Top 6th Movie 2024
టాప్ 6వ చిత్రం 2024
సినిమా పరిశ్రమలో ప్రతీ సంవత్సరం వందలాది చిత్రాలు విడుదల అవుతున్నాయి. అలాగే 2024లో అన్ని భాషల్లో కలిపి 300 కు పైగా చిత్రాలు తెలుగు తెరపైన ప్రదర్శించబడ్డాయి. వాటిలో ఎన్నో చిత్రాలు విజయాన్ని సాధించగా, కొన్ని చిత్రాలు పరాజయాన్ని చవిచూశాయి. ఒక సంవత్సరంలో ఎన్ని చిత్రాలు విడుదలైనా కొన్ని చిత్రాలు మాత్రం మనసుకు దగ్గరగా ఉంటాయి. వాటినే మనం ఎమోషనల్ ఎంగేజ్మెంట్ చిత్రాలు అంటాము. మరి 2024లో ఎమోషనల్ ఎంగేజ్మెంట్ అందించిన టాప్ 10 చిత్రాలలో హనుమాన్ సినిమా ఆరవ స్థానంలో ఉంది.
చిన్న సినిమాగా తెరకెక్కి పాన్ ఇండియా స్థాయిలో విడుదలై, భారీ వసూళ్లను రాబట్టిన చిత్రం హనుమాన్. ప్రశాంతవర్మ దర్శకత్వంలో తేజ సజ్జ హీరోగా నటించిన ఈ చిత్రంలో అమృత అయ్యారు హీరోయిన్ గా నటించారు. తెలుగులో సూపర్ మాన్ క్యారెక్టర్ తో తీసిన ఈ చిత్రం మంచి వసుళ్లలను రాబట్టి అందరి హృదయాల్లో స్థానం సంపాదించుకుంది. ఇలాంటి కాన్సెప్ట్ సినిమాలు హాలీవుడ్ లో చూస్తుంటాము. ఈ మధ్య తెలుగులో కూడా వస్తున్నాయి. కామన్ మ్యాన్ అయినా హనుమంతుకు సూపర్ పవర్స్ వస్తే ఏం జరుగుతుంది అనేది ఈ సినిమా కాన్సెప్ట్. ఈ సినిమాలో సప్త చిరంజీవులను చూపిస్తున్నట్లు డైరెక్టర్ చెప్పారు. ఈ నేపథ్యంలో హనుమాన్ పవర్ చూపించారు కానీ ఆయన్ను పూర్తిగా పార్ట్ 2లో చూడొచ్చు. అలాగే విధురుడిని చూపించారు. ఈ క్యారెక్టర్ లో సముద్రఖని నటించారు. ఆ తరువాత మిగితా చిరంజీవులను ఎలా కనెక్ట్ చేస్తారు అనే పాయింట్ అందరిలో చాలా ఎక్సైట్మెంట్ ను కలిగిస్తుంది.