Top 4th Actor 2024
టాప్ 4వ యాక్టర్ 2024
తెలుగు పరిశ్రమలో చాలామంది హీరోలు ఉన్నారు. వారికి కోట్లల్లో అభిమానులు ఉన్నారు. అందరిలో ఎవరు నెంబర్ వన్ స్థానంలో ఉన్నారు అంటే మాత్రం అంత సులువుగా చెప్పడం కష్టం. అయితే సినిమా విజయాన్ని బట్టి ఏ హీరో అగ్రస్థానంలో ఉన్నాడో చెప్పగలం. అలాగే సినిమాకు వచ్చిన కలెక్షన్లను బట్టి, హీరో తీసుకున్న పారితోషికాన్ని బట్టి, హీరో చేసిన సినిమాలను బట్టి కూడా వారి స్థానాలను నిర్ణయించడం ఒక పద్ధతి. అయితే 2024లో విడుదలైన సినిమాలు ఆ చిత్రాలలో కథానాయకులుగా వారు పోషించిన పాత్రలు అవి ప్రేక్షకులకు కనెక్ట్ అయిన విధానాన్ని బట్టి టాప్ 10 హీరోలలో నాలుగవ స్థానంలో ఉన్న హీరో నాని.
నేచురల్ స్టార్ నాని ఎప్పుడూ తెరమీద మ్యాజిక్ చేస్తూ ఉంటారు. ఈ సంవత్సరం కూడా సరిపోదా శనివారం అనే వినూత్నమైన కథతో ప్రేక్షకులను అలరించారు. అమ్మ చెప్పిన మాటను పాటిస్తూ ఎమోషనల్ గా ప్రేక్షకులకు ఎంతో దగ్గరయ్యారు. అందుకే టాప్ ఫోర్ లో ఉన్నారు. ఇంద్రకంటి మోహన్ కృష్ణ దర్శకత్వంలో 2008లో తెరకెక్కిన ‘అష్టాచమ్మా’ చిత్రంతో నాని తెరంగేట్రం చేశారు. ఆ తర్వాత ‘రైడ్’, ‘స్నేహితుడా’, భీమిలి కబడ్డీ జట్టు అనే చిత్రాలతో గుర్తింపు తెచ్చుకున్నారు. ‘అలా మొదలైంది’ సినిమా ప్రేక్షకులకు నానిని మరింత చేరువు చేసింది. ‘పిల్ల జమిందార్’, ‘ఈగ’, ‘ఎటో వెళ్లిపోయింది మనసు’, ‘పైసా’, ‘జెండాపై కపిరాజు’ చిత్రాలు వచ్చాయి.
‘ఎవడే సుబ్రహ్మణ్యం’, ‘భలేభలే మగాడివోయ్’, ‘కృష్ణ గాడి వీర ప్రేమ గాధ’, జెంటిల్మెన్, మజ్ను, నేను లోకల్, నిన్ను కోరి, మిడిల్ క్లాస్ అబ్బాయి, కృష్ణార్జున యుద్ధం, దేవదాస్ వంటి చిత్రాల్లో మెప్పించారు. ఆ తర్వాత జెర్సీ, గ్యాంగ్ లీడర్, వి, టక్ జగదీష్, శ్యాంసింగారాయ్ చిత్రాలలో నటించి నేచురల్ స్టార్ అంటే ఏంటో మరోసారి రుజువు చేశారు. ‘అంటే సుందరానికి’ అనే సినిమాలో నటించారు. ‘దసరా’ అనే మాస్ ఫిలిమ్ ను ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు. హాయ్ నాన్న’ చిత్రంతో మళ్ళీ తన నటనతో ప్రేక్షకుల హృదయాలను దోచుకున్నారు. తాజాగా దర్శకుడు వివేక్ ఆత్రేయ కాంబినేషన్లో రెండోసారి చేస్తున్న చిత్రం సరిపోదా శనివారంతో మెప్పించారు.