Reading Time: 2 mins

Top 10 Emotional Engagement Movies 2024
టాప్ 10 ఎమోషనల్ ఎంగేజ్మెంట్ 2024 చిత్రాలు

మరికొన్ని రోజుల్లో నూతన సంవత్సరంలోకి అడుగుపెట్టబోతున్నాము. 2024లో అన్ని భాషల్లో కలిపి 300 కు పైగా చిత్రాలు తెలుగు తెరపైన ప్రదర్శించబడ్డాయి. వాటిలో ఎన్నో చిత్రాలు విజయాన్ని సాధించగా, కొన్ని చిత్రాలు పరాజయాన్ని చవిచూశాయి. ఒక సంవత్సరంలో ఎన్ని చిత్రాలు విడుదలైనా కొన్ని చిత్రాలు మాత్రం మనసుకు దగ్గరగా ఉంటాయి. వాటినే మనం ఎమోషనల్ ఎంగేజ్మెంట్ చిత్రాలు అంటాము. మరి 2024లో ఎమోషనల్ ఎంగేజ్మెంట్ అందించిన టాప్ 10 చిత్రాలు ఏంటో చూద్దాం.

1. అల్లు అర్జున్ హీరోగా, క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంలో వచ్చిన పుష్పా ది రూల్ చిత్రం కమర్షియల్ గా ఎంత పెద్ద విజయాన్ని అందుకుందో చూస్తూనే ఉన్నాం. నేటికీ మంచి కలెక్షన్లతో దూసుకెళ్తుంది. ఈ చిత్రం ఆద్యంతం ఎర్రచందనం స్మగ్లింగ్ గురించే ఉన్నప్పటికీ అంతర్లీనంగా కుటుంబ బంధాలు, బాంధవ్యాల గురించి చూపించారు.

2. ఈ సంవత్సరం విడుదలైన చిత్రాల్లో విజయ్ సేతుపతి నటించిన మహారాజ్ చిత్రం అందరికీ తెగ నచ్చేసింది. తన కూతురికి జరిగిన అన్యాయాన్ని సామాన్యుడైన నాన్న ఎలా ఎదుర్కొన్నాడు అనేది ఈ సినిమా కథ. ఇక పతాక స్థాయిలో వచ్చే ట్విస్ట్ అందరి మతిని పోగొట్టి ప్రేక్షకుల హృదయాలకు దగ్గరయింది.

3. ఎమోషనల్ ఎంగేజ్మెంట్ అందించిన చిత్రాలలో అరవింద్ స్వామి, కార్తీ నటించిన సత్యం సుందరం ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకుంది. వారి కుటుంబానికి జరిగిన అన్యాయానికి తన బంధువలంటే ఇష్టం లేని సత్యం కథ ఈ సత్యం సుందరం. ఈ సినిమాలో సుందరం పాత్రలో నటించిన కార్తీ అందరి మనసు దోచాడు. ఈ చిత్రం క్లైమాక్స్ హృదయాలకు హత్తుకుంటుంది.

4. వెంకీ అట్లూరి దర్శకత్వంలో దుల్కర్ సల్మాన్, మీనాక్షి చౌదరి జంటగా నటించిన చిత్రం లక్కీ భాస్కర్. సాధారణ క్యాషియర్ అయినా భాస్కర్ కోట్లు ఎలా సంపాదించాడు అనే కాన్సెప్ట్ తో ఈ చిత్రాన్ని తెరకెక్కించారు డైరెక్టర్. మధ్యతరగతి వ్యక్తి ఈ సినిమాకు విపరీతంగా కనెక్ట్ అయ్యారు. అందుకే సినిమా సామాన్యులకి చేరువైంది.

5. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ప్రధాన పాత్రలో నాగ్ అశ్విన్ తెరకెక్కించిన భారీ బడ్జెట్ సైన్స్ ఫిక్షన్ ఫాంటసీ చిత్రం కల్కి. ఈ సినిమాలో అమితాబచ్చన్, కమలహాసన్, దీపికా పడుకొనే తదితరులు నటించారు.

6. చిన్న సినిమాగా తెరకెక్కి పాన్ ఇండియా స్థాయిలో విడుదలై, భారీ వసూళ్లను రాబట్టిన చిత్రం హనుమాన్. ప్రశాంతవర్మ దర్శకత్వంలో తేజ సజ్జ హీరోగా నటించిన ఈ చిత్రంలో అమృత అయ్యారు హీరోయిన్ గా నటించారు. తెలుగులో సూపర్ మాన్ క్యారెక్టర్ తో తీసిన ఈ చిత్రం మంచి వసుళ్లలను రాబట్టి అందరి హృదయాల్లో స్థానం సంపాదించుకుంది.

7. నేచురల్ స్టార్ నాని, వివేకాత్రేయ కాంబినేషన్లో వచ్చిన సరిపోదా శనివారం చిత్రం ఎమోషనల్ ఎంగేజ్మెంట్ అందించింది. ముఖ్యంగా ఈ చిత్రంలో ప్రతి నాయకుడి పాత్ర వేసిన ఎస్ జె సూర్య నటన అందరిని మెప్పించింది.

8. సూపర్ స్టార్ మహేష్ బాబు, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ కాంబినేషన్లో వచ్చిన గుంటూరు కారం అమ్మ సెంటిమెంట్తో అందరినీ కట్టిపడేసింది. కమర్షియల్ గా మంచి వసూళ్లనే రాబట్టినా సూపర్ స్టార్ మహేష్ బాబు రేంజ్ కి ఈ బాక్స్ ఆఫీస్ కలెక్షన్లు సరిపోవు అనే ప్రచారం జరిగింది. ఏదేమైనా గుంటూరు కారం చిత్రం ప్రేక్షకుల హృదయాల్లో ప్రత్యేక స్థానంలో నిలిచింది.

9. ఎమోషనల్ ఎంగేజ్మెంట్ కొంతే ఉన్నా ఎంటర్టైన్మెంట్ పరంగా అగ్రస్థానంలో నిలిచిన చిత్రం టిల్లు స్క్వేర్. సిద్దు జొన్నలగడ్డ హీరోగా మల్లిక్ రాం దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం టాలీవుడ్ ప్రేక్షకులను పొట్ట చెక్కలయ్యేలా నవ్వించింది.

10. చిన్న సినిమాగా మలయాళంలో విడుదలైన మంజుమ్మల్ బాయ్స్ మిగతా భాషల్లో కూడా అనువాదం చేసుకొని విడుదలైన అన్నిచోట్ల పాజిటివ్ టాక్ తెచ్చుకుంది. గుణ కేవ్స్ లో ప్రమాదవశాత్తు పడిపోయిన తమ స్నేహితుని తన ఫ్రెండ్స్ ఎలా కాపాడారు అనే పాయింట్ తో ఈ సినిమాను తెరకెక్కించారు. చివరి వరకు ప్రేక్షకుడిని ఉక్కిరిబిక్కిరి చేసిన ఈ చిత్రం మంచి ఎమోషనల్ ఎంగేజ్మెంట్ ని అందించింది.

2024 లో విడుదలైన ఎన్నో అద్భుతమైన చిత్రాలలో ఈ 10 చిత్రాలు కచ్చితంగా ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్నాయి. అందుకే బిజినెస్ ఆఫ్ టాలీవుడ్ టీం విశ్లేషించి ఈ సంవత్సరం విడుదలైన ఎమోషనల్ ఎంగేజ్మెంట్ చిత్రాలలో మొదటి పది చిత్రాలను పేర్కొంది. ఇది కేవలం మా అభిప్రాయం మాత్రమే.