Reading Time: < 1 min

Top 6th Actor 2024
టాప్ 6వ యాక్టర్ 2024

తెలుగు పరిశ్రమలో చాలామంది హీరోలు ఉన్నారు. వారికి కోట్లల్లో అభిమానులు ఉన్నారు. అందరిలో ఎవరు నెంబర్ వన్ స్థానంలో ఉన్నారు అంటే మాత్రం అంత సులువుగా చెప్పడం కష్టం. అయితే సినిమా విజయాన్ని బట్టి ఏ హీరో అగ్రస్థానంలో ఉన్నాడో చెప్పగలం. అలాగే సినిమాకు వచ్చిన కలెక్షన్లను బట్టి, హీరో తీసుకున్న పారితోషికాన్ని బట్టి, హీరో చేసిన సినిమాలను బట్టి కూడా వారి స్థానాలను నిర్ణయించడం ఒక పద్ధతి. అయితే 2024లో విడుదలైన సినిమాలు ఆ చిత్రాలలో కథానాయకులుగా వారు పోషించిన పాత్రలు అవి ప్రేక్షకులకు కనెక్ట్ అయిన విధానాన్ని బట్టి టాప్ 10 హీరోలలో ఆరవ స్థానంలో ఉన్న హీరో ప్రభాస్.

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ప్రధాన పాత్రలో నటించిన భారీ బడ్జెట్ చిత్రం కల్కి ఈ ఏడాది విడుదలై పెద్ద విజయం సాధించింది. ప్రభాస్ నటించడంలో ఆయనకంటూ ప్రత్యేకశైలీ ఉంటుంది. ప్రేక్షకులను ఎలా ఆకర్షించాలో ఆయనకు బాగా తెలుసు. అందుకే ఈ సంవత్సరం టాప్ 6వ స్థానంలో ఉన్నారు. ఈ సందర్భంగా ఆయన జర్నీని ఒకసారి చూస్తే.. జయంత్ పరంజీ దర్శకత్వంలో వచ్చిన ఈశ్వర్ సిినిమా మొదటిది. తరువాత రాఘవేంద్ర సినిమా పరాజయం అయింది. ఆ సమయంలో వర్షం సినిమా వచ్చింది. ప్రభాస్‌లో ఉన్న మాస్ కోణం ఎలివేట్ అయింది. అడవి రాముడు యావరేజ్ టాక్ తెచ్చుకుంది. క్రియేటీవ్ దర్శకుడు కృష్ణవంశి తెరకెక్కించిన ఫ్యామిలీ ఓరియెంటెడ్ చిత్రం చక్రం సైతం అంతగా రుచించలేదు. అలాంటి సమయంలో రాజమౌళి కాంబినేషన్ లో ఛత్రపతి వచ్చింది. వెండితెరపై ప్రభాస్ నడిచివస్తుంటే విజిల్స్ పడ్డాయి. భారీ యాక్షన్ సీన్స్ ఉన్నాయి. అప్పటి వరకు ప్రభాస్ అలా ఎవరూ చూపించలేదు. ఛత్రపతి బ్లాక్ బస్టర్ హిట్ అయింది.

ఆ తరువాత పౌర్ణమి, యోగి, మున్నా, బుజ్జిగాడు, బిల్లా, ఏక్ నిరంజన్, డార్లింగ్ చిత్రాలు వచ్చాయి. మిస్టర్ ఫర్ఫెక్ట్ తో ఫ్యామిలీ ఆడియెన్స్‌ను మెప్పంచాడు. వెంటనే వచ్చిన రెబల్ ఈ చిత్రంలో ప్రభాస్ స్టైల్, ఆ స్వాగ్‌కు చాలా మంది ఫ్యాన్స్ ఉన్నారు. కొరటాల శివ మిర్చి సినిమా చేశారు. బాక్స్ ఆఫీస్ వద్ద ఘన విజయం సాధించింది. మళ్లీ రాజమౌళి కాంబినేషన్ లో బహుబలి విడుదలై రికార్డులు కొల్లగొట్టింది. ఈ చిత్రంతో పాన్ ఇండియా స్టార్‌గా అవతరించారు. సాహో, రాధేశ్యామ్, ఆదిపురుష్ చిత్రాలు నిరాశ పరిచాయి. ప్రశాంత్ నీల్ తెరకెక్కించిన సలార్ తో ఘన విజయాన్ని అందుకున్నారు. ఆ తరువాత మరో అద్భుతమైన సైన్స్ ఫిక్షన్ కల్కి భారీ విజయం సాధించింది. ప్రస్తుతం సలార్ 2, కల్కి 2 చిత్రాలతో పాటు మారుతి దర్శకత్వంలో రాజాసాబ్ చిత్రంలో నటిస్తున్నారు. వీటితో పాటు సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో స్పిరిట్, హనురాఘవ పూడి దర్శకత్వంలో మరో సినిమా లైనప్ లో ఉంది.