Top 8th Director 2024
టాప్ 8 వ డైరెక్టర్ 2024
తెలుగు పరిశ్రమలో చాలామంది డైరెక్టర్లు ఉన్నారు. ప్రతీ డైరెక్టర్ కు తనకంటూ స్పెషల్ స్టైల్ ఉంటుంది. మరికొన్ని రోజుల్లో నూతన సంవత్సరం రాబోతుంది. 2024లో అన్ని భాషల్లో కలిపి 300 కు పైగా చిత్రాలు విడుదలయ్యాయి. అందులో చాలా రకాల జానర్స్ ను తెరకెక్కించారు డైరెక్టర్లు. అందులో కొంతమంది థ్రిల్ ని బాగా హ్యండిల్ చేస్తారు. మరొకొందరు ఎమోషనల్ సీన్స్ బాగా హ్యండిల్ చేస్తారు. అయితే ఏ సినిమా అయినా ప్రేక్షకులను ఆకట్టుకోవాలంటే థ్రిల్ మాత్రమే కాదు ఎమోషనల్ ఎంగేజ్మెంట్ అందించే సీన్స్ పండాలి. అలా పండాలంటే డైరెక్టర్ల శ్రమ, పట్టుదలతో పాటు ప్రతిభ కూడా కావాలి. మరి ఈ సంవత్సరం సినిమాలు తెరకెక్కించిన డైరెక్టర్లలో టాప్ 10 డైరెక్టర్లలో చిదంబరం ఎస్ పొదువల్ ఎనిమిదవ స్థానంలో ఉన్నారు.
చిన్న సినిమాగా మలయాళంలో విడుదలైన మంజుమ్మల్ బాయ్స్ మిగతా భాషల్లో కూడా అనువాదం చేసుకొని విడుదలైన అన్నిచోట్ల పాజిటివ్ టాక్ తెచ్చుకుంది. గుణ కేవ్స్ లో ప్రమాదవశాత్తు పడిపోయిన తమ స్నేహితుని తన ఫ్రెండ్స్ ఎలా కాపాడారు అనే పాయింట్ తో ఈ సినిమాను తెరకెక్కించారు. చివరి వరకు ప్రేక్షకుడిని ఉక్కిరిబిక్కిరి చేసిన ఈ చిత్రం మంచి ఎమోషనల్ ఎంగేజ్మెంట్ ని అందించింది. ఇలాంటి అద్భుతమైన సినిమాను అందించిన చిదంబరం ఎస్ పొదువల్ టాప్ 10 లో ఎనిమిదవ స్థానంలో ఉన్నారు. ఈ డైరెక్టర్ 2021లో మలయాళంలో జాన్ ఈ మాన్ అనే చిత్రం తీశారు.