Top 10 Ten Directors 2024
టాప్ 10 డైరెక్టర్స్ 2024
తెలుగు పరిశ్రమలో చాలామంది డైరెక్టర్లు ఉన్నారు. ప్రతీ డైరెక్టర్ కు తనకంటూ స్పెషల్ స్టైల్ ఉంటుంది. మరికొన్ని రోజుల్లో నూతన సంవత్సరం రాబోతుంది. 2024లో అన్ని భాషల్లో కలిపి 300 కు పైగా చిత్రాలు విడుదలయ్యాయి. అందులో చాలా రకాల జానర్స్ ను తెరకెక్కించారు డైరెక్టర్లు. అందులో కొంతమంది థ్రిల్ ని బాగా హ్యండిల్ చేస్తారు. మరొకొందరు ఎమోషనల్ సీన్స్ బాగా హ్యండిల్ చేస్తారు. అయితే ఏ సినిమా అయినా ప్రేక్షకులను ఆకట్టుకోవాలంటే థ్రిల్ మాత్రమే కాదు ఎమోషనల్ ఎంగేజ్మెంట్ అందించే సీన్స్ పండాలి. అలా పండాలంటే డైరెక్టర్ల శ్రమ, పట్టుదలతో పాటు ప్రతిభ కూడా కావాలి. మరి ఈ సంవత్సరం సినిమాలు తెరకెక్కించిన డైరెక్టర్లలో టాప్ 10 డైరెక్టర్లు ఎవరో ఒక సారి చూద్దాం.
10. కొరటాల శివ
కొరటాల శివ దర్శకత్వంలో వచ్చిన దేవర చిత్రం విడుదలైంది. ఎన్టీఆర్ హీరోగా నటించిన ఈ చిత్రంలో ద్విపాత్రాభినం చేశారు. సినిమాలో కథ పరంగా, టేకింగ్ పరంగా అద్భుతంటా తీశారు డైరెక్టర్ కొరటాల శివ. దేవర సినిమాతో ప్రేక్షకుల హృదయాలకు దగ్గరయ్యారు. అయితే సినిమాలో కథ పరంగా బాగుంది. కొన్ని ఎమోషన్స్ సీన్స్ ను ప్రేక్షకులను ఆకట్టుకోలేదు. పార్ట్ 2 కోసం కొన్ని ముఖ్యమైన సీన్స్ తాలుకు ఎమోషన్స్ దాచి ఉంచారు. దాంతో పార్ట్ 2 కోసం ఎదురుచూస్తున్నారు. ఈ సంవత్సరం విడుదలైన దేవరను తెరకెక్కించిన కొరటాల శివ టాప్ 10 దర్శకులలో పవదస్థానంలో ఉన్నారు.
9. త్రివిక్రమ్ శ్రీనివాస్
సూపర్ స్టార్ మహేష్ బాబు, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ కాంబినేషన్లో వచ్చిన గుంటూరు కారం అమ్మ సెంటిమెంట్తో అందరినీ కట్టిపడేసింది. ప్రముఖ రచయిత యద్దనపూడి సులోచన రాసిన కీర్తికిరిటాలు నవల ఆధారంగా త్రివిక్రమ్ ఆయన స్టైల్ లో సినిమాను తెరకెక్కించారు. అయితే తల్లి, కొడుకు నడుమ ఎంతో భావోద్వేగం ఉన్నప్పటికీ తెరమీద చూపించడంలో ఆ ఎమోషన్ సరిపోలేదు అనిపించింది. ఏదేమైనా గుంటూరు కారం చిత్రం ప్రేక్షకుల హృదయాల్లో ప్రత్యేక స్థానంలో ఉంది. అందుకే మన టాప్ 10 డైరెక్టర్స్ లో త్రివిక్రమ్ 9వ స్థానంలో ఉంది.
8. చిదంబరం ఎస్ పొదువల్
చిన్న సినిమాగా మలయాళంలో విడుదలైన మంజుమ్మల్ బాయ్స్ మిగతా భాషల్లో కూడా అనువాదం చేసుకొని విడుదలైన అన్నిచోట్ల పాజిటివ్ టాక్ తెచ్చుకుంది. గుణ కేవ్స్ లో ప్రమాదవశాత్తు పడిపోయిన తమ స్నేహితుని తన ఫ్రెండ్స్ ఎలా కాపాడారు అనే పాయింట్ తో ఈ సినిమాను తెరకెక్కించారు. చివరి వరకు ప్రేక్షకుడిని ఉక్కిరిబిక్కిరి చేసిన ఈ చిత్రం మంచి ఎమోషనల్ ఎంగేజ్మెంట్ ని అందించింది. ఇలాంటి అద్భుతమైన సినిమాను అందించిన చిదంబరం ఎస్ పొదువల్ టాప్ 10 లో ఎనిమిదవ స్థానంలో ఉన్నారు.
7. వెంకట్ అట్లూరి
యంగ్ డైరెక్టర్ వెంకీ అట్లూరి దర్శకత్వంలో వచ్చిన చిత్రం లక్కీ భాస్కర్. ఈ మూవీలో దుల్కర్ సల్మాన్, మీనాక్షి చౌదరి జంటగా నటించారు. సాధారణ క్యాషియర్ అయినా భాస్కర్ కోట్లు ఎలా సంపాదించాడు అనే కాన్సెప్ట్ తో ఈ చిత్రాన్ని తెరకెక్కించారు డైరెక్టర్ వెకంట్ అట్లూరి. ఈ సిినిమా కోసం బ్యాంకింగ్ సెక్టార్ లో జరిగే ఎన్నో అంశాలను అద్భుతంగా చూపించారు. అందుకే ఈ చిత్రం విపరీతంగా కనెక్ట్ అయింది. ఈ సినిమాను తెరకెక్కించిన వెంకి అట్లూరి టాప్ డైరెక్టర్లలో 7వ స్థానంలో ఉన్నారు.
6. వివేక్ ఆత్రేయ
నేచురల్ స్టార్ నాని, వివేక ఆత్రేయ కాంబినేషన్లో వచ్చిన సరిపోదా శనివారం చిత్రం ఎమోషనల్ ఎంగేజ్మెంట్ అందించింది. ఈ కథను డీల్ చేసిన వివేక్ ఆత్రేయ టాప్ డైరెక్టర్లలో 6వ స్థానంలో ఉన్నారు.
5. నితిలాన్ స్వామినాథన్
ఈ సంవత్సరం విడుదలైన చిత్రాల్లో విజయ్ సేతుపతి నటించిన మహారాజ్ చిత్రం అందరికి విపరీతంగా నచ్చింది. తన కూతురికి జరిగిన అన్యాయాన్ని సామాన్యుడైన నాన్న ఎలా ఎదుర్కొన్నాడు అనే కథతో అద్భుతంగా తెరకెక్కించారు నితిలాన్ స్వామినాథన్. ఈ సినిమా కథ. ఇక పతాక స్థాయిలో వచ్చే ట్విస్ట్ అందరి మతిని పోగొట్టి ప్రేక్షకుల హృదయాలకు దగ్గరయింది. ఆ ఎమోషనల్ సీన్ ను చాలా బాగా డీల్ చేశారు డైరెక్టర్ నితిలాన్ స్వామినాథన్. అందుకే టాప్ డైరెక్టర్ల పొజిషన్ లో 5వ స్థానంలో ఉన్నారు.
4. సీ ప్రేమ్ కుమార్
ఈ సంవత్సరం విడుదలైన ఎమోషనల్ హిట్ చిత్రాల్లో దర్శకుడు సీ ప్రేమ్ కుమార్ తెరకెక్కించిన సత్యంసుందరం సినిమా టాప్ 4 స్థానంలో ఉంది. ఎమోషనల్ ఎంగేజ్మెంట్ అందించిన చిత్రాలలో అరవింద్ స్వామి, కార్తీ నటించిన సత్యం సుందరం ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకుంది. వారి కుటుంబానికి జరిగిన అన్యాయానికి తన బంధువలంటే ఇష్టం లేని సత్యం కథ ఈ సత్యం సుందరం. ఈ సినిమాలో సుందరం పాత్రలో నటించిన కార్తీ అందరి మనసు దోచాడు. ఈ చిత్రం క్లైమాక్స్ హృదయాలకు హత్తుకుంటుంది.
3. నాగ్ అశ్విన్
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ప్రధాన పాత్రలో నాగ్ అశ్విన్ తెరకెక్కించిన భారీ బడ్జెట్ సైన్స్ ఫిక్షన్ ఫాంటసీ చిత్రం కల్కి. ఈ సినిమాలో అమితాబచ్చన్, కమలహాసన్, దీపికా పడుకొనే తదితరులు నటించారు. పురాణపాత్రలను తెరమీదకు తీసుకురావడమే కాకుండా తనదైన స్టైల్ ను జోడించి అద్భుతం చేశారు నాగ్ అశ్విన్. ఆయన ట్యాలెంట్ కు ప్రేక్షకులు అందరూ థియేటర్ల వద్ద బారులు తీరారు. ఇక టాప్ 10 లిస్ట్ లో ఈ డైరెక్టర్ మూవడ స్థానంలో ఉన్నారు.
2. ప్రశాంత్ వర్మ
చిన్న సినిమాగా తెరకెక్కి పాన్ ఇండియా స్థాయిలో విడుదలై, భారీ వసూళ్లను రాబట్టిన చిత్రం హనుమాన్. ప్రశాంతవర్మ దర్శకత్వంలో తేజ సజ్జ హీరోగా నటించిన ఈ చిత్రంలో అమృత అయ్యారు హీరోయిన్ గా నటించారు. తెలుగులో సూపర్ మాన్ క్యారెక్టర్ తో తీసిన ఈ చిత్రం మంచి వసుళ్లలను రాబట్టి అందరి హృదయాల్లో స్థానం సంపాదించుకుంది. ప్రశాంత్ వర్మ టేకింగ్ చూసి ప్రేక్షకులు మైమరిచిపోయారు. హనుమాన్ సినిమాను హ్యాండిల్ చేయడంలో ప్రశాంత్ వర్మ చాలా సక్సె అయ్యారు. టాప్ వరుసలో రెండవ స్థానంలో నిలిచారు.
1. సుకుమార్
అల్లు అర్జున్ హీరోగా, క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంలో వచ్చిన పుష్పా ది రూల్ చిత్రం కమర్షియల్ గా ఎంత పెద్ద విజయాన్ని అందుకుందో చూస్తూనే ఉన్నాం. నేటికీ మంచి కలెక్షన్లతో దూసుకెళ్తుంది. ఈ చిత్రం ఆద్యంతం ఎర్రచందనం స్మగ్లింగ్ గురించే ఉన్నప్పటికీ అంతర్లీనంగా కుటుంబ బంధాలు, బాంధవ్యాల గురించి చూపించారు. ఎమోషన్స్ అద్భుతంగా తెరకెక్కించే సుకుమార్ పుష్ప 2 లో కూడా అదే స్థాయిలో చూపించారు. అందుకే సకుమార్ నెంబర్ 1 స్థానంలో ఉన్నారు.
ఈ సంవత్సరం విడుదలైన అన్ని సినిమాలను పరిశీలించి కథ, ఎమోషన్స్ ను అద్భుతంగా చూపించిన విధానాన్ని బట్టి రేటింగ్ ఇచ్చాము. కలెక్షన్లతో, సినిమా బిజినెస్, టాక్ తో సంబంధం లేకుండా కథ ఆద్యంతం ఎమోషనల్ ఎంగేజ్మెంట్ అందించడాన్ని పరిగణలోకి తీసుకున్నాము. ఇది బిజినెస్ ఆఫ్ టాలీవుడ్ వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే.