Reading Time: < 1 min

Top 3 Actor 2024
టాప్ 3వ యాక్టర్ 2024

తెలుగు పరిశ్రమలో చాలామంది హీరోలు ఉన్నారు. వారికి కోట్లల్లో అభిమానులు ఉన్నారు. అందరిలో ఎవరు నెంబర్ వన్ స్థానంలో ఉన్నారు అంటే మాత్రం అంత సులువుగా చెప్పడం కష్టం. అయితే సినిమా విజయాన్ని బట్టి ఏ హీరో అగ్రస్థానంలో ఉన్నాడో చెప్పగలం. అలాగే సినిమాకు వచ్చిన కలెక్షన్లను బట్టి, హీరో తీసుకున్న పారితోషికాన్ని బట్టి, హీరో చేసిన సినిమాలను బట్టి కూడా వారి స్థానాలను నిర్ణయించడం ఒక పద్ధతి. అయితే 2024లో విడుదలైన సినిమాలు ఆ చిత్రాలలో కథానాయకులుగా వారు పోషించిన పాత్రలు అవి ప్రేక్షకులకు కనెక్ట్ అయిన విధానాన్ని బట్టి టాప్ 10 హీరోలలో మూడవ స్థానంలో ఉన్న హీరో తేజ సజ్జ.

తలుచుకుంటే అసాధ్యం కానిది ఏదీ లేదు అని హనుమాన్ చిత్రంతో తేజ సజ్జ మరోసారి గుర్తు చేశారు. పెద్ద సినిమాపై పోటీగా విడుదలైనప్పటికీ సినిమాలో కంటెంట్ ఉంటే ప్రేక్షకులు నెత్తిన పెట్టుకుంటారు అని నిరూపించిన చిత్రం ఇది. ఈ చిత్రంలో తేజ సజ్జ ఓ సూపర్ హీరోగా కనిపించారు. ఈ చిత్రం ప్రేక్షకులకి బాగా చేరువైంది. అందుకే తేజ సజ్జ నటుడిగా ఈ సంవత్సరం మూడో స్థానంలో ఉన్నారు. తేజ సజ్జా బాల నటుడిగా 1998లో వచ్చిన చూడాలని వుంది నుంచి 2006 బాస్ వరకు నటించారు. ఆ తరువాత ఓ బేబీ చిత్రంలో యువ నటుడిగా తెరపై కనిపించారు. 2021 ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో జాంబీరెడ్డి చిత్రంతో తెలుగు తెరకు హీరోగా పరిచయ అయ్యారు. హను-మాన్ చిత్రంతో పాన్ ఇండియా స్టార్ గా ఎదిగారు.