Top 5th Actor 2024
టాప్ 5వ యాక్టర్ 2024
తెలుగు పరిశ్రమలో చాలామంది హీరోలు ఉన్నారు. వారికి కోట్లల్లో అభిమానులు ఉన్నారు. అందరిలో ఎవరు నెంబర్ వన్ స్థానంలో ఉన్నారు అంటే మాత్రం అంత సులువుగా చెప్పడం కష్టం. అయితే సినిమా విజయాన్ని బట్టి ఏ హీరో అగ్రస్థానంలో ఉన్నాడో చెప్పగలం. అలాగే సినిమాకు వచ్చిన కలెక్షన్లను బట్టి, హీరో తీసుకున్న పారితోషికాన్ని బట్టి, హీరో చేసిన సినిమాలను బట్టి కూడా వారి స్థానాలను నిర్ణయించడం ఒక పద్ధతి. అయితే 2024లో విడుదలైన సినిమాలు ఆ చిత్రాలలో కథానాయకులుగా వారు పోషించిన పాత్రలు అవి ప్రేక్షకులకు కనెక్ట్ అయిన విధానాన్ని బట్టి టాప్ 10 హీరోలలో ఐదవ స్థానంలో ఉన్న హీరో మహేష్ బాబు.
అమ్మ సెంటిమెంట్ త్రివిక్రమ్ మాటలతో తెరకెక్కిన సూపర్ స్టార్ మహేష్ బాబు చిత్రం గుంటూరు కారం. ఈ చిత్రంలో మహేష్ బాబు స్టైల్ చాలా భిన్నంగా, కొత్తగా ఉంటుంది. క్లైమాక్స్ లో ఆయన పండించిన భావోద్వేగాల సన్నివేశం ప్రేక్షకుల హృదయాల్లో పదిలంగా ఉంది. అందుకే 2024లో టాప్ హీరోలలో ఐదో స్థానంలో ఉన్నారు. బాలనటుడిగా 8 కి పైగా సినిమాల్లో నటించాడు. కథానాయకుడిగా 25కి పైగా చిత్రాల్లో నటించాడు. మొదటి సినిమా రాజకుమారుడు తోనే నంది ఉత్తమ నూతన నటుడి పురస్కారం అందుకున్నాడు. 2003 లో వచ్చిన నిజం సినిమాకు మొదటి సారిగా నంది ఉత్తమ నటుడు పురస్కారం అందుకున్నాడు. తర్వాత 2005 లో వచ్చిన అతడు, 2011 లో వచ్చిన దూకుడు, 2015 లో వచ్చిన శ్రీమంతుడు చిత్రాలకు కూడా ఉత్తమ నటుడిగా నంది పురస్కారాలు గెలుచుకున్నాడు. ప్రస్తుతం ఆయన ఎస్ ఎస్ రాజమౌళి కాంబినేషన్లో సినిమా చేస్తున్నారు.