Reading Time: < 1 min

Top 2 Actor 2024
టాప్ 2వ యాక్టర్ 2024

తెలుగు పరిశ్రమలో చాలామంది హీరోలు ఉన్నారు. వారికి కోట్లల్లో అభిమానులు ఉన్నారు. అందరిలో ఎవరు నెంబర్ వన్ స్థానంలో ఉన్నారు అంటే మాత్రం అంత సులువుగా చెప్పడం కష్టం. అయితే సినిమా విజయాన్ని బట్టి ఏ హీరో అగ్రస్థానంలో ఉన్నాడో చెప్పగలం. అలాగే సినిమాకు వచ్చిన కలెక్షన్లను బట్టి, హీరో తీసుకున్న పారితోషికాన్ని బట్టి, హీరో చేసిన సినిమాలను బట్టి కూడా వారి స్థానాలను నిర్ణయించడం ఒక పద్ధతి. అయితే 2024లో విడుదలైన సినిమాలు ఆ చిత్రాలలో కథానాయకులుగా వారు పోషించిన పాత్రలు అవి ప్రేక్షకులకు కనెక్ట్ అయిన విధానాన్ని బట్టి టాప్ 10 హీరోలలో రెండవ స్థానంలో ఉన్న హీరో విజయ్ సేతుపతి.

ఏ చిత్రమైన ఎమోషనల్ ఎంగేజ్మెంట్ తో పాటు ఆడియన్స్ కనెక్టివిటీని కంటిన్యూ చేస్తుంటే ఆ చిత్రంతో ప్రతి ప్రేక్షకుడు ప్రేమలో పడిపోతారు. దీనికి తోడు కథానాయకుడి నటన అదనపు ఆకర్షణ. సరిగ్గా ఈ కొలతలు ఉన్న చిత్రం మహారాజ. విజయ్ సేతుపతి నటించిన మహారాజ చిత్రం పాన్ ఇండియా రేంజ్ లో అదరగొట్టింది. అలాగే తెలుగు ప్రేక్షకులకు విపరీతంగా నచ్చింది. ఈ సినిమాలో విజయ్ సేతుపతి నటనకు అందరూ ఫిదా అయ్యారు. మొదటి సీన్ నుంచి క్లైమాక్స్ వరకు విజయ్ సేతుపతి యాక్టింగ్ ఆద్యంతం ఆకట్టుకుంది. అందుకే 2024 నటుల్లో ద్వితీయ స్థానాన్ని పొందారు.