Reading Time: < 1 min

Top 7th Actor 2024
టాప్ 7వ యాక్టర్ 2024

తెలుగు పరిశ్రమలో చాలామంది హీరోలు ఉన్నారు. వారికి కోట్లల్లో అభిమానులు ఉన్నారు. అందరిలో ఎవరు నెంబర్ వన్ స్థానంలో ఉన్నారు అంటే మాత్రం అంత సులువుగా చెప్పడం కష్టం. అయితే సినిమా విజయాన్ని బట్టి ఏ హీరో అగ్రస్థానంలో ఉన్నాడో చెప్పగలం. అలాగే సినిమాకు వచ్చిన కలెక్షన్లను బట్టి, హీరో తీసుకున్న పారితోషికాన్ని బట్టి, హీరో చేసిన సినిమాలను బట్టి కూడా వారి స్థానాలను నిర్ణయించడం ఒక పద్ధతి. అయితే 2024లో విడుదలైన సినిమాలు ఆ చిత్రాలలో కథానాయకులుగా వారు పోషించిన పాత్రలు అవి ప్రేక్షకులకు కనెక్ట్ అయిన విధానాన్ని బట్టి టాప్ 10 హీరోలలో ఏడవ స్థానంలో ఉన్న హీరో సిద్దు జొన్నలగడ్డ.

డిజె టిల్లు తో తనకంటూ ఒక ప్రత్యేకమైన ఆటిట్యూడ్ ను ప్రేక్షకులకు పరిచయం చేసి సిద్ధూ జొన్నలగడ్డ అంటే మన పక్కింటి కుర్రాడు అనే టాగ్ సంపాదించుకున్నారు ఈ హీరో. ఈ సంవత్సరంలో ఆయన నటించిన టిల్లు స్కేర్ చిత్రం విడుదలై ప్రేక్షకులకు బాగా దగ్గరయింది. ఈ సినిమాలో ఆయన పర్ఫామెన్స్ అందరికీ నచ్చింది. కేవలం యాక్టర్ మాత్రమే కాదు సిద్దు మల్టీట్యాలెంటెడ్. రచయిత, దర్శకుడు కూడా తనలో ఉన్నాడు. టిల్లు సీక్వెల్ తో హల్ చల్ సృష్టించిన సిద్దు టిల్లు క్యూబ్ సైతం సిద్ధం చేస్తున్నారు. జోష్ సినిమాలో ఓ చిన్న క్యారెక్టర్ యాక్టర్ గా కనిపించారు. అరెంజ్, భీమిలీకబడ్డి జట్టు, డాన్ శీను వంటి చిత్రాలలో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. ఎల్బీడబ్ల్యూ చిత్రంతో హీరోగా పరిచయం అయ్యారు. గుంటూరుటాకీస్, కృష్ణ అండ్ హిస్ లీలా చిత్రంతో హిట్ కొట్టి డీజే టిల్లు సినిమాతో సాలిడ్ హిట్ అందుకున్నారు.