Reading Time: < 1 min

Top 2 Director 2024
టాప్ 2వ డైరెక్టర్ 2024

తెలుగు పరిశ్రమలో చాలామంది డైరెక్టర్లు ఉన్నారు. ప్రతీ డైరెక్టర్ కు తనకంటూ స్పెషల్ స్టైల్ ఉంటుంది. మరికొన్ని రోజుల్లో నూతన సంవత్సరం రాబోతుంది. 2024లో అన్ని భాషల్లో కలిపి 300 కు పైగా చిత్రాలు విడుదలయ్యాయి. అందులో చాలా రకాల జానర్స్ ను తెరకెక్కించారు డైరెక్టర్లు. అందులో కొంతమంది థ్రిల్ ని బాగా హ్యండిల్ చేస్తారు. మరొకొందరు ఎమోషనల్ సీన్స్ బాగా హ్యండిల్ చేస్తారు. అయితే ఏ సినిమా అయినా ప్రేక్షకులను ఆకట్టుకోవాలంటే థ్రిల్ మాత్రమే కాదు ఎమోషనల్ ఎంగేజ్మెంట్ అందించే సీన్స్ పండాలి. అలా పండాలంటే డైరెక్టర్ల శ్రమ, పట్టుదలతో పాటు ప్రతిభ కూడా కావాలి. మరి ఈ సంవత్సరం సినిమాలు తెరకెక్కించిన డైరెక్టర్లలో టాప్ 10 డైరెక్టర్లలో ప్రశాంత్ వర్మ రెండవ స్థానంలో ఉన్నారు.

సినిమాగా తెరకెక్కి పాన్ ఇండియా స్థాయిలో విడుదలై, భారీ వసూళ్లను రాబట్టిన చిత్రం హనుమాన్. ప్రశాంతవర్మ దర్శకత్వంలో తేజ సజ్జ హీరోగా నటించిన ఈ చిత్రంలో అమృత అయ్యారు హీరోయిన్ గా నటించారు. తెలుగులో సూపర్ మాన్ క్యారెక్టర్ తో తీసిన ఈ చిత్రం మంచి వసుళ్లలను రాబట్టి అందరి హృదయాల్లో స్థానం సంపాదించుకుంది. ప్రశాంత్ వర్మ టేకింగ్ చూసి ప్రేక్షకులు మైమరిచిపోయారు. హనుమాన్ సినిమాను హ్యాండిల్ చేయడంలో ప్రశాంత్ వర్మ చాలా సక్సె అయ్యారు. టాప్ వరుసలో రెండవ స్థానంలో నిలిచారు. ఆ సినిమాతో తెలుగు తెరపై పరిచయం అయిన ప్రశాంత్ వర్మ ఆ తరువాత రాజశేఖర్ హీరోగా కల్కి సినిమా అనే సిినిమాను తెరకెక్కించారు. తేజ సజ్జ హీరోగా జాంబీరెడ్డి సినిమా తెరకెక్కించి పెద్ద విజయాన్ని సాధించారు. ఇప్పుడు హనుమాన్ 2 కు సిద్దం అయ్యారు.