Reading Time: < 1 min

Top 1 Director 2024
టాప్ 1 డైరెక్టర్ 2024

తెలుగు పరిశ్రమలో చాలామంది డైరెక్టర్లు ఉన్నారు. ప్రతీ డైరెక్టర్ కు తనకంటూ స్పెషల్ స్టైల్ ఉంటుంది. మరికొన్ని రోజుల్లో నూతన సంవత్సరం రాబోతుంది. 2024లో అన్ని భాషల్లో కలిపి 300 కు పైగా చిత్రాలు విడుదలయ్యాయి. అందులో చాలా రకాల జానర్స్ ను తెరకెక్కించారు డైరెక్టర్లు. అందులో కొంతమంది థ్రిల్ ని బాగా హ్యండిల్ చేస్తారు. మరొకొందరు ఎమోషనల్ సీన్స్ బాగా హ్యండిల్ చేస్తారు. అయితే ఏ సినిమా అయినా ప్రేక్షకులను ఆకట్టుకోవాలంటే థ్రిల్ మాత్రమే కాదు ఎమోషనల్ ఎంగేజ్మెంట్ అందించే సీన్స్ పండాలి. అలా పండాలంటే డైరెక్టర్ల శ్రమ, పట్టుదలతో పాటు ప్రతిభ కూడా కావాలి. మరి ఈ సంవత్సరం సినిమాలు తెరకెక్కించిన డైరెక్టర్లలో టాప్ 10 డైరెక్టర్లలో సుకుమార్ మొదటి స్థానంలో ఉన్నారు.

అల్లు అర్జున్ హీరోగా, క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంలో వచ్చిన పుష్పా ది రూల్ చిత్రం కమర్షియల్ గా ఎంత పెద్ద విజయాన్ని అందుకుందో చూస్తూనే ఉన్నాం. నేటికీ మంచి కలెక్షన్లతో దూసుకెళ్తుంది. ఈ చిత్రం ఆద్యంతం ఎర్రచందనం స్మగ్లింగ్ గురించే ఉన్నప్పటికీ అంతర్లీనంగా కుటుంబ బంధాలు, బాంధవ్యాల గురించి చూపించారు. ఎమోషన్స్ అద్భుతంగా తెరకెక్కించే సుకుమార్ పుష్ప 2 లో కూడా అదే స్థాయిలో చూపించారు. అందుకే సకుమార్ నెంబర్ 1 స్థానంలో ఉన్నారు.

సుకుమార్ 2004లో అల్లు అర్జున్ తో ఆర్య సినిమా చేశారు. రెండవ చిత్రం హీరో రామ్ పోతినేని తో జగడం సినిమా తెరకెక్కించారు. ఆ తరువాత ఆర్య 2, 100% లవ్, 1 నేనొక్కడినే చిత్రాన్ని తెరకెక్కించారు. 2016 లో జూనియర్ ఎన్టీఆర్ తో తీసిన నాన్నకు ప్రేమతో సినిమా తో మంచి విజయాన్ని అందుకున్నారు. 2018 లో రాం చరణ్ తేజ తో రంగస్థలం సినిమా తో తన కెరీర్ లో ఉత్తమ విజయాన్ని అందుకున్నాడు. 2021లో అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ తెరకెక్కించిన పాన్ ఇండియా సినిమా పుష్ప ది రైజ్ దాదాసాహెబ్ ఫాల్కే ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ అవార్డ్స్ అందుకున్నారు. ఇప్పుడు పుష్ప ది రూల్ చిత్రంతో మరింత పాపులర్ సంపాదించుకున్నారు.