Reading Time: < 1 min

Top 3rd Movie 2024
టాప్ 3rd చిత్రం 2024

సినిమా పరిశ్రమలో ప్రతీ సంవత్సరం వందలాది చిత్రాలు విడుదల అవుతున్నాయి. అలాగే 2024లో అన్ని భాషల్లో కలిపి 300 కు పైగా చిత్రాలు తెలుగు తెరపైన ప్రదర్శించబడ్డాయి. వాటిలో ఎన్నో చిత్రాలు విజయాన్ని సాధించగా, కొన్ని చిత్రాలు పరాజయాన్ని చవిచూశాయి. ఒక సంవత్సరంలో ఎన్ని చిత్రాలు విడుదలైనా కొన్ని చిత్రాలు మాత్రం మనసుకు దగ్గరగా ఉంటాయి. వాటినే మనం ఎమోషనల్ ఎంగేజ్మెంట్ చిత్రాలు అంటాము. మరి 2024లో ఎమోషనల్ ఎంగేజ్మెంట్ అందించిన టాప్ 10 చిత్రాలలో సత్యంసుందరం సినిమా మూడవ స్థానంలో ఉంది.

ఎమోషనల్ ఎంగేజ్మెంట్ అందించిన చిత్రాలలో అరవింద్ స్వామి, కార్తీ నటించిన సత్యం సుందరం ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకుంది. వారి కుటుంబానికి జరిగిన అన్యాయానికి తన బంధువలంటే ఇష్టం లేని సత్యం కథ ఈ సత్యం సుందరం. ఈ సినిమాలో సుందరం పాత్రలో నటించిన కార్తీ అందరి మనసు దోచాడు. ఈ చిత్రం క్లైమాక్స్ హృదయాలకు హత్తుకుంటుంది. ప్రతీ సన్నివేశం సరదాగా ఉంటూనే హృదయాన్ని బరువెక్కిస్తుంది. హస్యాన్ని పంచుతూనే లోతుగా ఆలోచించేలా చేస్తుంది. అరవింద్ సామి యాక్టింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. సుందరం కొడుకును ఏమని దీవించాలి అని తెల్లవారకముందే ఇంట్లో నుంచి దొంగతనంగా వెళ్లే సీన్ అందరి హృదయాన్ని తొలుస్తుంది. ఇక చివర్లో వచ్చే ఎపిసోడ్ చాలా బాగుంటుంది. అలాగే కార్తి నటన అద్భతం. ఆ క్యారెక్టర్లో జీవించారు. అందుకే టాప్ లో 3వ స్థానంలో చోటు సంపాదించుకుంది.