Reading Time: < 1 min

Top 7th Director 2024
టాప్ 7వ డైరెక్టర్ 2024

తెలుగు పరిశ్రమలో చాలామంది డైరెక్టర్లు ఉన్నారు. ప్రతీ డైరెక్టర్ కు తనకంటూ స్పెషల్ స్టైల్ ఉంటుంది. మరికొన్ని రోజుల్లో నూతన సంవత్సరం రాబోతుంది. 2024లో అన్ని భాషల్లో కలిపి 300 కు పైగా చిత్రాలు విడుదలయ్యాయి. అందులో చాలా రకాల జానర్స్ ను తెరకెక్కించారు డైరెక్టర్లు. అందులో కొంతమంది థ్రిల్ ని బాగా హ్యండిల్ చేస్తారు. మరొకొందరు ఎమోషనల్ సీన్స్ బాగా హ్యండిల్ చేస్తారు. అయితే ఏ సినిమా అయినా ప్రేక్షకులను ఆకట్టుకోవాలంటే థ్రిల్ మాత్రమే కాదు ఎమోషనల్ ఎంగేజ్మెంట్ అందించే సీన్స్ పండాలి. అలా పండాలంటే డైరెక్టర్ల శ్రమ, పట్టుదలతో పాటు ప్రతిభ కూడా కావాలి. మరి ఈ సంవత్సరం సినిమాలు తెరకెక్కించిన డైరెక్టర్లలో టాప్ 10 డైరెక్టర్లలో వెంకీ అట్లూరి ఏడవ స్థానంలో ఉన్నారు.

యంగ్ డైరెక్టర్ వెంకీ అట్లూరి దర్శకత్వంలో వచ్చిన చిత్రం లక్కీ భాస్కర్. ఈ మూవీలో దుల్కర్ సల్మాన్, మీనాక్షి చౌదరి జంటగా నటించారు. సాధారణ క్యాషియర్ అయినా భాస్కర్ కోట్లు ఎలా సంపాదించాడు అనే కాన్సెప్ట్ తో ఈ చిత్రాన్ని తెరకెక్కించారు డైరెక్టర్ వెకంట్ అట్లూరి. ఈ సిినిమా కోసం బ్యాంకింగ్ సెక్టార్ లో జరిగే ఎన్నో అంశాలను అద్భుతంగా చూపించారు. అందుకే ఈ చిత్రం విపరీతంగా కనెక్ట్ అయింది. ఈ సినిమాను తెరకెక్కించిన వెంకీ అట్లూరి టాప్ డైరెక్టర్లలో 7వ స్థానంలో ఉన్నారు. 2007లో వచ్చిన జ్ఞాపకం సినిమాలో నటించాడు. ఆ తరువాత స్నేహగీతం సినిమాలో నటించి, సంభాషణలు రాశాడు. నెక్ట్స్ ఇట్స్ మై లవ్ స్టోరీ సంభాషణలు, 2015లో వచ్చిన కేరింత సినిమాకు రచనా సహకారం అందించాడు. వరుణ్ తేజ్ హీరోగా తెరకెక్కిన తొలిప్రేమ సినిమాకు తొలిసారిగా దర్శకత్వం వహించాడు. మిస్టర్ మజ్ను, రంగ్ దే సినిమాలకు దర్శకత్వం చేశాడు. లక్కిభాస్కర్ హిట్ తో ఫుల్ జోష్ లో ఉన్నారు.