Top 8th Movie 2024
టాప్ 8వ చిత్రం 2024
సినిమా పరిశ్రమలో ప్రతీ సంవత్సరం వందలాది చిత్రాలు విడుదల అవుతున్నాయి. అలాగే 2024లో అన్ని భాషల్లో కలిపి 300 కు పైగా చిత్రాలు తెలుగు తెరపైన ప్రదర్శించబడ్డాయి. వాటిలో ఎన్నో చిత్రాలు విజయాన్ని సాధించగా, కొన్ని చిత్రాలు పరాజయాన్ని చవిచూశాయి. ఒక సంవత్సరంలో ఎన్ని చిత్రాలు విడుదలైనా కొన్ని చిత్రాలు మాత్రం మనసుకు దగ్గరగా ఉంటాయి. వాటినే మనం ఎమోషనల్ ఎంగేజ్మెంట్ చిత్రాలు అంటాము. మరి 2024లో ఎమోషనల్ ఎంగేజ్మెంట్ అందించిన టాప్ 10 చిత్రాలలో టిల్లు స్కేర్ ఎనిమిదవ స్థానంలో ఉంది.
ఎమోషనల్ ఎంగేజ్మెంట్ కొంతే ఉన్నా ఎంటర్టైన్మెంట్ పరంగా అగ్రస్థానంలో నిలిచిన చిత్రం టిల్లు స్క్వేర్. సిద్దు జొన్నలగడ్డ హీరోగా మల్లిక్ రాం దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం టాలీవుడ్ ప్రేక్షకులను పొట్ట చెక్కలయ్యేలా నవ్వించింది. డీజే టిల్లు సినిమాకు సీక్వెల్ గా వచ్చినప్పటికీ దానికదే యూనిక్ స్టైల్ లో ఉంది. సినిమాలో చాలా వరకు ఫన్ ఎలిమెంట్స్ మాత్రమే ఉంటాయి. నిజానికి ప్రేక్షకులకు ఏం కావాలో అది టిల్లు స్క్వేర్ చిత్రంలో ఉంటుంది. అందుకే 2024లో విడుదలైన 300 వందలకు పైగా చిత్రాల్లో టిల్లు స్క్వేర్ ప్రత్యేక స్థానాన్ని సంతరించుకుంది.