Reading Time: < 1 min

Top 4th Movie 2024
టాప్ 4వ చిత్రం 2024

సినిమా పరిశ్రమలో ప్రతీ సంవత్సరం వందలాది చిత్రాలు విడుదల అవుతున్నాయి. అలాగే 2024లో అన్ని భాషల్లో కలిపి 300 కు పైగా చిత్రాలు తెలుగు తెరపైన ప్రదర్శించబడ్డాయి. వాటిలో ఎన్నో చిత్రాలు విజయాన్ని సాధించగా, కొన్ని చిత్రాలు పరాజయాన్ని చవిచూశాయి. ఒక సంవత్సరంలో ఎన్ని చిత్రాలు విడుదలైనా కొన్ని చిత్రాలు మాత్రం మనసుకు దగ్గరగా ఉంటాయి. వాటినే మనం ఎమోషనల్ ఎంగేజ్మెంట్ చిత్రాలు అంటాము. మరి 2024లో ఎమోషనల్ ఎంగేజ్మెంట్ అందించిన టాప్ 10 చిత్రాలలో లక్కి భాస్కర్ సినిమా నాలుగువ స్థానంలో ఉంది.

వెంకీ అట్లూరి దర్శకత్వంలో దుల్కర్ సల్మాన్, మీనాక్షి చౌదరి జంటగా నటించిన చిత్రం లక్కీ భాస్కర్. సాధారణ క్యాషియర్ అయినా భాస్కర్ కోట్లు ఎలా సంపాదించాడు అనే కాన్సెప్ట్ తో ఈ చిత్రాన్ని తెరకెక్కించారు డైరెక్టర్. మధ్యతరగతి వ్యక్తి ఈ సినిమాకు విపరీతంగా కనెక్ట్ అయ్యారు. అందుకే సినిమా సామాన్యులకి చేరువైంది. సినిమా ఆద్యంతం క్యారెక్టర్ భాస్కర్ నేరషన్ తో సాగుతుంది. బ్యాంక్ లో ఇలాంటి లూప్ హోల్స్ ఉంటాయని చూపించారు. సినిమాలో ఎమోషన్స్ మాత్రమే కాదు టెన్షన్ బిల్డింగ్ సీన్స్ కూడా చాలా ఆకట్టుకున్నాయి. ఆయన అసలు ఎలా తప్పించుకున్నారు అనేది సినిమాలో ప్రాపర్ గా చూపించారు. భాస్కర్ మారిన తరువాత ఎలాంటి పరిణామాలు చోటుచేసుకుంటాయని తెరమీద చూపించిన తీరు మెప్పిస్తుంది. ఈ ఏడాది విడుదలైన సినిమాల్లో లక్కీ భాస్కర్ ప్రత్యేకస్థానంలో ఉంది. అందుకే ఈ ఏడాది టాప్ 4 స్థానంలో నిలబడింది.