Top 3rd Director 2024
టాప్ 3వ డైరెక్టర్ 2024
తెలుగు పరిశ్రమలో చాలామంది డైరెక్టర్లు ఉన్నారు. ప్రతీ డైరెక్టర్ కు తనకంటూ స్పెషల్ స్టైల్ ఉంటుంది. మరికొన్ని రోజుల్లో నూతన సంవత్సరం రాబోతుంది. 2024లో అన్ని భాషల్లో కలిపి 300 కు పైగా చిత్రాలు విడుదలయ్యాయి. అందులో చాలా రకాల జానర్స్ ను తెరకెక్కించారు డైరెక్టర్లు. అందులో కొంతమంది థ్రిల్ ని బాగా హ్యండిల్ చేస్తారు. మరొకొందరు ఎమోషనల్ సీన్స్ బాగా హ్యండిల్ చేస్తారు. అయితే ఏ సినిమా అయినా ప్రేక్షకులను ఆకట్టుకోవాలంటే థ్రిల్ మాత్రమే కాదు ఎమోషనల్ ఎంగేజ్మెంట్ అందించే సీన్స్ పండాలి. అలా పండాలంటే డైరెక్టర్ల శ్రమ, పట్టుదలతో పాటు ప్రతిభ కూడా కావాలి. మరి ఈ సంవత్సరం సినిమాలు తెరకెక్కించిన డైరెక్టర్లలో టాప్ 10 డైరెక్టర్లలో నాగ్ అశ్విన్ మూడవ స్థానంలో ఉన్నారు.
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ప్రధాన పాత్రలో నాగ్ అశ్విన్ తెరకెక్కించిన భారీ బడ్జెట్ సైన్స్ ఫిక్షన్ ఫాంటసీ చిత్రం కల్కి. ఈ సినిమాలో అమితాబచ్చన్, కమలహాసన్, దీపికా పడుకొనే తదితరులు నటించారు. పురాణపాత్రలను తెరమీదకు తీసుకురావడమే కాకుండా తనదైన స్టైల్ ను జోడించి అద్భుతం చేశారు నాగ్ అశ్విన్. ఆయన ట్యాలెంట్ కు ప్రేక్షకులు అందరూ థియేటర్ల వద్ద బారులు తీరారు. ఇక టాప్ 10 లిస్ట్ లో ఈ డైరెక్టర్ మూవడ స్థానంలో ఉన్నారు. నాగ్ అశ్విన్ నేను మీకు తెలుసా సినిమాకు సహాయదర్శకుడిగా పనిచేశారు. ఆ తరువాత దర్శకుడు శేఖర్ కమ్ముల వద్ద లీడర్, లైఫ్ ఈజ్ బ్యూటీఫుల్ చిత్రాలకు సహాయ దర్శకుడిగా పనిచేశారు. ఎవడే సుబ్రమణ్యం సినిమాతో తెలుగు తెరపై దర్శకుడిగా పరిచయం అయ్యారు. మహానటి వంటి బ్లాక్ బస్టర్ హిట్ తరువాత కల్కి చిత్రంతో పాన్ ఇండియా స్టార్డమ్ తెచ్చుకున్నారు.