Top 4th Director 2024
టాప్ 4వ డైరెక్టర్ 2024
తెలుగు పరిశ్రమలో చాలామంది డైరెక్టర్లు ఉన్నారు. ప్రతీ డైరెక్టర్ కు తనకంటూ స్పెషల్ స్టైల్ ఉంటుంది. మరికొన్ని రోజుల్లో నూతన సంవత్సరం రాబోతుంది. 2024లో అన్ని భాషల్లో కలిపి 300 కు పైగా చిత్రాలు విడుదలయ్యాయి. అందులో చాలా రకాల జానర్స్ ను తెరకెక్కించారు డైరెక్టర్లు. అందులో కొంతమంది థ్రిల్ ని బాగా హ్యండిల్ చేస్తారు. మరొకొందరు ఎమోషనల్ సీన్స్ బాగా హ్యండిల్ చేస్తారు. అయితే ఏ సినిమా అయినా ప్రేక్షకులను ఆకట్టుకోవాలంటే థ్రిల్ మాత్రమే కాదు ఎమోషనల్ ఎంగేజ్మెంట్ అందించే సీన్స్ పండాలి. అలా పండాలంటే డైరెక్టర్ల శ్రమ, పట్టుదలతో పాటు ప్రతిభ కూడా కావాలి. మరి ఈ సంవత్సరం సినిమాలు తెరకెక్కించిన డైరెక్టర్లలో టాప్ 10 డైరెక్టర్లలో సీ ప్రేమ్ కుమార్ నాలుగువ స్థానంలో ఉన్నారు.
ఈ సంవత్సరం విడుదలైన ఎమోషనల్ హిట్ చిత్రాల్లో దర్శకుడు సీ ప్రేమ్ కుమార్ తెరకెక్కించిన సత్యంసుందరం సినిమా టాప్ 4 స్థానంలో ఉంది. ఎమోషనల్ ఎంగేజ్మెంట్ అందించిన చిత్రాలలో అరవింద్ స్వామి, కార్తీ నటించిన సత్యం సుందరం ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకుంది. వారి కుటుంబానికి జరిగిన అన్యాయానికి తన బంధువలంటే ఇష్టం లేని సత్యం కథ ఈ సత్యం సుందరం. ఈ సినిమాలో సుందరం పాత్రలో నటించిన కార్తీ అందరి మనసు దోచాడు. ఈ చిత్రం క్లైమాక్స్ హృదయాలకు హత్తుకుంటుంది. ఏ సినిమా అయినా పతాక స్థాయిలో సీన్స్ పండితే ఆ సినిమా చాలా పెద్ద హిట్ అవుతుంది. అందుకే సత్యంసుందరం సినిమా టాప్ 4లో స్థానం సంపాదించుకుంది.