Reading Time: < 1 min

Top 2 Movie 2024
టాప్ 2వ చిత్రం 2024

సినిమా పరిశ్రమలో ప్రతీ సంవత్సరం వందలాది చిత్రాలు విడుదల అవుతున్నాయి. అలాగే 2024లో అన్ని భాషల్లో కలిపి 300 కు పైగా చిత్రాలు తెలుగు తెరపైన ప్రదర్శించబడ్డాయి. వాటిలో ఎన్నో చిత్రాలు విజయాన్ని సాధించగా, కొన్ని చిత్రాలు పరాజయాన్ని చవిచూశాయి. ఒక సంవత్సరంలో ఎన్ని చిత్రాలు విడుదలైనా కొన్ని చిత్రాలు మాత్రం మనసుకు దగ్గరగా ఉంటాయి. వాటినే మనం ఎమోషనల్ ఎంగేజ్మెంట్ చిత్రాలు అంటాము. మరి 2024లో ఎమోషనల్ ఎంగేజ్మెంట్ అందించిన టాప్ 10 చిత్రాలలో మహారాజ రెండవ స్థానంలో ఉంది.

ఈ సంవత్సరం విడుదలైన చిత్రాల్లో విజయ్ సేతుపతి నటించిన మహారాజ చిత్రం అందరికీ తెగ నచ్చేసింది. తన కూతురికి జరిగిన అన్యాయాన్ని సామాన్యుడైన నాన్న ఎలా ఎదుర్కొన్నాడు అనేది ఈ సినిమా కథ. ఇక పతాక స్థాయిలో వచ్చే ట్విస్ట్ అందరి మతిని పోగొట్టి ప్రేక్షకుల హృదయాలకు దగ్గరయింది. సినిమా మొత్తంలో విజయ్ సేతుపతి యాక్టింగ్ మెప్పిస్తుంది. అలాగే కథలోని ఎమోషన్ కట్టిపడేస్తుంది. టిట్ ఫర్ టాట్ లా ఉంటుంది. ఒక అమ్మాయికి జరిగిన అన్యాయానికి న్యాయం దొరికింది అన్న భావన కలుగుతుంది. అనురాగ్ కశ్యప్ యాక్టింగ్ కూడా చాలా బాగుంటుంది. ప్రతీ ఒక్కరు చాలా బాగా చేశారు. అందుకే ఎమోషనల్ ఎంగేజమెంట్ సినిమాలో 2024లో టాప్ స్థానంలో ఉంది మహరాజ చిత్రం.