mins

Top 1 Actor 2024
టాప్ 1 యాక్టర్ 2024

తెలుగు పరిశ్రమలో చాలామంది హీరోలు ఉన్నారు. వారికి కోట్లల్లో అభిమానులు ఉన్నారు. అందరిలో ఎవరు నెంబర్ వన్ స్థానంలో ఉన్నారు అంటే మాత్రం అంత సులువుగా చెప్పడం కష్టం. అయితే సినిమా విజయాన్ని బట్టి ఏ హీరో అగ్రస్థానంలో ఉన్నాడో చెప్పగలం. అలాగే సినిమాకు వచ్చిన కలెక్షన్లను బట్టి, హీరో తీసుకున్న పారితోషికాన్ని బట్టి, హీరో చేసిన సినిమాలను బట్టి కూడా వారి స్థానాలను నిర్ణయించడం ఒక పద్ధతి. అయితే 2024లో విడుదలైన సినిమాలు ఆ చిత్రాలలో కథానాయకులుగా వారు పోషించిన పాత్రలు అవి ప్రేక్షకులకు కనెక్ట్ అయిన విధానాన్ని బట్టి టాప్ 10 హీరోలలో మొదటి స్థానంలో ఉన్న హీరో అల్లు అర్జున్.

జాతీయ అవార్డు రావడం అంటే ఆషామాషీ వ్యవహారం కాదు. పుష్ప చిత్రంతో అల్లు అర్జున్ ఆ ఘనతను సాధించారు. అల్లు అర్జున్ నటనకు యావత్తు భారతదేశం ఫిదా అయిన విషయం తెలిసిందే. 2024లో పుష్పకు సీక్వెల్ గా పుష్ప ది రూల్ అనే చిత్రం విడుదలైంది. పుష్ప రాజ్ రెడ్ శాండిల్ సిండికేట్ గా ఎలా ఎదిగాడో, ఎలా శాసిస్తున్నాడో, అంతర్జాతీయ మార్కెట్లో ఎలా దూసుకెళ్లాడో సినిమాలో చూపించారు. తన వ్యాపారంలో పుష్ప రాజ్ కింగే అయినప్పటికీ కుటుంబ వ్యవహారంలో మాత్రం శ్రీవల్లికి భర్తగా, తల్లికి కొడుకుగా, ఇంటి పేరుతో అవమానించబడే వ్యక్తిగా ఆయన నటించిన తీరు ప్రేక్షకులను కట్టిపడేసింది. భావ ఉద్యోగాలు, ఫైట్స్, డాన్సులు, ఎక్స్ ప్రెషన్లు ఇలా చెప్పుకుంటూ పోతే మూడు గంటల 20 నిమిషాలు ఉన్న సినిమాలో దాదాపు వన్ మ్యాన్ షో గా అలరించారు. అందుకే అల్లు అర్జున్ 2024 నటుల వరుసలో అగ్రస్థానంలో ఉన్నారు.

అల్లు అర్జున్ కేరీర్ గ్రాఫ్ గురించి అందరికి తెలిసిందే. కె. రాఘవేంద్రరావు దర్శకత్వంలో అల్లు అర్జున్ వెండి తెరకు పరిచయం అయ్యారు.

1. గంగోత్రి(2003)
దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు తెరకెక్కించిన గంగోత్రి సినిమాతో అల్లు అర్జున్ హీరోగా పరిచయం అయ్యారు. ఈ సినిమా కమర్షిల్ హిట్ గ నిలిచింది.
2. ఆర్య(2004)
సుకుమార్ దర్శకత్వంలో వచ్చిన ఆర్య సినిమా సూపర్ హిట్ సాధించింది. ట్రైయాంగిల్ లవ్ స్టోరీ ప్రేక్షకులకు విపరీతంగా నచ్చింది.
3. బన్ని(2005)
మాస్ డైరెక్టర్ వి.వి. వినాయక్ దర్శకత్వంలో తెరకెక్కిన బన్ని చిత్రం కమర్షిల్ గా మంచి విజయం సాధించి అల్లు అర్జున్ ఖాతాలో హిట్ గా నిలిచింది.
4. హ్యాప్పీ(2006)
తెలుగు, తమిళంలో ఎన్ని సూపర్ హిట్ చిత్రాలను అందించిన ఏ కరుణాకరణ్ దర్శకత్వంలో వచ్చిన హ్యాప్పీ చిత్రం పెద్దగా ఆకట్టుకోలేదు. ఫ్లాప్ గా నిలిచింది.
5. దేశముదురు(2007)
స్టార్ హీరో అవాలంటే డైరెక్టర్ పూరితో సినిమా పడాల్సిందే అని అందరికి తెలిసిందే. అలా 2007లో పూరి జగన్నాథ్, అల్లు అర్జున్ కాంబినేషన్ లో దేశముదురు సినిమా విడుదలై బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంది.
6. పరుగు(2008)
భాస్కర్ దర్శకత్వంలో వచ్చిన పరుగు చిత్రం యావరేజ్ గా మిగిలింది. కానీ తండ్రి ప్రేమ, హీరో ప్రేమను అద్భుతంగా చూపించారు.
7. ఆర్య2(2009)
ఐదు సంవత్సరాల తరువాత సుకుమార్ అల్లు అర్జున్ కాంబినేషన్ లో వచ్చిన ఆర్య2 యావరేజ్ టాక్ తెచ్చుకుంది.
8. వరుడు(2010)
గుణశేఖర్ దర్శకత్వంలో వచ్చిన వరుడు చిత్రం డిఫరెంట్ కాన్నెప్ట్ తో వచ్చింది కానీ ప్రేక్షకుల హృదయాలను మెప్పించలేదు. ఫలితంగా ఫ్లాప్ అయింది.
9. వేదం(2010)
క్రిష్ జాగర్లముడి దర్శకత్వంలో వచ్చిన వేదం సిినిమా ఒక మంచి మూవీగా పేరు తెచ్చుకుంది. ఈ చిత్రంలో కేబుల్ రాజ్ పాత్రలో అల్లు అర్జున్ యాక్టింగ్ కు మంచి ప్రశంసలు వచ్చాయి. చిత్రం మాత్రం యావరేజ్ టాక్ తెచ్చుకుంది.
10. బద్రీనాథ్(2011)
డైరెక్టర్ వి.వి వినాయక్ తో రెండో సారి తీసిని బద్రీనాథ్ చిత్రం అంచనాలను తారుమారు చేసింది. బాక్స్ ఆఫీస్ వద్ద ఫ్లాప్ గా నిలిచింది.
11. జులై(2012)
మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్ లో వచ్చిన జులై చిత్రం సూపర్ హిట్ తెచ్చుకుంది. ఈ చిత్రంలో చాలా మంచి డైలాగ్స్ రాశారు త్రివిక్రమ్.
12. ఇద్దరమ్మాయిలతో(2013)
పూరి జగన్నాథ్ తీసిన రెండవ సినిమా ఇద్దరమ్మాయిలతో ఫ్లాప్ గా నిలిచింది.
13. రేసుగుర్రం(2014)
సురేందర్ రెడ్డి అల్లు అర్జున్ కాంబినేషన్ లో వచ్చిన రేసుగుర్రం సినిమా బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది.
14. ఎవడు(2014)
వంశీ పైడిపల్లి దర్శకత్వంలో వచ్చిన ఎవడు చిత్రంలో రామ్ చరణ్ మైయిన్ లీడ్ లో నటించినప్పటికీ బన్ని ఒక 30 నిమిషాల పాత్రలో అలరించాడు. ఈ సినిమా హిట్ గా నిలిచింది.
15. సన్నాఫ్ సత్యమూర్తి
త్రివిక్రమ్ తో కలిసి రెండవ సారీ చేసిన సినిమా సన్నాఫ్ సత్యమూర్తి. డిసెంట్ హిట్ అయింది.
16. రుద్రమాదేవి
గుణశేఖర్ దర్శకత్వంలో వచ్చిన రుద్రమాదేవి సినిమాలో గోనగన్నారెడ్డి పాత్రలో అల్లు అర్జున్ ఆకట్టు కున్నారు. అయితే అనుష్క టైటిల్ రోల్ లో నటించిన ఈ సినిమా థియేటర్ వద్ద పెద్గా హిట్ కాలేదు.
17. సరైనోడు
బోయపాటి శ్రీను దర్శకత్వంలో అల్లు అర్జున్ మాస్ విశ్వరూపం సరైనోడు. బాక్స్ ఆఫీస్ వద్ద మంచి కలెక్షన్లతో సూపర్ హిట్ గా నిలిచింది.
18. దువ్వాడ జగన్నాథం
మాస్ పల్స్ తెలిసిన దర్శకుడు దువ్వాడ జగన్నాథం దర్శకత్వంలో వచ్చిన డీజే చిత్రం పెద్దగా ఆడలేదు.
19. నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా
రచయితగా ఎన్నో సూపర్ హిట్ చిత్రాలకు పనిచేసిన వక్కంతం వంశీ దర్శకత్వంలో వచ్చిన నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా చిత్రం ఫ్లాప్ గా నిలిచింది.
20. అల వైకుంఠపురములో
ముచ్చటగా మూడోసారి త్రివిక్రమ్ కాంబినేషన్ లో వచ్చిన అల వైకుంఠపురములో చిత్రం బాక్స్ ఆఫీస్ వద్ద మంచి విజయాన్ని అందుకుంది. ఫలితంగా బ్లాక్ బస్టర్ హిట్ అయింది.
21. పుష్ప ది రైజ్
సుకుమార్ దర్శకత్వంలో వచ్చిన చిత్రం పుష్ప ది రైజ్ పార్ట్ 1 గా విడుదలై ప్రపంచవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. బ్లాక్ బస్టర్ చిత్రంగా నిలవడమే కాదు పుష్ప2 చిత్రం కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూసేలా చేసింది.
22. పుష్ప ది రూల్
సుకుమార్ దర్శకత్వంలో వచ్చిన చిత్రం పుష్ప గా విడుదలై ప్రపంచవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. బ్లాక్ బస్టర్ చిత్రంగా నిలవడమే కాదు పుష్ప2 చిత్రం కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూసేలా చేసింది.